పల్నాటి చరిత్ర/రామరాజు మంత్రప్ప దేశాయి

వికీసోర్స్ నుండి

శీఘ్రఫలితములనిచ్చి యెక్కువభూమి సాగుబడి యీ ప్రాజెక్టు వలన కాగలదు. ఇప్పటి యంచనాల ప్రకారము ఈ ప్రాజెక్టు వలన 70 లక్షలయకరముల భూములు సాగగును. 2 లక్షల కిలోవాట్ల విద్యుచ్ఛక్తి యుత్పత్తికాగలదు. 35 లక్షల టన్నుల ధాన్యమధికముగా నుత్పత్తికాగలదు. అదిగాక ఈ ప్రాజెక్టుకు నగు ఖర్చులో కొంత భాగమును నైజాము ప్రభుత్వము భరించును గనుక మితవ్యయముతో నిది పూర్తికాగలదు.

రామరాజు మంత్రప్పదేశాయి

'అబుల్ హసన్' అనునతకుడు గోల్కొండ రాజ్యమును క్రీ. శ. 1672 నుండి 1687 వఱకు పాలించెను. ఇతడు హిందువులను మహమ్మదీయులను సమానముగా జూచెను. ఇతనికి తానీషాయను బిరుదుకలదు . ఇతనికాలముననే భద్రాద్రి రామదాసుకధ జరిగినది. అదివఱకు మంత్రిగానుండిన ముజాఫరును దొలగించి పింగళి మాదన్నను క్రీ.శ. 1673 లో మంత్రి కానియమింను పింగిళి మాదన్నకు సూర్యప్రకాశరావను బిరుదముకూడ పిచ్చెను. మాదన్నకు సోదరుడగు అక్కన్న యితనివద్ద సేనాపతిగానుండెను. అప్పుడు పల్నాడు గోల్కొండ నవాబు క్రింద నుండెను. అర్జీపెట్టి రామరాజు మంత్రప్పదేశాయి యనునతడు తానీషానుండి, మాచర్ల, తుచ్చుకోడు కారెంపూడి, గురజాల తంగెడ యను అయిదుపరగణాలను మహసూళ్ల చౌదరితనము (శిస్తు వసూలు చేయు నధికారముగల సీమ పెత్తనము) పుత్రపౌత్ర పారంపర్యముగా నుండు నట్లు హిజరి 1091 (1678 A. D.) లో సంపాదించెను. శిస్తులో నూటికి అయిదువరహాల చొప్పున జమీందారి రుసుమున్ను, నూఱుకుచ్చెళ్లకు 5 కుచ్చెళ్ల చొప్పున ఈనామున్ను ప్రతిసంవత్సరము పుత్రపౌత్ర పారంపర్యముగా ననుభవించునట్లు ఈయబడెను, ఆఫర్మానామీద ముంజుదారు సూర్యప్రకాశ రావుజీయని మహారాష్ట్ర భాషలో సంతకముండెను. ముంజుదా రనగా మహారాష్ట్ర పరిపాలనా పద్ధతిలోని యార్థికమంత్రికి పేరు. సూర్యప్రకాశ రావనునది మాదన్న కుబిరుదు. అక్కరు సుభాన్ పంతులు గారు (అక్కన్నగారు) పల్నాటిని పర్యటించి హనుమంతునిపాడు, వీరభద్రాపురమను గ్రామములు కట్టించి మాచెర్ల వీరేశ్వరస్వామికి (వీరభద్రునకు) యీ నాముగా 23 రబ్బీరవల్ 1092 హిజరి (1674 A. D.) తేదిననిచ్చెను. ఆ రెండుగ్రామము లిప్పుడు లేవు. శిధిలములైనవి. క్రీ.శ. 1687 లో గోల్కొండరాజ్య మపురంగజేబు వశమయ్యెను. అలంగీరు పాదుషా (ఔరంగజేబు) చేత 1106 హిజరీలో (1688 A.D.) పల్నాటితాలూకా మాచర్ల, గురజాల, కారెంపూడి, తుమృకోడు, తంగెడయను యయిదు పరగణాలు రామరాజు మంత్రప్పకు తహసీలు వసూలు చేయుట జరుపగలందులకు పుత్రపౌత్ర పారంపర్యముగా నధీనముచేయబడెను. సంవత్సరమునకు సర్కారుకు 28 వేల వరహాలు శిస్తు షేష్కసుగానుండెరు. అక్కన్నగారి దానశాసనపు, నకలును తానీషా మంత్రప్ప కిచ్చిన ఫర్మానాకు నకలును ఔరంగజేబు మంత్రప్పకిచ్చిన ఫర్మానామూలమును, తదితర పూర్వపు కాగితములును మంత్రప్పవంశీయుడగు గామాలపాటి కరణమువద్ద నిప్పటికిని నున్నవి. తానీషా యిచ్చిన ఫర్మానా భరణపు వ్యవహార సందర్భమున కోర్టులో దాఖలు కాబడినందున నకలుమాత్రమున్నది. ఔరంగజేబుయిచ్చిన ఫర్మానామూలమున్నది. పారశీక భాష లోనున్నది. వానిని నేను చూచితిని. క్రీ.శ. 1707 లో ఔరంగ జేబుచనిపోయెను. అప్పటినుండి యితర ప్రాంతములతో బాటు పల్నాడు నిజాముల స్వాధీనమయ్యెను. మనదేశములో రాజులు మారినను జమీందారీతనము గ్రామజీవనము మొదలగునవి మారలేదు. 1138 ఫసలీ కీలక సం॥ (1729 A. D) లగాయతు 1140 ఫసలీ సాధారణ సం॥ (1731 A. D.) వఱకు రామరాజు జంగమయ్య అటుపిమ్మట శంకరనారాయణ మహమ్మద్ ఖానుకు లోబడి పల్నాటికి దేశముఖులుగానుండిరి. మంత్రప్ప కుమారుడు జంగమయ్య పల్నాటిలోని స్తలకరిణీకముల ననేకము లిచ్చెను. గురజాలవద్దనున్న జంగమహేశ్వరపురమును తన పేర కట్టించెను. రామరాజు శంకరయ్య సత్రసాలకు సర్వ మాన్యముగా 50 కుచ్చెళ్ల భూమిని దానమిచ్చెను. (కుచ్చెల యనగా 30 ఎకరములుండును) మాచెర్ల వీరభద్రస్వామికి 10 కుచ్చెళ్ల భూమి ఈనామిచ్చెను . వీరియింటియాడపడుచు నానమ్మ యనునామె జంగమహేశ్వరపురమువద్దనున్న నానమ్మ చెరు వును తనపేర త్రవ్వించెను. దేవాలయములకును లంకావారు మున్నగు బ్రాహ్మణులకునింకను కొన్ని భూదానములీయబడెను వీరి యింటివేల్పగు అంబపేర అంబాపురము కట్టబడి నట్లును, అల్లుమల్లెపాడు, మల్లవర అగ్రహారముల వీరిచ్చినట్లు చెప్పెదరు. శంకరనారాయణ పెద్ద అగ్రహారమును రేమిణి వారికిచ్చెను. చిన అగ్రహారమును పరీధావి (1738 A. D )లో వెంపటివారికిచ్చెను. వీరిచ్చిన అగ్రహారములలో త్రిపురసుం దరీపురము, వెంకమాంబాపురము, నరసమాంబాపుర మను నవి సర్కారులెక్కలలో గురజాలకు శివారులుగా నున్నవి. అంతట పల్నాడు ఆర్కాటునవాబు స్వాధీనమయ్యెను. మంత్రప్ప మనుమడు వీరభద్రయ్య వరుసగా 34 సంవత్సరములు పల్నాటికి దేశముఖుడుగా నుండెను. అడిగొప్పుల అయ్యవార్లంగారు పరవస్తు శ్రీనివాసాచార్యులు గారికి నిధానంపాడు అగ్రహారమును రామరాజు వీరభద్రయ్య దేశాయి క్రీ. శ. 1718లో నిచ్చెను. నవాబుకు చెల్లించవలసిన పైకము సరిగా చెల్లించనందున నవాబగు మహమ్మదుఖాన్ క్రీ.శ. 1764 లో నీరభద్రయ్యను తొలగించెను. వీరభద్రయ్య కుమారుడు రాజే శ్వరరాయుడు అప్పటినవాబగు వాలాజా గారికి అర్జి పెట్టుకొనగా నవాబతనికి నెల 1 కి 200 వరహాల చొప్పున భరణ మిచ్చెను. అటుపిమ్మట నెల 1 100 వరుకు వరహాలకు తగ్గిం చెను . పల్నాడు ఆర్కాటునవాబునుండి ఈస్టుయిండియా కంపెనివారికి స్వాధీనమయినపిమ్మట రాజేశ్వరరావు బ్రదికి యున్నంతవఱకు నెల 1 కి 75 వరహాల చొప్పున కంపెనివారు భరణమిచ్చిరి. క్రీ శ. 1825 లో రాజేశ్వర రావు చనిపోయెను, పిమ్మట నాసంతతివారికి భరణమిచ్చుట మాని వేసిరి.