పాహిమాం క్షీరసాగర తనయే

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


రాగం: తోడి తాళం: చతురశ్ర త్రిపుట

పాహిమాం క్షీరసాగర తనయే మోహనాంగ వాసుదేవ జాయే||

దేహి మే ముదం మణిమయ వలయే గేహమావిశ మామకం సదయే||

విరించీశవంది సంపూజితే సరోజదళ నయన సంశోభితే
విరాజమాన హేమ వసనయుతే వరాభరణ భూషితే సుమహితే
దరహాసయుతే ముని వినుతే శరణాగతేప్సిత కల్పలతే
నిరుపమ సౌందర్యపూరితే నిఖిల కల్యాణ గుణ భరితే||