Jump to content

పండితారాధ్యచరిత్ర (గుజిలీప్రతి)

వికీసోర్స్ నుండి

శ్రీ శివాయ నమః,
శ్రీమాన్ జగద్గురు మల్లికార్జున

శ్రీ పండితారాధ్యచరిత్ర



శ్రీమదష్టభాషా సుకవిత్వ రచనా బిరుదాంకితులగు
పాల్కురికి సోమనారాధ్యకవిచే రచింపబడినది.
ఇది
మ॥ రా॥ నిడుదవోలు సుందరపంతులవారిచేతను
శ్రీగురు శ్రీగిరి దిగంబర మల్లికార్జునస్వాములవారి సేవకుడగు
చింతకుంట పసపుల నాగయ్యగారిచేతను
మూడుప్రతులను చూచి సవరింపబడి
చింతకుంట పసపుల నాగయ్యగారిచే
శ్రీ విజయరామచంద్ర ముద్రాక్షరశాలయందు
ముద్రింపించి ప్రకటింపబడియె.
విశాఖపట్టణము
1914 ఆనంద సం॥ర ఆషాఢ బ౧౩ సోమవారము.

వెల 1 రూపాయి.]

[పోస్టేజి గాక


ఉ.

శ్రీభసితత్రిపుండ్రకపరీతవిశంకటపాలు జాటజూ
టీభరదారు నిర్మలపటీపటలావృతదేహు నక్షమా
లాభరణాభిరాము బసవాక్షరపాఠపవిత్రవక్త్రు చి
చ్చోభితచిత్తు పాల్కురికి సోమయదేశికు బ్రస్తుతించెదన్.


పండితారాధ్యచరిత్ర దీక్షాప్రకరణము

శ్రీ రుద్రోపనిషత్తున్నూ రుద్రసూక్తములున్నూ వేదసూక్తములు న్నూ ఆగమయుక్తములున్నూ పురాణయుక్తములున్నూ బసవపురాణ పీఠికయున్నూ గణాడంబరమున్ను దృక్పటిత్వదృగంతములున్నూ, వ్యా సాష్టకమున్నూ చేరియున్న యవి. శైవులకును జంగములకున్నూ ఆరా ధ్యులకును శివభక్తులకున్నూ ముముక్షాపేక్షులగు భక్తులకున్ను అత్యం తోపయుక్త మయినది.

ఈగ్రంథములు కావలసినవారలు చింతకుంట పసవుల నాగయ్యగా రిపేరనుగాని కర్నూలుజిల్లా కోవెలకుంట్లతాలుకా యింజేడుగ్రామ నివాసులగు బచ్చు చెంచెయ్య శ్రేష్ఠిగారి కుమారులు సుజనప్రియుఁడగు చిన్న వెంగయ్య శ్రేష్ఠిగారిపేరనుగాని వ్రాసితెప్పించుకోవచ్చును.

దీనివెల వకరూపాయి

పీఠిక

శ్రీమించు నాంథ్రదేశము। క్షేమముకర్నూలుజిల్ల శిరువళ్ల యనే
సీమన్ తాలూక నపర। గ్రామము పెదచింతకుంట గల దప్పురిలోన్.

కర్నూలుజిల్లా శిరువళ్ల తాలూకా పెదచింతకుంట గ్రామనివాసి వైశ్యరత్నాకరుండగు పసవుల పుట్టయ్య శ్రేష్ఠివారి కుమారులు నాగయ్యగారు తండ్రియగు పుట్టయ్యశ్రేష్ఠిగారు తీరిపోవునప్పుడు సత్కార్యము యాచరించుమన్నందుకుగా యీపండితారాధ్య గ్రంథమును చదివి చూచి యింతకు నాకు మేలుతోచక రెండు తాటిఆకులగ్రంథములున్నూ వకటి చేతివ్రాతకాగితపుస్తుకగ్రంథమును యీనాగయ్యయును నిడుదవోలు సుందరపంతులవారును వివరముగా చూచినవెనుకనే యీనాగయ్యగారు పుట్టయ్యగారివాక్యమునకుగాను అచ్చుకు విడిచియున్నారు. శ్రీగిరి షణ్మంతస్థాపనాచార్యులగు దిగంబర మల్లికార్జునస్వాముల సేవకుడును పడకండ్ల వీరయ్యగారికి ముఖ్యశిష్యుండును అయిన యీనాగయ్యగారు గురువాక్యమునకు శ్రీమహేశశతకమును శివార్పణముగా సమర్పించియున్నారు.

క.

పడకండ్లపురము పడమర। దడయుచు యయ్యేటితూర్పుదరి గురుకృప
మృడు
గుడిమ్రోలమఠమునందొ।ప్పెడిశ్రీపద్మసాలెవీరయగొలుతున్.


గీ.

విజయరామచంద్ర విభవ ముద్రాక్షర। శాల పండితేంద్రు సచ్చరిత్ర
దొడిరి విన్నకోట దుర్గరావులసభ। చర్చ జేయబడె విశాఖపురిని.


క.

గృహమున నీకృతియుంచుక
బహుళముగా చదివి విన్న భాగ్యము లొసగున్
నహరహమును పఠియించిన
సహజంబుగ ముక్తి యొసగు శంభుడు కృపతోన్.

శ్వేతవరాహకల్ప వైవస్వతమన్వంతర కలియుగ ప్రథమపాదమున 5054 అగునేటి ఆనందనామసంవత్సర ఆషాడ బ13 సోమవారము పండితారాధ్యచరిత్ర పంచమప్రకరణము యుక్తమయినది. మునులవాక్యమునకుగాను యీ నాగయ్యగారికి విక్రమనామసంవత్సర మార్గశిర బ 10 లు యత్యాశ్రమమును శ్రీగిరి మల్లికార్జునస్వాములవారు యిచ్చియున్నారు.

విషయసూచిక

కథలయొక్క నామములు

పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/5