నీవుండే దా కొండపై నాస్వామి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

భాగ్యరేఖ (1957) సినిమా కోసం దేవులపల్లి కృష్ణ శాస్త్రి రచించిన లలితగీతం.


పల్లవి :

నీవుండే దా కొండపై !

నాస్వామి ! నేనుండే దీ నేలపై

ఏ లీల సేవింతునో ! ఏ పూల పూజింతునో !


చరణం 1 :

శ్రీ పారిజాత సుమాలెన్నో పూచె

ఈ పేదరాలి మనస్సెంతో వేచె

నీ పాదసేవా మహాభాగ్య మీవా

నాపైని దయజూపవా నాస్వామి ! ||| నీవుండే |||


చరణం 2 :

దూరాన నైనా కనే భాగ్య మీవా

నీ రూపు నాలో సదా నిల్వనీవా

ఏడు కొండలపైనా వీడైన స్వామి

నాపైని దయజూపవా నాస్వామి ||| నీవుండే |||