Jump to content

నిన్ను నమ్మియున్నవాడను

వికీసోర్స్ నుండి


   w:మాయామాళవగౌళ రాగం  త్రిపుట తాళం


ప: నిన్ను నమ్మి యున్నవాడను ఓ రామ || నిన్ను ||


చ 1: నిన్ను నమ్మినవాడ పరులను వేడ నిక

మన్నన జేసి పాలింపవే ఓ రామ || నిన్ను ||


చ 2: బ్రతిమాలి వ్రతము చెడుటేగాని యిదేమి సుఖము

వెత నొందగ జాలనే ఓ రామ || నిన్ను ||


చ 3: మానము విడచి కసుమాల పొట్టకొరకై

మానవుల వెంబడింతునే ఓ రామ || నిన్ను ||


చ 4: సతతము రక్షించు చతురత నీ కున్నప్పుడు మది

చంచలింప నేటికే ఓ రామ || నిన్ను ||


చ 5: సతతము భద్రాద్రి స్వామి శ్రీ రామ దాస

పతివై నన్నాదరింపవే ఓ రామ || నిన్ను ||

This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.