పరాత్పరా! రఘువరా!
స్వరూపం
రాగం: తోడి తాళం: ఆది
పరాత్పరా! రఘువరా! నిన్ను నెరనమ్మితిరా! దయాకరా!
సరోజభవ ముఖ సురేహరితార్త్త గిరీశ సురుచిర సరస మదహర||
శిరీష సన్నిభ శరీర శోభిత ధరాత్మజా మనోహరా!
నరేంద్ర దశరథ సుకుమారా! నన్ను మరవకురా! ఇంత పరాకేలరా!||
నీవే గతిగాదా! నీ దయలేదా! శ్రీ వాసుదేవా! దేవాది దేవా! భవనుత
మహానుభావా! మిదవిభవ ఈవేళా! నా మొరలను వినరాదా! ముని జననుత
పాదా! రావణాది రిపుదమనా! రక్షిత భువనా! పవన తనయ నిత్యానందద!||