పారిభాషిక పదములు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

(.......) ఇట్లు కుండలీకరణము (బ్రాకెట్)లలో కనిపించు విషయము మహాకవి శ్రీ బమ్మెర పోతనామాత్యుడు స్వయముగా వ్రాసినది కాదు. సంస్కృత మహాభాగవతము ననుసరించి అర్వాచీనులైన వ్రాయసకాండ్రెవరో తెలుగు భాగవతమునందు చొప్పించినవి కావచ్చును.ఇట్లు చొప్పింపఁబడిన భాగములకు ప్రక్షేపణములని పేరు.


స్కంధము - శ్రీమన్మహాభాగవతమునందలి ప్రధాన విభాగము


అధ్యాయము - ఈ విధమైన విభాగమునకు తెలుగు మహాభాగవతములో అంతగా ప్రాధాన్యము లేదు. ఇది సంస్కృత మహాభాగవతమునందలి అధ్యాయ క్రమము ననుసరించి చేసినది మాత్రమే. తెలుగు మహాభాగవతమునందు ఘట్టములకు మాత్రమే ప్రాధాన్యము.


సంఖ్య - సంఖ్య (ఉదా :- 1-20) : ఈ విధమైన పరిభాషలో మొదటి అంకె స్కన్ధమును, రెండవ సంఖ్య అందలి పద్యమును గాని వచనమును గాని సూచించును.


శా. = శార్దూల విక్రీడితమను సంస్కృత వృత్తభేదము

మ. = మత్తేభ విక్రీడితమను సంస్కృత వృత్తభేదము

ఉ. = ఉత్పల మాలిక అను సంస్కృత వృత్తభేదము

చం. = చంపక మాలిక అను సంస్కృత వృత్తభేదము

కం. = కందము అను ఆర్యాభేదము

ఆ.వె. = ఆటవెలది అను తెలుగు పద్యభేదము

తే.గీ. = తేటగీతి అను తెలుగు పద్యభేదము

సీ. = సీసము అను తెలుగు పద్యభేదము

వ. = ఛందో నిర్బంధము లేని స్వేచ్ఛావచనము