Jump to content

నందబాలం భజరే

వికీసోర్స్ నుండి


            మణిరంగు రాగం      త్రిపుట తాళం

ప: నందబాలం భజరే బృందావన వాసుదేవం || నందబాలం ||


చ1: జలజసంభవాది వినుత చరణారవిందం

లలిత మోహన రాధావదన నళిన మిళిందం || నందబాలం ||


చ2: నిటలతటస్ఫుట కుటిల నీలలక బృందం

ఘటిత శోభిత గోపికాధర మకరందం || నందబాలం ||


చ3: గోదావరీ తీరవాస గోపికా కామం

ఆదిత్యవంశాబ్ధిసోమం భద్రాద్రి శ్రీరామం || నందబాలం ||

This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.