నెరనమ్మితి నీవేగతి
స్వరూపం
రాగం: చక్రవాకం. చతురశ్ర త్రిపుట తాళం.
ప: నెరనమ్మితి నీవే గతి ధరణీసుతా వర రామ నిన్నే
అ: పరిపూర్ణ కటాక్షముతోను నన్ను కరుణించుటకిదే సమయమని
చ: నన్ను బ్రోచుటకు నీకెంత భారము నా విన్నపంబు వినరాదా నాతో వాదా
కన్న తండ్రి నీవేగదా సన్నుతాంగ శ్రీ వాసుదేవ సదా