నీమోము జూపినఁ జాలు - రామ
స్వరూపం
పల్లవి:
నీమోము జూపినఁ జాలు - రామ - నిరతము మాకు వెయివేలు
తేజ కస్తురిబొట్టుతీరు - మాటి మాటికి - మది గనగోరు
చరణము(లు):
మెఱపుటద్దములను గేరు మంచి - సరసంపు చెక్కిళ్ల తీరు - గల
కన్నులఁ గాటుక గుల్క నీ - కరుణారసము - నాపయిఁజిల్క - రామ
శ్రీభద్రశైలవిహారా - యాశ్రితజన బృంద మందారా - రామ
ధరణిజ వరచిత్తచోరా - తూము - నరసింహావన కరుణాపూర - రామ