పాప!
Jump to navigation
Jump to search
పాప!
రచన: కాలనాధభట్ట వీరభద్ర శాస్త్రి
ఏమిటి వెతుకుతున్నారు? ముత్యాలకోసం పాప నవ్వింది
ఈ వేళ చందమామ రాడు అవును అమావాశ్యకదా!
అదేంకాదు! పాపమొహంచూసి కుళ్ళు
నాలుగేళ్ళనూంచి చూస్తున్నా ఈ రుమ్మాలు వుతికించరా?
వద్దు వద్దు మనం వస్తోంటే పాప ఏడ్చింది దాని కన్నీళ్ళు తుడిచా
ఇదిగో ఫోన్ రింగవుతోంది చూడు పాప ఫోన్ చేసిందండీ పాప పుట్టిందిట
ఏమిటి తాత గారూ దీక్షగా చుస్తున్నారు?
పాపా! నీకూతురుది నవ్వుతూవుంటే నీపోలికే అబ్బో ఎన్ని ముత్యాలో !!