పలుకదేమిర రామ నాతో

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


రాగం: దేవమనోహరి - ఆది తాళం

ప: పలుకదేమిర రామ నాతో
    పలికితె నీదేమి సొమ్ములు పోవునా॥

అ: జలజసంభవ భవాద్యమరవినుతపద
    జలజనయన నీవు సుముఖుడై వేగమె॥

చ: నిరవధి సుఖదాయకుడని దెలిసి నే
      నే నిరతము నిజముగ నమ్మియుండగ॥
     మరచితివేమో మరవకురా రామ
     గరుడగమన వాసుదేవ దయానిధే॥