ద్వాదశ జ్యోతిర్లింగాలు పద్యాలు

వికీసోర్స్ నుండి

ద్వాదశ జ్యోతిర్లింగములు (శ్రీ శివకామేశ్వరీ కల్యాణము నుండి గ్రహించడ మైనది)

రచన:వడ్డూరి.అచ్యుతరామ కవి

<poem> శ్రీ దుర్గా భవాని విశ్వేశ్వర స్తోత్రం 1 ప్రభాసతీర్ధము-సోమలింగేశ్వరుడు అశ్వని రోహిణియారుద్ర ముఖ్యననత్ర భార్యలయందుచంద్రుడెపుడు రూపలావణ్యయౌ రొహిణీనే ప్రేమజూచుచు సవతులజూడకున్న పక్షపాతముగల్గు పాపాత్ములకు శిక్ష క్షయరోగమనుట శాస్త్రమునెరింగి చంద్రుని దక్షుడు శపియింప భీతిల్లి శాపవిముక్తికై సాంబ నిన్ను

ప్రణవ పంచాక్షరీ మంత్రపఠన జెసి భువి ప్రభాసంబుగానాబడు పుణ్యతీర్ధ మందు లింగ ప్రతిష్త నబ్జారి జేయ సోమలింగేశ్వరుండవై భూమి వెలసి భక్తులను బ్రోచుచున్నావు పరమపురుష శ్రీ ఉమారామలింగేశ చిద్విలాస.

2 శ్రీ శైల మల్లికార్జున లింగము ఆదిశేషుడు తొల్లి హరిహరదేవులగూర్చియొనర్చెనుఘోరతపము హరిహరుల్ ప్రత్యక్షమైవరంబునువేడు మనిబల్క శేషాహియమితభక్తి నర్చావతారులై యఖిలభక్తులబ్రోవనిజశిఖరంబులనిలుబవుడనగ హరిశ్రీనివాసుడైయతనిశిరంబందుబొలుపొందె,నీవునుబుచ్చమందు బరగుశ్రీశైలశిఖరానభవ్యమూర్తి మల్లికార్జున లింగ నామంబుదాల్చి దేవి భ్రమరాంబతో గూడి తేజరిల్లి ఇహపర సుఖంబులొసంగెదో యీశ్వరేశ శ్రీ ఉమారామలింగేశ చిద్విలాస!

3. ఉజ్జయినీ క్షేత్రం -శ్రీ మహాకాళ లింగము ఉజ్జ్వలుండనుప్రభుడుజ్జయనీనామనగరంబుగట్టిజమబుపొగడ మణిమంత్రసిద్దుడుమహితమహాకాళుడొసగినలింగంబునెసగుభక్తి బూజింపవానినిబొడగని యోర్వకశత్రురాజులు దండయాత్రరాగ తనలావునెంచి శాత్రవబలంబుదలచిశంకర నినుజేరి శరణు వేడ

ఉరుమహాకాళ మూర్తివై యుద్భవించి భద్రకాళితో గూడి భక్తులబ్రోచు శ్రీ మహాకాళలింగ విశ్వేశలింగ శ్రీ ఉమారామలింగేశ చిద్విలాస


4 ఓకారలింగము వింధ్య ఉర్వి పర్వతముల నుత్తమంబై యొప్పు మేరుపర్వతమును మించగోరి వింధ్యాచలము నిన్ను వేడుచునుగ్రమౌ తపమాచరింప నౌదార్య మొప్ప ఓంకారలింగమై యుద్భవించి నగేంద్ర పూజలంది జగంబు బ్రోచినావు ఓంకారరూప సంయుక్తమైన సువర్ణ దివ్యలింగముగాగ తేజరిల్లు

దంచిత సువర్ణ లింగ క్రుపాంతరంగ భూరిప్రుద్వీశలింగ యోంకారలింగ అచ్యుతారాధితపదాబ్జ ఆత్మలింగ శ్రీఉమారామలింగ విశ్వేశలొంగ


5 శ్రీ వైద్యనాధం రావణాసురుడనురాక్షసాగ్రణి తొల్లిభవనిన్నుగూర్చితపంబుసేయ దర్శనంబిచ్చిన దనలంకలోనిన్నునెలకొల్పబ్రార్ధించినీదులింగ మాలంక గొనిపోవు నవసరంబున మార్గ మధ్యమందు నడిపించె మాయజిక్కి మరలనెత్తగ రాక మరిమరియత్నించి రక్తసిక్తాంగుడౌ రవణునకు

గగనవాణి వచింపగ గడగినీదు లింగమచ్చట గొల్చి దివ్యాంగుడగుచు వైద్యసౌకర్యమును జెంద వైద్యనాధ లింగమను పేరజెలగెనిలింపవినుత శ్రి ఉమారామలింగేశ చిద్విలాస 6 ఢాకినీ భీమలింగము అలకామరూప రాజ్యమునందు ఢాకినీ పురమేలుభూపాల వరుండు నిన్ను బీమశంకర దివ్యనామ లింగార్చన సేయుచు రాజ్యంబు సేయుచుండ భీమాసురుండతి భీకరాక్రుతి ఖడ్గ ధారియై రాజునుదగ్ర శక్తి శివపూజ జేసిన శిరముఖండించెద ననిపల్క నారాజు హామహేశ

కావుమని బల్క భీమేశ కరుణ తోడ నవనిఢాకినిభీమలింగాఖ్య దనర భీమరూపంబునను దైత్యుభీము ద్రుంచి ప్రేమభక్తుల బ్రోచిన భీమలింగ శ్రీఉమారామలింగేశ చిద్విలాస 7 రామేశ్వరము శ్రీ ఉమారామలింగేస్వరుడు సీతాపహరణంబుజేసినదుస్టాత్మురావణాసురుయుద్ధరంగమందు సంహరించిన మనుష్యాక్రుతి దాల్చినపరమాత్ము రామునిబ్రహ్మహత్య వెంబడించినంతవిధిధర్మమునెరింగిసేతుబంధనమహాక్షేత్రమందు దేవ నీలింగ ప్రతిష్ట సేయగనంత బ్రహ్మహత్యా దోష బాధ తొలగె

రాముడు బ్రతిష్ట సేయుట రామలింగ మనెడి విఖ్యాతితోడ భక్తాళి బ్రోచి వివిధ పాపాపహారివై వెలయు దేవ శ్రీ ఉమారామలింగేశ చిద్విలాస


8 దారుకావనము - నాగలింగేశ్వరుడు దారుకావనమదు తారకాసురుడను పాపాత్ముడెల్లర బాధపెట్ట సుగుణాలవాలుడౌ సుప్రియుండను పేర బరగు నీభక్తుని బట్టి కొట్టి చెరసాలలో బెట్టి శివ నీదు పూజను మాననున్న నతడు మానుకున్న ఖడ్గంబుచే దలఖండింప బోవగా హరనిన్ను బ్రార్ధింప నతనిని బ్రోవ నాగలింగేశ్వరుండను నామమునను నుద్భవించుచు దారకునుక్కడించి భక్తవత్సలుడను పేరబరగినావు అచ్యుతారాధిత పదాబ్జ హరమహేశ శ్రీఉమారామలిగేశ చిద్విలాస

9 కాశీ క్షేత్రము - విశ్వేశ్వర లింగము బ్రహ్మదేవుదు పరబ్రహ్మ స్వరూపు నిన్నెరుగక నీశ్వరేశ హుంకారమొనరింప నుద్భవించిన కాల భైరవుదడుగ్రుడై బ్రహ్మశిరము చిటికిన వ్రేల్గోట చిదిమి వైచిననది ఖ్హండించు చోటనేకాశియయ్యె బ్రహ్మ కపాలంబు పడిన ప్రదేశంబు బ్రహ్మకపాల నామమున నడరె

భైరవుడు బ్రహ్మ హత్యను బాపుకొనగ దివ్య విశ్వేశలింగ బ్రతిష్త జేసె కాశి సర్వాఘములకు రాకాశియయ్యె శ్రీఉమారామలింగేశ చిద్విలాస

10 త్ర్యంబకం - త్ర్యంబకేశ్వరలింగము జీవనదులులేక జీవనంలులేక దాపసుల్ తపియించు తరుణమందు అల గౌతముండు దానయాశ్రమంబున దపశక్తి నక్షయ జలాశయమువలన పండించి మునులకు భక్తీ భోజనమిడ నూరక భుజియించి యోర్వలేక మాయగోవు సృజించి మంత్రించి బంపింప తృణదాన్యమాయావు దినుచునుండ నాయావునదిలింప నాఋషి దర్భను విసరంగ మృతి జెందె విస్మయముగ గోహంత కుడవీవు కుడువము నీయింటనని మునుల్ పలుకంగ నా ఋషి యును

నిన్ను గూర్చి తపంబునునియతి జేయ త్ర్యంబకేశ్వరుడనగ బ్రత్యక్షమగుచు ఘన జటాజూట మందలి గంగజలము గోవునకు ముక్తినోసగుచు కూర్మిబాఱ విమల గోదావరియనంగ వెలసే భువిని శ్రీ ఉమారామలింగేశ చిద్విలాస 11 బదరికావనము - కేదార లింగము నారాయణుండును నరుడును బడరికావని లోకకల్యాణ వాంఛతోడ పార్ధివ లింగంబు భక్తితో బూజించి చిరకాలము తపంబు సేయుచుండ నీవు బ్రత్యక్షమై నిలచిన నరుడును నారాయణుండు నానందమంది గౌరీ మనోహరాకరుణ నిచ్చట స్వయం వ్యక్త లింగాకృతి వరలి భక్త

తతిని గాపాడవే సతీయుతుడ వగుచు ననగ గేదారలింగ విఖ్యాతి వెలిగి జన్మరాహిత్యమాదిగా సకల వాంఛి తములోసగి వెలుగు కేదారలింగ శ్రీ ఉమారామలింగేశ చిద్విలాస


12.ఘ్రుష్ణేశ్వరలింగం భువి దేవగిరి యను పురమందు గల డొక్కయగ్రజుండు సుధర్ముడనెడి వాడు నతడు సహస్రలింగార్చన సేయుచు గడగివానిని తటాకమున వేయ నతనిసతి ఘ్రుస్మలాదేవి తనపుత్రు సవతి జంపింప విచారపడక హరనిన్ను బూజించి యాత్మ విశ్వాసంబు నిల్పి పేరున బిల్వ నీవు గరుణ ఘ్రుష్ణేశ్వరుండవై ఇష్ట వాంఛ లొసంగి పుత్రువి బ్రతికించి భూరి కీర్తి భక్త వత్సల కీర్తితో భవ వినాశ లీల వెలిగెదు ఘ్రుష్ణేశలింగ యీశ అచ్యుతారాధిత పదాబ్జ హర మహేశ శ్రీ ఉమారామలింగేశ చిద్విలాస