నరసింహ దండకము
నరశింహా దండకం
శ్రీ హరి పతి నిన్ను - వేడితి నరశింహా
నరుడా గురుడా - నివే నమ్మితి నరశింహా
చీమల వరదా - చిత్తజీవుడా
భావజ వరదా - భక్త వత్సలా! 1
గండ్రగొడ్డలి గల రాజులనెల్లా
ఖండింతురు యమదూతలవల్లా
గాలి ఇతడు ధూళి ఇతడు
ఓనంబితడు, కైనంబితడు ! 2
అంది పొంది నేర్చిన ఆది నారాయణమూర్తి ఇతండు
ఇతండు అనగా నెవ్వరు గోళజంబు నరశింహా భళా నరశింహా
నరశింహా నామములు ఎవరు తలుతురో
నామీద భక్తితో ఎవరు ఉందురో! 3
చింతామణి రామనామం
కల్పవృక్షం రామనామం
కామధేనువు రామనామం
సకలం సంపూర్ణం రామనామం ! 4
పడుకొని పఠన చేస్తే పసిబాలలకెల్లా రక్ష
కూర్చొని పఠన చేస్తే గృహములకెల్లా రక్ష
ప్రాతః కాల పఠన చేస్తే మహాపాపములు తొలుగును
మధ్యన వేళ పఠన చేస్తే మహాపాతకములు బాసును ! 5
సంధ్య వేళ పఠన చేస్తే శ్రీ మహాలక్ష్మి ఎదురుగుండా వచ్చును
అర్ధరాత్రి పఠన చేస్తే చొరభయంలేదు
అహొ వీర్యం
అహొ బాహు పరాక్రమం ! 6
శ్రీ నారశింహోనకు వైకుంఠ వాసునకి
ఉక్కు స్తంభమున ఊర్హిన ఊర్హునకు
వైకుంఠ వాసునకు వందితునకు
జయ మంగళం నిత్య శుభమంగళం ! 7
ఆకు మీదా ఉన్న ఆరామచంద్రునకు
వైకుంఠ వాసునకు వందితునకు
జయ మంగళం నిత్య శుభమంగళం
ఓం శాంతిః శాంతిః శాంతిః 8