నా ప్రేమను

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

నా ప్రేమను కోపంగానో, నా ప్రేమను ద్వేషంగానో
నా ప్రేమను శాపంగానో, చెలియా Feel My Love
నా ప్రేమను భారంగానో, నా ప్రేమను దూరంగానో
నా ప్రేమను నేరంగానో, సఖియా Feel My Love
నా ప్రేమను మౌనంగానో, నా ప్రేమను హీనంగానో
నా ప్రేమను శూన్యంగానో, కాదో లేదో ఏదో గాని
Feel My Love (5)

నేనిచ్చే లేఖలన్నీ చించేస్తూ Feel My Love
నే పంపే పువ్వులనే విసిరేస్తూ Feel My Love
నే చెప్పే కవితలన్నీ ఛీ కొడుతూ Feel My Love
నా చిలిపి చేష్టలకే విసుగొస్తే Feel My Love
నా ఉనికే నచ్చదంటూ నా ఊహే రాదనీ
నేనంటే కిట్టదంటూ నా మాటే చేదనీ
నా జంటే చేరనంటూ అంటూ అంటూ అనుకొంటూనే
Feel My Love (5)

ఎరుపెక్కీ చూస్తూనే కళ్ళారా Feel My Love
ఏదోటి తిడుతూనే నోరారా Feel My Love
విదిలించి కొడుతూనే చెయ్యారా Feel My Love
వదిలేసి వెడుతూనే అడుగారా Feel My Love
అడుగులకే అలసటొస్తే చేతికి శ్రమ పెరిగితే
కన్నలకే కునుకు వస్తే పెదవుల పలుకాగితే
ఆ పైనా ఒక్కసారి హృదయం అంటూ నీకొకటుంటే
Feel My Love (5)