నిన్నేశరణంటినయ్య - నీరజాక్ష

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


రాగం: ధేనుక తాళం: చతురశ్ర త్రిపుట

నిన్నే శరణంటినయ్యా నీరజాక్ష నన్ను బ్రోవవయ్యా శ్రీ రుక్మిణీ రమణా||

పన్నగేంద్రశయన పన్నగారివాహన పన్నగాచలవాసా వాసుదేవ దేవాది దేవ||

సుర భూసురార్తి హరణ కరుణాకరామిత సుగుణ శరదిందుసన్నిభవదన పురవైరి
మానస సదన కరిరాజుని కృపతో మును బ్రోవలేదా నెర నమ్మినవారికి నిత్యానందమిచ్చే వాడని||