Jump to content

పాడుతా తియ్యగా

వికీసోర్స్ నుండి

ఈ పాట ఆచార్య ఆత్రేయ రచన:

ప|| పాడుతా తియ్యగా చల్లగా (2)

పసిపాపలా నిదురపో తల్లిగా, బంగారు తల్లిగా || పాడుతా ||


చ|| కునుకుపడితె మనసు కాస్త కుదుట పడతది

కుదుటపడ్డ మనసు తీపికలలు కంటది | కునుకు |

కలలె మనకు మిగిలిపోవు కలిమి చివరకు | కలలె |

ఆ కలిమి కూడ దోచుకులే దొరలు ఎందుకు? || పాడుతా ||


చ|| గుండెమంటలారిపే చన్నీళ్ళు కన్నీళ్ళు

ఉండవన్న ఉండవమ్మ శాన్నాళ్ళు | గుండె |

పోయినోళ్ళూ అందరూ మంచోళ్ళు | పోయి |

ఉన్నోళ్ళూ పోయినోళ్ళ తీపి గురుతులు || పాడుతా ||


చ|| మడిసిపోతె మాత్రమేమి మనసు ఉంటది

మనసుతోటి మనసెపుడో కలిసిపోతది | మడిసి |

చావుపుటుకలేనిదమ్మ నేస్తమన్నది | చావు |

జనమ జనమకది మరీ గట్టి పడతది || పాడుతా ||