Jump to content

నీతిసారము

వికీసోర్స్ నుండి

విశ్వదేవుడైన విష్ణుమూర్తికి మోకరిల్లి సమస్త గ్రంథములలోని నీతిసారమును వివరించెదను.

ధర్మం యొక్క సారాంశాన్ని పూర్తిగా విని ధ్యానించండి. ఇతరులు మీ పట్ల ఏమి చేయదలచుకోలేదో, మీరు కూడా ఇతరులపట్ల అది చేయకండి.

పరిస్థితి అర్ధం చేసుకోకుండా ప్రవర్తించరాదు. ఎవరైనా పరిస్థితిని పూర్తిగా క్షుణ్ణంగా గమనించిన తర్వాత ప్రవర్తించవలెను. లేకుంటే ముంగిసను చంపిన బ్రాహ్మణ స్త్రీవలె రోదించవలసివుంటుంది.

మనిషి తన ఖర్మల ఫలితం అనుభవించవలసి వుటుంది. బ్రహ్మ యొక్క లక్షల సంవత్సరాల తర్వాత కూడా ఖర్మ ఎవరైనా అనుభవిస్తేనే తప్ప నసించిపోదు.

శ్రమించకుందా ఎవడునూ ధనాన్ని సంపాదించలేడు. సంపాదించడంలోనూ ఖర్చుపెట్టడంలోనూ శ్రమ ఉంది. ధనము శ్రమకు కారణమే కాదా!

గర్భిణీ అనుభవించే పురిటి నొప్పులు మరో గర్భిణీకి మాత్రమే అర్ధం అవుతుంది. గొడ్రాలు అర్ధం చేసుకోలేదు. విధంగా విజ్ణాన సముపార్జనలో విద్యాంతుడు మాత్రమే మరో విద్యావంతుడి కష్టాలను అర్ధం చేసుకోగలడు.

పిల్లవాడికి విద్య నేర్పని తల్లిదండ్రులు వాని శత్రువులు. ఎందుకనగా అతడు హంసల మధ్య కొంగ వలె మనుష్యుల మధ్య అవమానింపబడును.

ఉల్లిపాయను కర్పూరపు పాత్రలో వేసి గులాబీ రేఖల నుండి తీసిన ద్రవ్యాన్ని మరియూ కస్తూరిని పోసిన, దాని వాసన కోల్పోదు.

ఒక విద్యార్థి పావు వంతు విజ్ఞానాన్ని గురువునుండి, పావు వంతు స్వయం చదువునుండి, పావువంతు సహచరులనుండి, ఆఖరి పావు కాల క్రమేణా నేర్చుకొనును.

ఆడపిల్ల వివాహంలో తండ్రి అల్లుడి చదువును, తల్లి అల్లుడి ఆస్తిని, బంధువులు అల్లుడి పేరు ప్రతిష్ఠలను, ఆడపిల్ల అతడి అందాన్ని చూచును.

తేలుకి తోకలో విషముండును, తేనెటీగకు తలలో విషముండును, తక్షకుడికి (సర్పానికి) కోరల్లో విషముండును, చెడ్డవానికి నిలువునా విషముండును.

పక్షుల బలము ఆకాశము, చేపల బలము నీరు, పేదల బలము రాజు, పసిపిల్లల బలము ఏడుపు.

భర్తను ఎదిరించి, భర్తపై చెడు చెప్పి, భర్త లేక పిల్లల కంటే ముందుగా ఆరగించి, పరాయివారింటికి వెళ్ళే భార్యను (ఆమె పదిమంది పిల్లల తల్లి ఐనప్పటికీ) విడిచిపెట్టాలి.

సలహాలిచ్చుటలో మంత్రిలా, భర్తకు సేవ చేయడంలో పని మనిషిలా, అందంలో లక్ష్మీ దేవిలా, ఓపికలో భూదేవిలా, ప్రేమించుటలో తల్లిలా, పడకగదిలో వేశ్యలా వుండేదే నిజమైన భార్య .

నీటిలో తదిచిన గుర్రం నుండి, పిచ్చెక్కిన ఏనుగునుండి, మదమెక్కిన దున్నపోతునుండి, చదువుకొన్న మూర్ఖుడినుండి దూరంగా వుండాలి.

పాముకు పాలు పోయడం వలన విషం పెరుగును. అట్లే చెడ్డవానికి సాయం చేయుట వలన నష్టము జరుగును.

బ్రహ్మ జ్ఞానికి ఇచ్చుట వలన ఫలము అర్జునుడు గురిపెట్టిన బాణము పది ఐనట్లు, వదిలినప్పుడు వంద ఐనట్లుగా, వెళ్ళునప్పుడు వెయ్యి ఐనట్లుగా, శత్రువులను కొట్టినప్పుడు చినుకులుగా వృద్ధి చెందును.

గుర్రపు గెంతులు, మబ్బుల గర్జన, స్త్రీల ఆలోచన, మానవుడి గమ్యం, వాన రాక పోకడలు ఆ దేవుకే తెలియదు. ఇక మగవాడికి లా తెలుస్తాయి?

అసమర్ధుడు సంపాదించిన ఆస్తి, చెడ్డవాడి జ్ఞానము, అర్హతలేనివాడి భార్య - కొండపై కురిసే వాన వలె వ్యర్ధము.

నిజంతో ప్రపంచాన్ని, దానంతో బాధను, పెద్దలను సేవతో, శత్రువులను విల్లుతో జయించు.

పుష్పాల్లో మల్లె, మనుషుల్లో విష్ణువు, స్త్రీలలో రంభ, నగరాల్లో కంచి, నదుల్లో గంగ, రాజుల్లో రాముడు, కావ్యాల్లో మాఘ, కవుల్లో కాళిదాసు ఇతరులకంతే గొప్పవారు.

పునర్జన్మనిచ్చినవాడు, గురువుల వద్దకు తీసుకెళ్ళేవాడు, జ్ఞానాన్ని బోధించేవాడు, ఆహారము ఇచ్చి భయం నుండి కాపాడేవాడు - ఈ ఐదుగురు తండ్రితో సమానము.

గురువు, రాజు మరియు పెద్ద సోదరుడు యొక్క భార్య, అత్తగారు, జన్మనిచ్చే తల్లి - ఈ ఐదుగురు తల్లులు.

వాహనం నుండి 5 మూరల దూరంలోను, గుర్రం నుండి 10 మూరల దూరంలోను, ఏనుగు నుండి 1000 మూరల దూరంలోను ఉండాలి. దుష్టుడికి సాధ్యమైనంత దూరంలో ఉండాలి.

స్త్రీ తన బాల్యంలో తండ్రి రక్షణలోను, యవ్వనంలో భర్త రక్షణలోను, వృద్ధాప్యంలో కుమారుల రక్షణలోను ఉండాలి. ఆమె ఒంటరిగా ఉండరాదు.

సర్పము, దుష్టుడు ఇద్దరూ ప్రమాదకరమే. సర్పము యొక్క విషాన్ని మంత్రముతో గాని మందుతోగాని నిర్వీర్యం చేయవచ్చు. కాని దుష్టుడి విషాన్ని నిర్వీర్యం చేయగల మంత్రము గాని మందుగాని లేదు.

మనుష్యుడి జీవితకాలము, కార్యములు, అభివృద్ధి, విజ్ఞానము, మరణము మొదలైనవి తల్లి గర్భములోనే నిర్ణయించబడతాయి.

మామూలు విష్మును సద్బ్రాహ్మణుడి ఆస్తిని దక్కించుకొనే పాపపు విషముతో పోలిస్తే, అది ఏమాత్రము విలువ లేనిది. విషము ఒక మనుష్యుని మాత్రమే చంపుతుంది, కాని సద్బ్రాహ్మణుడి ఆస్తిని దక్కించుకొనే పాపపు విషము మూడు తరాలవారిని చంపుతుంది.

ఇద్దరు భార్యలను కలిగియుండుట, దారి పై ఇల్లు కట్టుకొనుట, రెండు చోట్ల వ్యవసాయము చేయుట, చట్టం పట్ల సాక్షిగా ఉండుట వంటివి కోరి తెచ్చుకొన్న దురదృష్టాలు.

కష్టములో ఉన్న ఏనుగులు, సర్పములు, పక్షులు; సూర్య చంద్ర గ్రహణములు, తెలివైన వాడి దారిద్ర్యము లను చూడగా, విధి తప్పదని చెప్పుచున్నాను.

విద్యలేనివారు అందము, యవ్వనము కలిగి ఉన్నత కుటుంబములో పుట్టినవారైనా సరే, సువాసన లేని అందమైన మోదుగ పువ్వులవలే వర్ధిల్లరు.

ఒక భార్య, ముగ్గురు కొడుకులు, రెండు నాగళ్లు, ఆరు ఆవులు మరియు రాజ్యంలో ఇల్లు కలిగిన వాడు అదృష్టవంతుడు.

అలంకరణకు వస్త్రధారణము, ఆహారమునకు నెయ్యి, స్త్రీకి సద్గుణము, మేధావులకు జ్ఞానము ప్రధానము.

చీమల పుట్ట, తేనె తుట్టిలో తేనె, శుక్లపక్షంలో చంద్రుడు, రాజు యొక్క సంపద, భిక్షాటనతో వచ్చిన ఆహారము మెల్లగా పెరుగును.

నిజము నా తల్లి, జ్ఞానము నా తండ్రి, సత్కార్యము నా సోదరుడు, జాలి నా స్నేహితుడు, శాంతి నా భార్య, ఓర్పు నా కుమారుడు. ఈ ఆరు నా బంధువులు.

ఒకని ఆయుషులో కొంతభాగాన్ని తోడ్కొని సూర్యాస్తమయం జరుగును. ఇది తెలిసి ఎవడైననూ ప్రతిదినమూ మంచి క్రియలు జరుగునట్లు ప్రవర్తించవలెను.

దుష్టుడితో తీయటి మాట్లడుట కోతి చేతులకు అందమైన పువ్వుల దండ ఇవ్వడంలాటిది.

సూర్యోదయము, శవ దహనము యొక్క పొగ, వయసు మళ్ళిన స్త్రీతో రతి, మురికి నీరు, రాత్రి వేలలో పెరుగన్నం రోజు రోజుకి అనారోగ్యాన్ని పెంచుతాయి.

సూర్యాస్తమయము, హోమం నుండి వచ్చే పొగ, యవ్వన స్త్రీతో రతి, శుభ్రమైన నీరు, రాత్రి వేళ పాల అన్నము రోజు రోజుకీ ఆరోగ్యాన్ని పెంచుతాయి.

సిరి సంపదలు ఒకని ఇంట్లో ఉన్నందున, కుమారులు మరియు బంధువులు వల్లకాడు నుండి సెలవు తీసుకొందురు. ఒకనిని మరణం తరువాత వెంబడించేవి అతడు చేసిన మంచి - చెడు క్రియలే.

నీతి గెలుస్తుంది, అవినీతి కాదు; సత్యము గెలుస్తుంది, అసత్యము కాదు; ఓర్పు గెలుస్తుంది, క్రోధము కాదు; దేవుళ్ళు గెలుచును, దెయ్యములు కాదు.

ధాన్యం నిల్వ చేసుకోవడం, పశువులను సంరక్షించుకోవడం, స్వయంగా వ్యవసాయం చేసుకోవడం, పెద్దలకు సేవ చేయడం వంటి అలవాట్లు కుటుంబాన్ని పోషిస్తాయి.

శిశువును ఐదేళ్ళ వయసు వరకూ రాకుమారుడిలా, అక్కడినుండి పదిహేను ఏళ్ళ వయసు వరకూ సేవకుడిలా చూడాలి. పదహారవ ఏట స్నేహితుడిలా చూడాలి.

మూర్ఖుడికి బోధించుట చేతను, చెడ్డ స్త్రీతో సహవాసము చేతను, దుష్టులను చేరదీయుట చేతను జ్ఞాని నాశనమగును.

కష్ట కాలానికి సంపదను దాచుకోవాలి. ధనవంతుడికి కష్టాలు ఎలా ఉంటాయి? విపరీతంగా ఖర్చు పెడితే, దాచుకొన్న ధనమంతా పోవును.

భౌతిక శరీరము, ధనము, మరియు మిగిలిన మూలాలు అశాశ్వతము. మరణము ఎప్పుడూ చేరువలో ఉండేది. ఇది తెలిసిన జ్ఞాని సత్క్రియలు చేయడానికి కృషి చేయాలి.

పవిత్రమైన మేడి చెట్టును, వేప చేట్టును, రావి చెట్టును, పది చింత చెట్లను, దానిమ్మ, వెలగ పండు, ఉసిరి చెట్లను, ఐదు మామిడి చెట్లను, కొబ్బరి చెట్లను నాటువాడు నరకమునకు పోడు.

చెరుకు రసం దొరికే కొండపై పెరిగే వేప చెట్టుకు వేలాది సార్లు పాలు పోసి పెంచినా, ఆ వేప చెట్టు తీపిదనం పొందుతుందా?

అదృష్టవంతుడు అపరిచితుడైనప్పటికీ బంధువే. హాని చేసేవాడు బంధువైనప్పటికీ శత్రువే. ఎవరైనా బాగా అనారోగ్యంగా ఉన్నప్పుడు దూరపు అడవి నుండి తెచ్చిన మూలికలు ఔషధంగా వాడబడతాయి.

పుస్తకాలకు పరిమితమైన విజ్ఞానము, ఇతరుల చేతిలో ఉన్న సంపద, విదేశాలకు వెళ్ళిపోయిన కుమారుడు నామ మాత్రమే.

భార్యతో సహవాసము పది మంది వైద్యులకంటే శ్రేష్టము. భార్య సేవకంటే సూర్యుడు పది రెట్లు శ్రేష్టము. సూర్యుడికంటే తల్లి పది రెట్లు శ్రేష్టము. కరక్కాయ తల్లికంటే పది రెట్లు శ్రేష్టము.

కాకులకు ఆతిధ్యము కల్పించిన హంసలు చెడిపోయినట్లుగా దుష్టులతో సహావాసమున్న గుణవంతుడు చెడిపోవును.

దుష్టుడు మరియు కఫము లక్షణాలు సుమారు ఒక్కటే. కఫము తీపి ఆహారము చేత ఎక్కువగును చేదు చేత తగ్గును; అలాగే దుష్టుడు తీపి కబుర్లు చేత లేచును, కఠోర మాటల చేత చల్లారును.

మరణముతో శత్రుత్వము అంతమగును, గర్భముతో యవ్వనము అంతమగును, శిరస్సు వంచడంతో కోపము అంతమగును, భిక్షాటనంతో గర్వము అంతమగును.

చెడిన కుటుంబ వైభవాన్ని తిరిగి తెచ్చేవాడు, వదిలివేయబడిన సరస్సు, సింహాసనం దిగిన రాజు, శరణాగతుడు, ఆవులు, దేవాలయాలు, మరియు విజ్ఞానులు నాలుగు రెట్ల ఫలము పొందెదరు.

రచన లేక చిత్రలేఖనం గొప్ప కళ. వ్యవసాయ వృత్తి మరియు వ్యాపార వృత్తి పరవాలేదు. దాస్య వృత్తి చిన్నది, కూలీ వృత్తి అంతకంటే దారుణం.

సువాసనను ఈగ, లక్ష్మీ దేవి ఉపాయశాలిని, నీరు పల్లమునకు, విధి తెలివైనవాడిని అనుసరిస్తుంది.

ఈ క్రింది ఇవ్వబడినవి కొట్టగా బాగుపడును: దుష్టుడు, బంగారము, డప్పు, లొంగని గుర్రము, జారస్త్రీ, చెరుకు గెడ, నువ్వులు, సంస్కారహీనుడు.

నేను ఈ ఆరుగురు వ్యక్తులకు లొంగెదను: శుభ్రమైన ఆహారము పెట్టువాడు, రోజూ అగ్నిహోత్రము చేయువాడు, వేదాంతము తెలిసినవాడు, వెయ్యి పూర్ణ చంద్రులను చూసినవాడు, ప్రెతి నెలా ఉపావాసముండువాడు, మరియు పతివ్రత.

పురుగులు కురుపులను, రాజులు సంపదను, దుష్టులు గొడవలను, జ్ఞానులు ప్రశాంతమును కోరుకొందురు.

సూర్య కాంతితో సూర్య మణి వెలుగును, అట్లాగే గురువు సమక్షంలో శిష్యుడి జ్ఞానము వెలుగును.

దానము చేయనివాడు సన్యాసి అగును. ఎందుకనగా అతడు మరణించినప్పుడు సమస్త సంపదను వదిలి మరో లోకమునకు వట్టి చేతులతో వెళ్ళును. అయితే దానము చేసినవాడు పిసినారి అగును, ఎందుకనగా అతడు మరణించినప్పుడు దాన ఫలితాన్ని మరో లోకమునకు మోసుకెళ్ళును.

పరాయి వ్యక్తి యొక్క భార్యను తల్లిగా, పరాయివారి సొమ్మును మట్టి ముద్దగా, సకల జీవరాశులను తనకు చెందినవిగా భావించువాడు జ్ఞానియనబడును.

నీలి కలువ, పద్మము (తామర), చేప, తెల్ల కలువ నీటిలో పుట్టినప్పటికీ వాటికి వివిధ సువాసనలు కలిగియుంటాయి.

దేవుడికి, జ్ఞానులకి, బంధువులకు, సొంతమునకు ఉపయోగపడని సంపదను నీరు, శత్రువు, రాజు, దొంగలు నాశనం చేస్తారు.

కష్టం వచ్చినా, ఆస్తులకు - ప్రాణమునకు ప్రమాదకర సంఘటనలు ఏర్పడినా ధ్యానం తర్వాత క్రియలను నిర్దేశించువాడు యముడుని చూచి నవ్వును.

వస్త్రములను దానముగా ఇచ్చుట వలన వచ్చే ఫలం రాజ్యము; పాదరక్షలు దానముగా ఇచ్చుట వలన వచ్చే ఫలం వాహనం; తాంబూలం ఇచ్చుటవలన వచ్చే ఫలం ఆనందము. బీదలకు ఆహారమిచ్చుటవాడు పైవన్నీ పొందుకొనును.

కోకిల లక్షణము కూత, స్త్రీ లక్షణం పరిశుద్ధత, బ్రాహ్మణ లక్షణం జ్ఞానము, సన్యాసి లక్షణము ఓర్పు.

ఈ మూడూ దుష్టుడి లక్షణాలు: పద్మములాంటి ముఖము, శ్రీగంధపు చెక్క వంటి చల్లని మాటలు, మండే హృదయం.

మొదటి సంవత్సరంలో కొద్దిపాటి నీరు ఇచ్చినందుకే కొబ్బరి చెట్టు తన కాయలను నెత్తిన మోసి జీవితమంతా మధురమైన నీరు ఇచ్చినట్లుగా, ఒక యోగి తాను పొందిన సహాయం ఎన్నడూ మరచిపోడు.

ప్రవహించు నదివలెను, ఫలాలను ఇచ్చు చెట్లవలెను, ఇతరుల కొరకు పెరిగే మొక్కలవలెను మునులు ఇతరులకు సేవచేయుదురు.

బ్రాహ్మణుడి నుండి జ్ఞానము, తల్లి హస్తాల నుండి ఆహారము, భార్య నుండి తాంబూలము మరియు రాజునుండి కడియము స్వీకరించాలి.

చంద్రుడు చల్లాగా ఉంటాడు, గంధపు చెక్క చంద్రుడుకంటే చల్లగా ఉంటుంది. మంచివారి మాటలు చంద్రుడుకంటేను, గంధపు చెక్కకంటేను చల్లగా ఉంటాయి.

ఏనుగు కపోలమదము వలన, ఆకాశము వాన మబ్బులవలన, స్త్రీ వ్యక్తిత్వము వలన, గుర్రము వేగం వలన, గుడి నిత్య పండుగలవలన, వాక్కు వ్యాకరణంలో దిద్దుబాట్లు వలన, నదులు హంస జంటలవలన జనసమూహము మేధావులవలన, కుటుంబము మంచి కుమారుడివలన, భూమి రాజు వలన, ముల్లోకాలు సూర్యుడి మెరియును.

అసూయాపరుడు, అబద్దమాడువాడు, కృతజ్ఞత లేనివాడు, ఎక్కువ కాలం శత్రుత్వం కొనసాగించువాడు - ఈ నలుగురు ఖర్మ చండాలురు (శూద్ర తండ్రికి మరియు బ్రాహ్మణ తల్లికి పుట్టినవారు).

జీవితాన్ని అర్పించైనా ఖ్యాతిని కాపాడుకో. ఎందుకనగా జీవితం శాశ్వతం కాదు. ఖ్యాతి చంద్రుడు, నక్షత్రాలు ఉన్నంతవరకూ ఉండును.

జ్ఞానము పొందినవాడు గురువును, వివాహమైనవాడు తల్లిని, బిడ్డకు జన్మనిచ్చిన స్త్రీ భర్తను, వ్యాధి నుండి విడుదల పొందినవాడు వైద్యుడిని అలక్ష్యము చేయును.

తలపై సువాసన జల్లే పువ్వులను అలంకరించుకున్నవారు, కాళ్ళను పరిశుభ్రంగా ఉంచుకునేవారు, అందమైన స్త్రీలతో సహవాసం చేయువారు, ఆహారమును కొద్ది మోతాదులో తీసుకొనువారు, నేరుగా నేలపై పడుకొననివారు, పౌర్ణమి రోజుల్లో స్త్రీలతో సంభోగించనివారు పోయిన శక్తిని తిరిగి పొందుదురు.

దుష్టులు విద్యావంతులైతే వ్యర్ధముగా వాదించును, ధనవంతులైతే కోపము తెచ్చుకొనును, శక్తిమంతులైతే ఇతరులను బాధించును. సద్గుణము కలవారు తమ విద్యను, సంపదను, శక్తిని - జ్ఞానము కొరకు, దానము కొరకు, ఇతరుల శ్రేయస్సు కొరకు ఉపయోగిస్తారు.

ఈ నలుగురూ వినాశనానికి ద్వారాలు: చేయరాని పనులు చేయడం, గుంపులను తిరస్కరించడం, శక్తిమంతులతో పోరాడటం, స్త్రీ మాటలు వినడం.

ఏ కార్యమైనా మొదలుపెట్టే ముందు ఈ ప్రశ్నలు వేసుకోవాలి: ఏది మంచి సమయం? ఏవరు నా స్నేహితులు? ఏది మంచి స్థలం? ఏవి నా ఆదాయం - ఖర్చులు? నేను ఎవరిని? నా బలం ఏమిటి?

ఎవరైనా సింహము - కొంగ నుండి ఒక పాఠము, కోడి నుండి నాలుగు పాఠాలు, కాకి నుండి ఐదు పాఠాలు, కప్ప నుండి ఆరు పాఠాలు, గాడిద నుండి మూడు పాఠాలు నేర్చుకోవాలి.

ఎవరైనా సింహం యొక్క ఈ గుణం నేర్చుకోవాలి: ఒక పని మొదలైన తర్వాత, అది పెద్దదైనా చిన్నదైనా దాన్ని పూర్తి చేయడానికి సాధ్యమైనంత కృషి చేయాలి.

సమయం, ప్రదేశం, శక్తిని ఎరిగి తెలివైనవాడు తన బాధ్యతలను నిర్వర్తించాలి, కొంగ వలె ఇంద్రియాలను నియంత్రిచుకోవాలి.

ఉదయాన్నే లెచి, పోరాడి, తోటివారితో ఆహారాన్ని పంచుకొని, జీవానాధారం కోసం ప్రయాసపడు శునకము నుండి ఎవరైనా నేర్చుకోవాలి.

రహస్యంగా సంభోగించడం, కష్టకాలానికి ఆహారాన్ని నిల్వచేసుకోవడం, శౌర్యము, పాపరహితము, నమ్మకపోవడము వంటి ఐదు కాకి లక్షణాలు ఒకడు నేర్చుకోవలెను.

శునకము నుండి ఆరు లక్షణాలు నేర్చుకోవచ్చు: ఆహారం ఎక్కువగా లభించినప్పుడు ఎక్కువగా తినడం, ఆహారం తక్కువగా లభించినా సంతృప్తి చెందియుండటం, గాఢ నిద్ర కలిగియండటం, తేలికగా లేవడం, ధైర్యానికి, యజమానికి కట్టుబడియుండటం.

అలసిపోయినా బరువులు మోస్తూ, వేడిని చలిని అలక్ష్యం చేస్తూ సంతృప్తి చెందుతూ ఉండే లక్షణాలు గాడిద నుండి నేర్చుకోవాలి.

ఈ ఇరవై లక్షణాలను కలిగియున్నవాడు చేసే పనుల్లో విజయము సాధించును.

వైద్యులు, జ్యోతిష్యులు, మాంత్రికులు ప్రతివారిచే గౌరవం, ఆతిధ్యం పొందుతారు. ఇతర శాస్త్రాలు చదివినవారు చెంబుడు నీళ్ళుకూడా పొందరు.

సోమరితనం వల్ల జ్ఞానము నశించును, ఇతరుల చేతిలో ఉన్న స్త్రీలు నశించును, తక్కువ విత్తిన వ్యవసాయము తగ్గును, సైన్యాధ్యక్షుడు లేని సైన్యము నశించును.

కేతకి మొక్క పాములకు నిలయమైనా, ఫలాలు ఇవ్వకపోయినా, ముళ్ళు కలిగియున్నా, చుట్లు కలిగియున్నా, బురద నేలల్లో పెరిగినా, తేలికగా అందుబాటులో లేకపోయినా, అది పూచే సుగంధమైన పుష్పాల వల్ల దాన్ని అందరూ ఇష్టపడతారు. ఒక్క మంచి లక్షణం అన్ని దుర్గుణాలని తుడిచేస్తుంది.

వేదాభ్యసన చేసే ద్విజుడుకి గురువు అగ్ని, ఇతర కులస్థులకు గురువు బ్రాహ్మణుడు, భార్యకు గురువు భర్త, ప్రతి వ్యక్తికి గురువు అతిధి.

ఒకడు పామరుడైతే కుటుంబ గౌరవానికి ఏమి లాభము? చదువుకొన్నవాడు ఉన్నత కుటుంబానికి చెందకపోయినా దేవుళ్ళ చేత కూడా గౌరవింపబడతాడు.

గురువుకు సేవ చేయడం, విద్య నేర్చుకొన్నందుకు సరిపోయే సంపదను బదులుగా ఇవ్వడం, జ్ఞానము మరొకరితో పంచుకోవడం - ఈ మూడు మార్గాల ద్వారా మాత్రమే జ్ఞానము పొందవచ్చును.

నీటి చుక్కలు క్రమంగా కుండను నింపినట్లుగా జ్ఞానము, ధర్మము, సంపద లను వెంబడించిపప్పుడు అవి పెరుగును.

ఒకడు ఆయుధాలతోను, కళలు-శాస్త్రాలకు చెందిన విద్యతోను యుద్ధం చేయడం నేర్చుకోవాలి. మొదటిది వృద్ధాప్యంలో వృధా అవుతుంది, కాని రెండవది ఎప్పుడూ గౌరవింపబడుతుంది.

జ్ఞానము కోరికలు తీర్చే కామధేనువు వంటిది. ఒకనిని క్రొత్త ప్రదేశంలో ఉన్నప్పుడు తల్లిలా కాపాడుతుంది. అందువల్ల జ్ఞానమును దాచబడిన సంపదగా చెప్పవచ్చును.

ప్రయోగించని జ్ఞానము విషము, అరగని ఆహారము విషము, సమూహము పేదవారికి విషము, యవ్వన స్త్రీ ముదుసలివానికి విషము.

విదేశీ యాత్రలో ఉన్నవానికి జ్ఞానము, ఇంటిలో ఉన్నవానికి భార్య, అనారోగ్యంగా ఉన్నవానికి ఔషధము, వెళ్ళిపోయే ఆత్మ మంచిపనుల ఫలము స్నేహితులు.

ప్రతిఒక్కడు జ్ఞానమును కొనియాడును, ప్రతి చోటా జ్ఞానము గొప్పగా ఎంచబడును, జ్ఞానముతో ఒకడు సమస్తమునూ సాధించవచ్చును. జ్ఞాని ప్రతి చోటనూ గౌరవింపబడును.

రాజు విజ్ఞానవంతుడితో సమానముగా తలచరాదు. రాజు తన రాజ్యములోనే గౌరవింపబడును, విజ్ఞానవంతుడు ప్రతిచోటా గౌరవింపబడును.

అజ్ఞానవంతుడి జీవితము మర్మాంగాలను దాచుకున్నా, కుట్టడానికి వచ్చే ఈగలను తరిమినా ఉపయోగం లేని కుక్క తోక వలె ఉండును.

గురువుకు సేవ చేయు శిష్యుడు భూమిని తవ్వువాడు నీరు పొందినట్లుగా జ్ఞానాన్ని పొందుతాడు.

One ought to make each day fruitful by studying at a verse or a part of it; one must spend time in studies, meditation and in doing one‟s duty.

జ్ఞానులు సాహిత్యములోను, చడువుటలోను, సాహిత్యాన్ని వినుటలోను సమయం వెచ్చిస్తారు; మూర్ఖులు దుఖములోను, నిద్రలోను, వివాదంలోను సమయాన్ని వెచ్చిస్తారు.

ఒక చంద్రుడు రాత్రి వేళ వెలుగునిచ్చునట్లుగా చదువు - సద్గుణము కలిగియున్న కుమారుడు తన ఇంటికి సంతొషమును తెచ్చును.

అమృతాన్ని విషంనుంచి అయినా తీయాలి, బంగారాన్ని చెత్తనుండి అయినా తీయాలి, జ్ఞానాన్ని శూద్రుడినుండైనా గ్రహించాలి, మంచి గుణాలు కలిగిన స్త్రీని అప్రదిష్ట కుటుంబంనుండి అయినా వివాహమాడాలి.

కుమార్తెకు ఉన్నత కుటుంబంతో వివాహం చేయాలి, కుమారుడుకి ఉన్నత విద్యనందించాలి, శత్రువుని ఏడిపించాలి, ఇష్టమైన వారిని మంచివైపు నడిపించాలి.

పోటీపడువారికి ఏది అసాధ్యము? కష్టపడేవారికి దూరము లెక్క అగునా? చదువుకొన్నవారికి పరాయి దేశములేవి? చక్కగా మాట్లాడువారికి అపరిచితులు ఎవరు?

భోజనం చేస్తున్నప్పుడు - వ్యాపారం చేస్తున్నప్పుడు సిగ్గు విడిచినవారు ఈ విషయములలో విజయం పొందెదరు - సంపద, ధాన్యము, విజ్ఞానం

విద్యార్థి యొక్క లక్షణాలు ఇవి - కాకి వంటి కంటి చూపు, కొంగ వంటి శ్రద్ధ, కుక్కవంటి కునుకు, మితమైన ఆహారం తినడం, సాదాగా వస్త్రాలు ధరించడం.

రాజ్యము చేపట్టుట వలన వచ్చు ఫలము ప్రతిఒక్కరు ఆజ్ఞాలను శిరసా వహించును, తపస్సు వలన వచ్చు ఫలము బ్రహ్మచర్యము, విద్య వలన వచ్చు ఫలము విజ్ఞానము, సంపద వలన వచ్చు ఫలము ఆనందము.

క్రోధము యముడివంటిది, అత్యాశ దాటడానికి కష్టమైన వైతరణి నది వంటిది, జ్ఞానము కోరికలు నెరవేర్చే కామధేనువు వంటిది, సంతృప్తి నందన వనము వంటిది.

సద్గుణము అందాన్ని, వ్యక్తిత్వము కుటుంబాన్ని, పనిలో విజయం జ్ఞానాన్ని, సంతోషము సంపదని అలంకరిస్తాయి.

మంచి గుణం లేని అందం వ్యర్ధము, గుణము లేని వాడి వలన కుటుంబ ప్రతిష్ఠ వ్యర్ధము, విజయాన్ని ఇవ్వలేని జ్ఞానము వ్యర్ధము, సంతోషానికి ఉపయోగపడని సంపద వ్యర్ధము.

ఈ ఏడుగురుని నిద్రనుండి లేపాలి: విద్యార్థి, సేవకుడు, యాత్రికుడు, ఆకలిగొన్న వాడు, భయపడినవాడు, బరువు మోసేవాడు, కాపలాదారుడు.