నన్ను దోచుకొందువటే

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

నన్ను దోచుకొందువటే.. నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని

కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామీ ||నన్ను దోచుకొందువటే.||


తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన

పూల దండ వోలె కర్పూర కళిక వోలె, కర్పూర కళిక వోలె

ఏ నాటిదొ మన బంధం ఎరుగ రాని అనుబంధం

ఎన్ని యుగాలైనా ఇది ఇగిరిపోని గంధం, ఇగిరిపోని గంధం. ||నన్ను దోచుకొందువటే.||


నా మదియే మందిరమై నీవే ఒక దేవతవై

వెలసినావు నాలో నే కలసిపోదు నీలో, కలసిపోదు నీలో

ఎంతటి నెరజాణవొ నా అంతరంగమందు నీవు

కలకాలం వీడని సంకెలలు వేసినావు, సంకెలలు వేసినావు ||నన్ను దోచుకొందువటే||