పావన రామ

వికీసోర్స్ నుండి


    కాపీ రాగం      ఆది తాళం

ప: పావన రామ నామ సుధారస

పానము జేసేదెన్నటికో

సేవించియు శ్రీహరి పాదంబులు

చిత్తమునుంచే దెన్నటికో || పావన రామ ||


చ1: దాసులగని సంతోషమ్మున తవ

దాసోహమ్మను టెన్నటికో

భూ సుతకుసు నతి ప్రాణప్రదంబగు

పురుషోత్తము గనుటెన్నటికో || పావన రామ ||


చ2: చంచల గుణములు మాని సదా ని

శ్చలమతి నుండేదెన్నటికో

పంచ తత్వములు తారక నామము

పఠియించుట నా కెన్నటికో || పావన రామ ||


చ3: ఇనవంశాంబుధి చంద్రుడు కృప ని

ష్టార్ధము లొసగే దెన్నటికో

కనకచేలు కరుణాలవాలుని

కన్నుల జూచే దెన్నటికో || పావన రామ ||


చ4: వంచన లేకను భద్రాదీశుని

వర్ణన చేసేదెన్నటికో

అంచితముగ రామదాసుడ ననుకొని

ఆనందించే దెన్నటికో || పావన రామ ||

This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.

 
"https://te.wikisource.org/w/index.php?title=పావన_రామ&oldid=26016" నుండి వెలికితీశారు