నాదొక కోరిక (స్కెచ్)
స్వరూపం
నాదొక కోరిక (స్కెచ్ )
రచన: కాలనాధభట్ట వీరభద్ర శాస్త్రి
చెట్ల చిఠారుకొమ్మన
లేచిగుళ్ళను తాకి ప్రసరించే
కమ్మ తెమ్మెర
ఎగిసిపడే సముద్రపు అలల తుంపర్ల స్పర్శ
నీలిఆకాశంలో దూదిబంతుల్లా తేలిపోయే
మబ్బుల గుంపులు
ఆ మబ్బులచాటున దోబూచులాడుతూ
తన కిరణాలతో
భూమాతను పులకిరింపచేసే భానుడు
రణగొణధ్వనిచేసే టెలెఫోన్ మోతవినబడని రోజు
ఒకచేతిలో చిక్కటి వెచ్చటి కాఫీ కప్పు
పక్కజేబులో వేయించిన పల్లీలు
వంటరిగా వూరిచివర నిలబడి
ప్రకౄతిలోని అందాన్ని తిలకించేందుకు
కాలవమీద ఒక సన్నని కాలిబాట వంతెన
ఇవన్నీ కుదిరినవేళ బహుశా
సంతోషంతో వూగిపోయే నా మనస్సులో
అద్భుతమైన కవిత్వ భావ స్పందన
కలగవచ్చునేమో
అల్లసాని పెద్దనార్యా
నువ్వు అదౄష్టవంతుడవయ్యా!!