పరుగులు తీయాలి
Appearance
మల్లీశ్వరి (1951) సినిమా కోసం దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన తెలుగు పాట.
ఓ....ఓ...
హేయ్! పరుగులు తీయాలి ఓ గిత్తలు ఉరకలు వేయాలి (2)
హేయ్! బిరబిర జరజర పరుగున పరుగున ఊరు చేరాలి మన ఊరు చేరాలి
ఓ!.....హోరుగాలి కారుమబ్బులు (2), ముసిరేలోగా మూసేలోగా
ఊరు చేరాలి మన ఊరు చేరాలి
గలగల గలగల కొమ్ముల గజ్జెలు, ఖణఖణ ఖణఖణ మేళ్ళో గంటలు ఆ....ఆ.... (2)
వాగులుదాటి వంకలు దాటి ఊరు చేరాలి మన ఊరు చేరాలి
చరణం:
ఆ......ఆ.....ఆ.......అవిగో అవిగో (2)
నల్లని మబ్బులు గుంపులు గుంపులు
తెల్లని కొంగలు బారులు బారులు అవిగో అవిగో అవిగో అవిగో
నల్లని మబ్బులు గుంపులు గుంపులు
తెల్లని కొంగలు బారులు బారులు అవిగో అవిగో అవిగో
ఆ...ఆ... పచ్చనితోటలు విచ్చిన పూవులు
ఊగే గాలుల తూగే తీగలు అవిగో...
కొమ్మల మూగే కోయిల జంటలు
ఝుమ్మని మూగే తుమ్మెద గుంపులు అవిగో అవిగో
ఆ...ఆ......ఆ....ఆ.......