పరిపాహిమాం పరవాసుదేవ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


రాగం: జగన్మోహిని. తాళం: చతురశ్ర త్రిపుట

పరిపాహిమాం పర వాసుదేవ వర గానలోల మహానుభావ ||

సుర బృంద వంద్య దేవాది దేవ పరిపాలితాశ్రిత పాండవా ||

రాగాది మోహ తిమిరాళి మిత్ర - గాంగేయ సన్నుత సచ్చరిత్ర
నాగేంద్ర ఫణార్పిత పాద పద్మ - యోగీంద్ర మానస వర సద్మ ||