నాగర సర్వస్వం/ఈ గ్రంథంలో

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
[[దస్త్రం:|395px|page=2]]

ఈ గ్రంథంలో

విక్రమశకం వెయ్యి సంవత్సరాల కాలంలో, అనగా పదకొండవ శతాబ్దంలో పద్మశ్రీ అనే రచయిత ఈ నాగర సర్వస్వాన్ని సంస్కృతంలో వ్రాశాడు. ఈయన బౌద్ధమతస్థుడు. ఆర్యమంజుశ్రీ -- ఈయనకు అధిదేవతలు. మొత్తం ముప్పయి ఎనిమిది అధ్యాయాల గ్రంథమిది; రత్నపరీక్ష ఎలా చేయాలో చెప్తాడు. ఇది ఇతర గ్రంథాలలో లేదు. భావ, అంగ, వస్త్ర, పుష్పానులేపాలగూర్చి కామశాస్త్రంలో విపులంగా పేర్కొన్న మహామనిషి ఈయనే! చతుషష్టి కళలలో నాయకుడెంత నిష్ణాతుడైనా "సంకేత" పరిజ్ఞానం లేనివాడు నాయకిచే తిరస్కరింపబడతాడని ఈయన వాదం. ఈ సంకేతపరిజ్ఞానం కామశాస్త్రానికి ఒక కొత్త చేర్పు; ఆ తర్వాత కామశాస్త్ర ఔషధాలనూ, హాపములను (మూర్సు) పదహారు చేష్టలను, అంగప్రమాణమునుబట్టి పరగాహ ఆరోపాములను, ఈ పద్ధతులను ---- వయస్సునుబట్టి స్త్రీ జనవర్గీకరణము రమించు పద్ధతులను, కామకేంద్రాలను, వివిధ నాడులను, చుంబన, ఆలింగన, చూషణ ప్రేషణాదులను ఇరవైనాలుగు రకముల ఉత్తాన పద్ధతులు, ఏడు పార్శ్వ, రెండు ఆసీనక, రెండు అధోముఖ, ఏడు ఉద్ధీతకరనములు (రతిపద్ధతులు) తెలియజేశాడు. స్త్రీలు అనుసరించే ' వామచరితం ' (చిట్కాలు) ప్రకరణాలను ఏర్చాడు. ఈయన చెప్పిన ప్రణయ ప్రజ్వలన పద్ధతులు ఎంతో ఆధునికమైనవిగా మనకు గోచరిస్తాయి. ప్రతి ఒకరూ చదవండి.