నమామి విద్యారత్నాకర

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


రాగం: ధన్యాసి తాళం: చతురశ్ర త్రిపుట

నమామి విద్యా రత్నాకర గురువరం అనిశం భృశం||

శమాది సంపద్గుణ గణ భరితం బుధజన తోషణ నిరతం
రమాపతి ప్రియతమ మధ్వాగమాబ్ధి పారగమద్భుత చరితం||

పరమానుగ్రహ నిజ పద సుస్థాపిత విద్యావారధి తనయం
శరణాగత జన రక్షణ నిపుణం కరుణాపూరిత హృదయం
వర శిరోదై స్సంశోభిత తులసీదళ మాలం సుందరకాయం
సరస గాన శిరోమణీ వాసుదేవ గాన అతి ప్రియం||