నమో నారాయణాయ సగుణ
స్వరూపం
ప || నమో నారాయణాయ నమో సగుణ బ్రహ్మణే సర్వ పారాయణాయ శోభనమూర్తయే ||
చ|| నిత్యాయ విబుధ సంస్తుత్యాయ | నిత్యాధిపత్యాయ మునిగణ ప్రత్యయాయ |
సత్యాయ ప్రత్యక్షాయ సన్మానస సాం | గత్యాయ జగదవన కృత్యాయతే నమో ||
చ|| కరిరాజ వరదాయ కౌస్తుభాభరణాయ | మురవైరినే జగన్మోహనాయ ||
తరుణేందుకోటీర తరుణీ మనస్తోత్ర | పరిపూర్ణ చిత్తాయ పరమాయతే నమో ||
చ|| పాత్రదానోత్సవ ప్రథితవేంకటరాయ | ధాత్రీశ కామితార్థప్రదాయ |
స్తోత్రభిన్మణి రుచిర గాత్రాయ రవిచంద్ర | నేత్రాయ శేషాద్రినిలయాయతే నమో ||