నీ దయ రాదా
Appearance
రాగం:వసంతభైరవి
తాళం:రూపకం
పల్లవి: నీ దయ రాదా.. ||నీ||
అనుపల్లవి: కాదనెవారెవరూ కళ్యాణ రామా ||నీ||
చరణములు: నన్ను బ్రోచువాడవని నాడే తెలియ ఇన వంశ తిలక నీకింత తామసమా ||నీ||
అన్నిటికినధికారుడని నే పొగడితే మన్నించితే నీదు మహిమకు తక్కువా ||నీ||
రామ రామ రామ త్యాగరాజ హృత్సదనా నామది తలదిల్లగా న్యాయము వేగమే||నీ||