Jump to content

నాట్యకళ మాసపత్రిక/సంపుటము 1/సంచిక 2/సింహావలోకనము

వికీసోర్స్ నుండి

సింహావలోకనము

వేలూరి శివరామశాస్త్రి

                                పూర్వరంగము

1911 సాలు చివరనెలలో గుంటూరున ఒకటిరెండు నాటకములు చూచితిని. అవి పాండవవిజయము, వేణీసంహారము. ఈ రెంటినే రెండుమూడు తడవలు చూఛవలసివచ్చెను. పిదప నాటకములు చూచుట శుద్ధ-తప్పు అని తోచెను. ఏలనగా ఈ చాక్షుషక్రతువునందు పశుహింస యెక్కువ.

         అయినను నాటకమునకు వెళ్లకుండుటకు వీలుకలుగలేదు.  అవి మా శతావధానపు రోజులు. ఆంధ్రదేశమున నాట్యకళ అపుడపుడే తప్పటడుగులు వేయుచుండెను.  నటులు మ మ్మీకనువిందులకు ప్రేమపూర్వకముగా ఆహ్వా నించుచుండెడివారు.  విందుకు వెంకంజవేరాదుగదా! విశేషించి 'అనాహుతోమధ్వరం గచ్చత్ ' అని కలదు.
      కాని రంగముమీద పాత్రప్రవేశించిన పదినిమిషములకు కనులను అంతర్ముఖ మొనరించ్కొని చెవులను దొరబెట్టుకొని యుండవలసి వచ్చెడిది-

'ఏకో ధీర: ప్రత్యగత్మాన మైక్ష దనృత్తచక్షు రమృతత్వ మిచ్చన్.' అంకాంతమునందే మరల కనులకు పని. అపు డీరీతిగా చాల నాటకములను వింటిని.

         సభ్యులలో రసికులు నిమ్మకునీరెత్తినటు లుండియుండి మంచిపద్యము వినబడగనే 'వన్ స్ మోర్ ' కొట్టెడువార్.  నటులును మంచి బడిపిల్లకాయలవలె పాఠ మప్పగించుచుండేడివారు.  ఆకాలమున వన్ స్ మోరుల సంఖ్యాధిక్యమే నటుని గొప్పదనమునకు నిర్ణాయకము.
     ఏడాది తిరుగకముందే నటపరీక్షల కంకురార్పణ మాయెను.  గయో పాఖ్యానమున ఒక ఘట్టము పరీక్ష్యము. ఒక బంగారుపతకము కానుక. దానికి పరీక్షకులు ఏదుగురు. ఇందఱ నేల నియమించిరో. ఏ;అ వారంగీకరించిరో, నా కిపుడు గుఱుతుచాలదు.  వారు కోరుటయు, వీ రియ్యకొంటయుమాత్రమే కారణమనుకొందును.  నేనుగూడ ఒక పరీక్షకుడను (judge.)                                        నా ట్య క ళ
        ఈ ప్రదర్శనము దీర్ఘసత్రముగా సాగెను.  చిలకమర్తి లక్ష్మీనరసింహముగారు పరీక్షకులలో నొకరు.  వరే ధన్యులు. ఏలనగా వారికి కనులు లేవు.
    మా కవి ఆనందదినములు, రాత్రిబారువంతయు పగలు పోయెడిది.  పరీక్షలకు లగు వడ్డాది సుబ్బారాయుడుగారును, చిలకమర్తి లక్ష్మీనరసింహముగారును, హరినాగభూషణముగారును, నేనును ఒకచోటనే బస. నేతి సోమయాజులుగారు మమ్మంటుకొనియుండువారు.  లక్ష్మీనరసింహముగారొక హాస్యతరంగమును లేవదీసేడివారు.  వడ్డాది సుబ్బారాయుడుగారికి ఎన్నెన్ని గ్రంధములలో ఎన్నెన్ని పద్యములు వచ్చునో అంతుదొరికెడెదికాదు.  నేనును వీరినడుమ ఆసులో కండెవలె ఆడుచుండేడివాడను.  హరినాగభూషనముగారికి మాకంటే పాట యొకటి పెచ్చు. ఈ పగటినాటకములకు టికెట్టులేకపోవుటవలన రాత్రి నాటకములకంటె వీనియందే జనసంఖ్య హెచ్చు.
     ఈ పరీక్ష బెజవాడలో అచ్ట కొక్ందఱనటులమీద కొందఱ కసూయ.  ఫలావారిని మీరు ప్యాసుచేయించుచో  మె బుర్ర రామకీర్తన పాడింతునని ఆకాశవాణీ పలికెను.  నేను దానిని లెక్కచేయలేదు.  నాది పదునెనిమిదేండ్ల ఉడుకుపాలు. మిగిలినవారందఱది  చల్లాఱినపాలు.  వా రాలోచించిరి.  ఇంతలో ఆకాశవాణి ఆకాశధ్వనిగా మాఱెను. పెండాలురేకులమీద రాళ్లవాన కుఱియదొడిగెను.  మాలో పెద్దలు మంచిమాట చేసికొనుటకు నన్నొకమూలకు గొంపోయిరి.  కాని లాభము లేకపోయెను  వోటింగు పెట్టి నాపుడు నెత్తిమీది ఆపాయము తొలగించిరి.  నాట్యకళ అపు డిటులు అభివృద్ధి పొందెను.
                                   పి ద ప
    నే నొకనాడు రైలుప్రయాణము చేయవలసివచ్చెను.  రైలులో ఎక్కడను చోటులేదు.  దీనికి కారణము బెజవాడలో సావిత్రి ! దాని కీజన ప్రవాహము.
      నే నీనాటకము చూడుభాగ్యమును బడయనైతిని.  ఈ నాటకమున వేషము ధరించిన సంజీవరాఆదుల పే రాంధ్రలోక మెఱిగినదే.
   తరువాత కొన్నియేండ్లకు స్థానం నరసింహారావుగారిని రంగస్థలమున హఠాత్తుగా చూచుట తటస్థించెను. అపుడు నాకనులు మూతలుపడలేదు.                              సింహావలోకనము

కాని చెవులకు విశ్రాంతి కలిగెను. వెంట వెంటనే వీరిని మఱిరెండు వేషములు చూచితిని; మెచ్చితిని.

     నామిత్రులు కొందఱు పారుపల్లి సుబ్బారావుగారిని చూడు మనిరి.  వారిమాట వింటిని.  శాంతమును, గంభీరమును అగు వారివేషము నన్నాకర్షించెను.  నాటకములు చూచుట నల్లమందువలె అలవాటులో పడజొచ్చెను.
  ఇటులుండగా బళ్లారి రాఘవాచార్యులవారు బెజవాడ వచ్చిరి.  వీరిని నాలుగయిదురూపములలో జూచితిని.  ఆంధ్రనాటకసారస్వతమున ఒక అభావమును, ఒకశూన్యమును, ఒకలోపమును వీరు నాకనులకు చూపిరి.
     గొప్పనటుడు ఉద్భవించెను, గొప్ప నాటకములు ఉద్భవింపలేదు.
    దానివలన వీరి ప్రదర్శనములలో కొన్నికొన్ని ఘట్టములు సినీమా లాయెను.  అంకాంతములందు, లేక అటువంటివానియందు పాత్రము లేవోఅను భావముల నభినయించుచుండగా తెరపడును.  దాన అంభావం వ్యక్తమగును.  అంగహారమువలన అనుభావవ్యక్రియేకాని కవితలో వ్యక్తి లెదు.  అట్టి యెడల రాఘవ్డే యగుగాక యేమి చేయగలడు?
   ఈ రాఘవునిమహిమచే రాలుగాపడియున్న పలువురహల్యలు రంగముమీద రూపపు వడసిరి, పడయుచున్నారు, పడయగలరు.  ఇటుల శాపవిమొచనమందిన మొదటినటిని నేను చూడలేరు కాని ఆమెకు పరబ్రహ్మాచారిణియగు పద్మావతీదేవిని మొన్న చెన్నపురిలోని పరిషనాటకసందర్భమున 'పప్పెవది ' లో చూచితిని.  మగావా రాడువేసము వేయుటతప్పు అని ఈమె చెప్పక చెప్పెను (ఒక్క దాడిగోవిందరాజులవంటివారి మాట తప్ప).
                         ఉత్తర రంగము

1934 డిసెంబరు చివర చెన్నపురిలో నాట్యకళాపరిషత్తు ప్రారంభించిన దీర్ఘసత్రమున పలువురు నటులను చూడ తటస్థించెను. పర్మావ్తీరాఘవులొక ప్రహసనము ప్రదర్శించిరి. నా కొనరించినది నాట్యముకాదు. అది నాట్యాభాసమును విమర్శించు ఆనందాత్మకమగు నాట్యకవితాకుల్య. ఈ రాఘవుని గుఱించి యిక వ్రాయను. ఈయన కలమునకును, కాకితమునకును మిగిలి యుండును.

      పారుపల్లిసుబ్బారావుగారిలో శాంతి పక్వమాయెను.  శ్రీరామమూర్త్రిలొ గానవార్ధకములు పో'టీచేసెను.  తుంగల చలపతిరాయని గాన మధురిమలో నాట్యకళయు కొంత తావు దొరకించుకోసం జూచుచున్నది.  మాధవపెద్దిలో పద్దతనము బలియుచున్నది. యుగంధరుడుని నేర్పు, మందరభంగి, చాకిత అమాయికత, బోగముపిల్ల హోరంగు, దానిపేడియన్న పై హంగు, మొదలగునవి కళాభిజ్ఞుల హృదయమున ముద్రితము లాయెను.
    లబ్ధ ప్రతి8ష్ఠులగు వీరలమాట యిటుండ దాడి గోవిందరాజులుగారును, బందా కనకలింగేశ్వరరావుగారును, వసంతసేనయు, శ్రీరంజనీవసంతాదేవులును ఇమముందు నాతులసంఖ్యను వృద్ధిచేయగలదని8 యనిపించిరి.  గోవిందరాజులుగారి దిప్పకే గొప్పస్థానము.
                                జ్ఞా నా భి వృ ద్ధి
     నటులీరీతిగా నాట్యాభివృద్ధి చూపుటయ కాదు.  కళాపరిజ్ఞానమును గూడ ఆఱితేఱుచున్నారు.  వారు వారి ప్రదర్శనములందు అననుకూలములయిన ఘట్టములను తెలిపిరి.  పండితులతో చర్చించిరి.  పద్యములు పనికిరావనిరి.  స్వగతములు, అపవార్యలు కూడవనిరి  దీర్ఘోపన్యాసములు రోసిరి.
     ఈ యభిప్రాయములు రాఘవాచార్యులవారు తెలిపినచో విశేషములేదుకాని సారస్వత సంబంధ మంతగా లేని8 నటులు తెలుపుట విశేషము.  నాట్యము వీరికి కొంతకొంత అనుభవమునకు వచ్చినటులు దీనివలన తెలియనగుచున్నది.
      పది పండ్రెండేండ్లక్రింద ఏలూరులో ఒక ప్రదర్శనమున కేగితిని.  బి.యే. ప్యాసుచేసిన ఒక సుప్రసిద్ధనటుడు శివాజీవేషము ధరించెను.  ఆనటునకు పర్యమును, పాటయును లేదు.  అల్లరి ఆరంభమాయెను.  క్రమముగా దక్షాధ్వర ధ్వంసము జరిగెను.  నేటికిని అదియే అవస్థ.
       సంస్కృతనాటకముల కాలములో రాజుగాని, దైచ్వముగాని సభాపతి నాటకమున రసంఊ ప్రధానము.  నటుడు రసజ్ఞుడును, సహృదయుడును, సత్త్వము, భావన, రసకావ్యపఠనము కల సహృదతయే టికెట్టు.
        ఇపుడు డెమాక్రసీయే సభాపతి. నాటకమున రచనాసౌందర్యమే ప్రధానము. నటుడు ఆర్టు-పక్షపాతి.  డబ్బుపెట్టి కొనదగినకాకితమే టిక్కెట్టు.        నాటక మేకకాలమున చూడదగినదియు, వినదగినదియు,ఇటులని కంటికి  ని, చెవికిని విసువు కలుగరాదు.  కలిగినచో లోటే.
    సుప్రసిద్ధములగు సంస్కృతనాటకములు మన చెవులలోనేగాని కంటియెదుట లేవు.  వానిలో కొన్నినాటకములు కావ్యములే   మృచ్చకటిమమున వర్షావర్ణనము కావ్యము.  వేణీసంహారమున సుందరకుడు పౌరాణికుడు.  కొన్ని నాటకములునాటకములూ వాకోవాక్యములు కలవు.  ప్రదర్శనభాగ్యము లేని ఆకాలమున ఇట్టి రచనలు నాటకములలోదూఱెనని తెలపవలసియున్నది.  కాలవిషమునుగూడవారిలో కొందఱది దేవమానము. మృచ్చకటికమున పదవయంశము కొంతవఱ కభినయించుసరికి సూర్యోదయమైనదట* మాలతీ మాధవము డిటో.
     విసువు కలిగించినను రసమునకు పున:పునర్దీప్తి కలిగించినను ఆకాలమున రూపకసామాన్యమునకు రసమునలననే చరితార్ధత.  ఆరసమునుబట్టియే వస్తువు. ఆవస్తువునుబట్టియే విబావాదులు. దానినిబట్టియే భాష.  దానినిబట్టియేనటుడు, సహృదయుడు మొదలుగాగల  పరంపర.
                              ఆ ర్టు
   పాశ్చాత్యభాషల సంపర్కమువలన ముఖ్యముగా మన నటులును, బి.యేలును, యెమ్మేలును, రసమను  మాటమఱచి ఆర్టు అనుమాటమీద ముగ్డులగుచున్నారు.  ఈపద మేభాషలోపుట్టేనో ఆభాషలో అది ఒకానొక కాలమున రచనామాత్రమునందును, పిదప సుందరమగు రచనమునందును, రానురాను పందొమ్మిదవశతాబ్దిలో రసవిశిష్టమగు సుందరచరనమునందును ప్రయుక్త మగుచ్వు వచ్చెను.  సుందరమగు రచనము అను అర్ధమే గ్రహించి చాలమంది నటులు ఈఆర్టుపదము నుపయోగించుచున్నారు.  వారు దీనికి రసమును జోడింపరు.
     ఇట్టి వీరు రసవంతములయినను  పద్యమ్లను నిషేధింతురు.  ఏల? చాల రసవత్పద్యములలో నటుడు చూపదగు నాట్యము (ఆర్టు)ఉండదు.  పద్యములను స్ఫుటముగా చదువుటయే అవును నటునిపని.  రసింపనేరని నటుడుగాని, సహృదతలేని నటుడుగాని పద్యమును నిషేధించును.  అనగా నటునకు

  • యత్ సూర్యోదయభయత: కవినోచితపాత్రమెలవనం కృతం, సుందరయుక్తిభి రచయ రాచందనోక్తి నీలకంఠ (స్య ? (స)తత్.

చూ. పండిత మూలరాజశర్మశస్త్రి యం.ఏ. గారి ఆంగ్లటిప్పణి. రసముమీదకంటే రచనమీద, ఆర్టుమీద కన్న, నాటకములు దృశ్యములును, శ్రవ్యములును అనుమాట వీరు మఱచుచున్నారు. నాటకకులలో ఇట్టి రసవత్పర్యభాగములే కొన్ని శ్రవ్యములు.

                        సాంఘిక నాటకములు
     నటులకును, కొంతమంది ప్రేక్షకులకును రసదృష్టి సన్నగిల్లి ఆర్టుదృష్టి ఎపుడు ంబలిసెనో అపుడే సాంఘిక రాజకీయ ధార్మికాది నాటకముల అక్కఱ కలిగెను.  ఈనాటకములు గద్యబహుళములుగా నుండవలయు ననుట నిర్వివాదము.
   ఇట నొకసంగతి చెప్పవలసియున్నది.  మొన్నజరిగిన పరిషత్సభలలో పలువురు పండితులును, కవులును సాంఘికనాటకము లనగనే మూతివిఱిచిరి: వ్యావహారికభాషయెడలను, స్వగతాద్లుందరాదనునెడలను మాటికిమాటికి తమ అసమ్మతిని దెలిపిరి.
         వీరు కన్యాశుల్కము, తప్పెవరిది, టుడేలన్ చూచినవారే.
          వీరు చెప్పు ముఖ్యాపత్తులివి: పౌరాణిక నాటకములకు వచ్చినటులీనాటకములకు జనులురారు.  వీనిలో వస్తుగౌరవములేదు.  ఉన్నచో కొలది. దానినిబట్టి వీనిఆయుర్ధాయము తక్కువ.  గానమును భాషాగానమును ఉండవు. కన్యాశ్ల్క మస్తమించెను.  రాఘవాచార్యులుగారు లేనిచో 'తప్పెవరిది ' కి పోవుట తప్పు.  టుడే మెఱుగుపురువు;.
   వీరిమాటలలో కొంతసత్యము లేకపోలేదు.  కాని సాంఘికనాటకములు అపరిహార్యములు.  సంస్కృతవాజ్మయమున మహాకవులురచించిన ఉత్పాద్యములు కలవు.  వస్తుగౌరవములేని నాటకములును కలవు.  వ్యావహారికభాషలో వ్రాయబదిన కర్పూరమంజరి వగైరాలు కలవు. ఇవన్నియు రసాత్మకములని గుఱుతుంచుకొనవలెను.
    వీనివలె సాంఘికనాటకములుగూ'డ రసత్ర్మకము లయినచే హని యుండదు.  వసుగౌరవము తగ్గుగాక, ఆయు:పరిమితి పరిమిత మగుగాక, స్దంఘశ్రేయోభిలాషతో రచింపప?డిన రసాత్మకమగు ఏసాంఘికనాటకమయినను ఉపాదేయమే యగును.
   సాంఘికనాటకములకు ఆయువు తక్కువయే.  సహగమనము రామమోహనుని అమరప్రయత్నముచే మృతమైపోయెను.  ఈయాచారమునుగుఱించి ఆకాలమున ఒక సాంఘికనాటకము రచింపబడె ననుకొందము.  ఆయాచార మస్తమింపగనే ఆనాటకముగూడ అస్తమించును.  కాని రసాత్మమయినచో అంత సులభంముగా అస్తమింపదు.
    'నాటకము చూడదగినదేకాని వినదగినది కా ' దని అతివాదులందురు.  అయితే మనము నాటకమునకుబోయి చూడవలయునది మూకాభినయమా? కాదు, ఎంతమాత్రమును కాదు.  మనకు వినబడు శబ్ధజాలము అర్ధమునకును, నాట్యమునకును ఇసుమంతయు నాతంకము చేయరాదు.  ఎవరయినను నాటకము చూచివచ్చితిమందురు గాని వినివచ్చితి మనరు.  కావున కవి శ్రవ్యభాగమును దృశ్యములోనికి కరుగబోయవలెను.
  అలంకారికులు శృంగారరసమునెడల నీమాటలేయనిరి.  కరుణరసమునకు అద్ధమువలె స్వచ్చమగు భాష వాడమనిరి.
  ఇచట నొకటి గమనింపవలయును.  పడమటిదేశములలో ప్రేక్షకులలో నిరక్షరు  లుండరు.  మనదేశమున ఉందురు.  కావున ప్రకృతసాంఘికనాటకములు వ్యావారికభాషలో నుండవలయుననుట తేటతెల్లము.  కాగా రసప్రతిబంధకత లేవనంతవాస్తవముగాగూడ నుండవలయు నని అర్ధసిద్ధము.
    అలంకారికులు కావ్యము పలుదెఱగు లనిరి.  అందు అస్ఫుటమగు వ్యంగ్యముతో వాచ్య చమత్కారము కలదానికిని మూడవస్థానము కలదు.  దాన సుందరమగు ఆర్టు కలదని మన మనవచ్చును.  ఇట్టి నాటకములు ఇబ్ సెన్, షా మొదలగువారు పెక్కులు రచించిరి.  ఇక సాంఘికవిషయములను గ్రహించి కవులు వానిని రసాత్మకములనుగా చేయగలిగినచో వివాదమేడ? దానివలన రకృతము నాట్యకళ కొక కళ హెచ్చును.  సంఘమునకు ఒకమేలు చేకూరును. అట్టినాటకములకు నటులును, సహృదయులును ఎదురుచూతురు.