నవమాలికా స్తోత్రరత్నం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

హారనూపుర కిరీటకుండల విభూషితా నయన శోభినీం ||

కారణేశవరమౌళి కోటీ పరికల్ప్య మాన పదపీఠికాం ||

కాలకాల ఫణి పాశధనురాంకుశా మరుణ మేఖలాం ||

ఫాల భూ తిలక లోచనాం మనసి భావయామి పరదేవతాం ||1

గంధసార ఘనసార చారు నవ నాగవల్లి రసవాసినీం ||

సాంగ్యరాగ మధురా భరణ సుందరానన శుచిస్మితాం ||

మంధరాయత విలోచనా మమలబాల చంద్రకృతశేఖరీం ||

ఇందిరా రమణ సోదరీం మనసి భావయామి పరదేవతాం ||2

స్మేర చారుముఖ మండలాం విమలగండలంబి మణి కుండలాం ||

హారదాసు పరిశోభమాన కుచభారభీరు తను మద్యమాం ||

వీర గర్వహర నూపురాం వివిధకాఋణేశ వరపీఠికాం ||

మారవైరి సహచారిణీం మనసి భావయామి పరదేవతాం ||3

భూరిభార ధరికుండలిలీంద్ర మణిబద్ద భూవలయ పీఠికాం ||

వారిరాసి మణిమేఖలావలయ వహ్ని మండల శరీరణీం ||

వారి సారవహ కుండలాం గగన శేఖరీం చ పరమాత్మికాం ||

చారుచంద్ర రవిలోచనాం మనసి భావయామి పరదేవతాం ||4

కుండల త్రివిధకోణ మండల విహార షడ్దళ సముల్లతాం ||

పుండిరీఖ ముఖభేదినీం తరుణ చండభాను తడిదుజ్వలలాం ||

మండలేందు పరివాహితామృత తరంగణీ మరుణ రూపిణీం ||

మండలాంత మణిదీపికాం మనసీ భావయామి మణిదీపికాం ||5

వారణానన మయూరవాహనముఖ దాహరణ పయోధరాం ||

చారణాధి సురసుందరీ చికుర శేఖరీకృత పదాంబుజాం ||

కారణాధిపతి పంచక ప్రకృతి కారణ ప్రథమ మాతృకాం ||

వారణాంత సుఖపారణాం మనసి భావయామి పరదేవతాం ||6

పద్మకాంతి పదపాణివల్లభ పయోధరా నన స్రోదుహాం ||

పద్మరాగ మణిమేఖలా వలయినీ విశోభిత నితంబినీం ||

పద్మసంభవ సదా శివాంతమయ పంచరత్న పదపీఠికాం ||

పద్మినీం ప్రణవ రూపిణీ మనసి భావయామి పరదేవతాం ||7

ఆగమ ప్రణవ పీఠికా మమల వర్ణ మంగళ శరీరిణీం ||

ఆగమాయవ శోభినీ మఖిలవేద సారకృత శేఖరీం ||

మూలమంత్ర ముఖ మండలాం ముదుతనాద బిందు నవయౌవనాం ||

మాతృకాం త్రిపురసుందరీం మనసి భావయామి పరదేవతాం ||8

కాలికా తిమిర కుంతలాంత ఘన భృంగ మంగళ విరాజినీం ||

చూళికా శిఖర మాలికా వలయ మల్లికా సురభి సౌరభాం ||

కాళికా మథుర గండ మండల మనోహరా నన సరోరుహాం ||

కాళికాం అఖిల నాయికాం మనసి భావయామి పరదేవతాం ||9

నిత్యమేవ నియమేన జల్పతాం భుక్తి ముక్తి ఫలదా మభీష్టదాం ||

శంకరేణ రచితాం సదా జపేత్ నామరత్న నవరత్న మాలికాం ||