నినువినా నన్నుబ్రోచే వారెవరుర
Appearance
రాగం: భైరవి. చతురశ్ర త్రిపుట తాళం.
ప: నిన్నువినా నన్ను బ్రోచేవారెవరురా రఘువరా నీ పదాంభోజము నే విడజాల ||
అ: పన్నగారి వాహన! పాలిత వారణ! పతిత పావన! వాసుదేవ! పన్నగశయన! ||
చ: భూమిజా రమణ నీకెందుకు నిర్దయ నీ మహిమలు నేనేమని పొగడుదు
సామగాననుత! కామిత దాయక! కమల సంభవాది నుత! నిన్నే నెరనమ్మితి ||