దేశభాషలలో శాస్త్రపఠనము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

దేశభాషలలో శాస్త్రపఠనము

కొమఱ్ఱాజు వేంకటలక్ష్మణరావు[1]

తల్లిపాలు త్రావి పెరిగిన బాలునకును, దాదిపాలు త్రావి పెరిగిన బాలునకును నెట్టి భేదముండునో స్వభాషయందు శాస్త్రాభ్యాసము చేసిన వారికినిఁ బరభాషయందు జ్ఞానార్జనము చేసినవారికి నట్టిభేదమే యుండును అన్యభాష మొదట నేర్చుకొని పిదప నా భాషయందు శాస్త్రముల గళలఁ జదువుకొనుట ద్రావిడప్రాణాయామము వంటిది కాని యిట్టిప్రాణాయామమే మన దేశమునందుఁ బ్రస్తుతము జరుగుచున్నది తర్క వేదాంతాది పూర్వశాస్త్రముల నేర్చుకొనవలయునన్న సంస్కృతము నేర్చు కొనవలెను రసాయన పదార్థవిజ్ఞానాది శాస్త్రముల నభ్యసింపవలెనన్న నింగ్లీషు నేర్చుకొనవలయును ఈ భాషల నభ్యసించుటకుఁ గొంతకాలము వ్యయపఱుపవలెను ఇవి మన మాతృభాషలు కానందున వీనినిఁ జక్కఁగ నభ్యసించుటకు విశేషముగాఁ బరిశ్రమము, కాలవ్యయమును, ధనవ్యయం బును గలుగుననుటకు సందేహములేదు స్వభాసయందే యన్ని విద్యల నేర్చుకొనుమార్గము లుండినయెడల నీ వ్యయప్రయాసము లన్నియుఁ దప్పిపోవును గదా ! ఉగ్గుపాలతో నేర్పబడిన స్వభాష సహజముగఁ బ్రతి మనుష్యునకు వచ్చును కొద్ది పరిశ్రమతో దానినిఁ బ్రతి మనుజుఁడు నభ్యసించి య0దుఁ బండితుఁడు కావచ్చును ఎట్టిక రినమైన గ్రంథమునైనను, విద్యనైనను, గళ్ళనైనను దనభాషలో నుండెనేని మాన వుఁడు సులభముగ దెలిసికొనఁ గలఁడు అంతి యొు కాదు ఆ భాష నెఱింగిన వారియందఱలో నాయా విద్యలు సులభముగను ద్వరితముగను బ్రసరించి జనుల యున్నతస్థితికిఁ గారణభూతములగును.

స్వభాషయందు విద్యలులేక పరభాష నభ్యసించి విద్యలసాధింపవలసిన హెఁడింట నన్నములేక పొరుగిండ్లు తిరిగి యన్నమును సంపాదించిన వానితో సమానుఁడు మనదేశములో మనకు, అనఁగా బ్రాహ్మణులకు మొదటినుండియుఁ బరాన్నమునుగోరుట విహితమైన ధర్మముగ నున్నందున మనవా రిది యొకగొప్ప తప్పగ నెంచకపోవచ్చును. కాని ప్రాణముతో నున్న పాశ్చాత్యదేశములవంకఁ జూడుఁడి, విద్యావిషయమున నితర దేశముల కంటె వెనుకబడకుండుటకై వారు చేయు ప్రయత్నములు చూచిన నెవ్వరి మానస మాశ్చర్యానందముల మునుంగక మానును ? విద్యావిషయమై వారి కింతకత యేల ! కారణము స్పష్టము. నేఁడు వలసిన విద్యలన్నియు నేర్పు విద్యాపీఠములును, గ్రంథ రాజములును ఇంగ్లండు దేశమునం దున్నం దున వేఱు దేశమునకుఁ బోకయ, వేఱుభాష నేర్చుకొనకయు వారి కన్ని విద్యలును, గళలును, వృత్తులును నేర్చుకొనుటకు వీళ్లున్నవి. దైవము యొక్క యద్భుత ఘటనచే శాస్రృసంబంధమయిన ఇంగ్లీషుగ్రంథములన్నియు నేఁడొక్క పెట్టున నశించిన వనుకొనుఁడు. పాప మిట్టిదురవస్థ యే దేశమునకు నెప్పడును రాకయుండునుగాక ! వచ్చినయెడల నింగ్లీషువారి విద్యాభ్యాస స్థితి యేమగును ? ఏవిద్య నేర్చుకొనవలయునన్నను బరభాషయైన జర్మనీ భాషనో, ఫెంచిభాహనో మొదలభ్యసించి తద్ద్వారమున నిష్ట విద్యనుగాని, కళలనుగాని, వృత్తులనుగాని నేర్చుకొనవలెను. అప్పడు వారిసాంపత్తికస్థితి యిప్పడున్నట్లుండఁ గలదా ? పొగబండి నడపువిధములఁ దెలిసికొనుటకు జర్మనీ దేశమునకు, నావిక శాస్త్ర మెఱుంగుటకు ఫ్రాంసు దేశమునకు, నాకాళయానము నభ్యసించుటకు ఇటలిదేశమునకు "దేహి యనిపోవల సిన యింగ్లీషు వారు తమ దేశాభివృద్ధి యెట్లుచేయఁగలరు ? కావున స్వస్వ మాతృభాషలలో సకలవిద్యాసాధనము లుండుట నాగరక రాష్ట్రముల యొక్క మొదటిలకణము.

ఇంగ్లీషు నేర్చుకొనుట

అట్లన నెవ్వరును సంస్కృతమునుగాని యింగ్లీషునుగాని నేర్చుకొనఁ గూడదాయనియు, నాయాభాషల నేర్చుకొని విద్యలను సాధించుటకు వీలున్నప్పడు మాతృభాషలో లేవన్న చింత మన కేల యనియుఁ గొంద అడుగవచ్చును. సంస్కృతభాషనుగాని, యింగ్లీషుభాషనుగాని, ఫ్రెంచి మొదలయిన తదితర భాషలనుగాని చేతనైనవారు, ధనమున్నవారు, వీలుగల వారు నేర్చుకొవలయుననియే నా తాత్పర్యము. వానిలోను, రాజభాస యయినందునను, లోకమందలి యితర భాషలకంటె నన్ని విధములను గ్రంథ భాండారమునం దత్యధికమైనదని ప్రఖ్యాతిచెందినదియు, నగుటచే నింగ్లీషు భాషను నేర్చుకొనుట మననాగరకతాభివృద్ధికిని దేశోన్నతికి నత్యం తావళ్య కమని నాయభిప్రాయము. కాని యది యెంత వఱకు సాధ్యమో ! జన సామాన్యమున కంతకు నింగ్లీషుభాష చక్కఁగ వచ్చుటయు, నందు వారు సకలవిద్యలను సాధింపగలుగుటయు నిఁక వేయి సంవత్సరముల కయినను హిందూ దేశమునందు సంభవించునా ? ఎప్పటికిని సంభవింపనేరదు అ ప్లే సంస్కృతము ఇది దేవభాషయని మనకు భక్తియున్నను దేశమునం దెందఱు సంస్కృతపండితులు కలరు సంస్కృతము దేశభాషాభివృద్ధికి సాయముగా నుండవలసినదే కాని మరల నది దేశభాష యగు నన్నమాట కల లోని వార్త సంస్కృతముగాని, యింగ్లీషుగాని హిందూదేశములోని దేశ భాషాస్థానము నాక్రమించుకొన నేరవు దేశభాషలలో విద్యనేర్పుటకంటె ఈ భాషలలో విద్యనేర్పుట యెప్పడును నేర్చుకొనువారికిని, నేర్పువారికిని నెక్కుడు కష్టముగా నుండఁగలదు కావున నా యూభాష ల వారికి నా యాగా భాషలలోనే విద్యాదానము చేయుమార్గముల నిర్మించుట యావశ్యకము

ఇప్పడు మనదేశస్థులు వేఱు వేఱువిద్యల సాధింపనెంచి కొంద కింగ్లండునకును, గొందఱు జపానుకును, గొందఱు అమెరికాకును పోవుచున్నారు. దేశము యొక్క భావిపురోభివృద్ధి కిది మంచి చిహ్నమే కాని యాలాగున నెందఱు పోఁగలరు? లక్ష కొక్కఁడుగాని వేయి కొక్కఁడు గాని వెళ్లగలఁడా వేలకొలఁది ధనము వెచ్చించి యితర బాధలకోర్చి లక్ష కొక్కఁడు పెళ్లివచ్చిన నేమి ప్రయోజనము ? మిగిలిన తొంబదితొమ్మిదివేల తొమ్మిదివందలతొంబదితొమ్మిది మందికి వివిధ విద్యలబ్బుట యెట్లు? వీరిలోఁ గొందఱు కొంచెమింగ్లీషు నభ్యసించెదరనుకొందము మిగిలినవారిగతి ? వారికి జ్ఞానార్జనము చేయుదమన్న కోర్కె పొడమినను జ్ఞానము లభించు మార్గము లేదా? అట్టి సాధనముల నిర్మించుట దొరతనము వారి యొక్కయు, విద్యాధికుల యొక్కయు, ధనాధికుల యొక్కయు నర్ఘకృత్యముకాదా 2 ప్రజలందఱకును విద్య నేర్చుకొనుటకు వీలయిన సాధనములను నిర్మించుట రాజధర్మము ఈయుద్దేశముతోడనే శ్రీశ్రీచక్రవర్తివారు పట్టాభిషేక మహోత్సవకాలమందుఁ బ్రాథమికవిద్యకై 50 లక్షల ధన మొసంగిరి కాన నీధనములో నేమి యెన్నవవంతు దేశాభివృద్ధికై ఖర్చుపడునో చూడ వలసియున్నది మనము కేవలము రాజసాహాయ్యము నమ్మియేయుండఁ గూడదు వారు చేయు సహాయమునకై కృతజ్ఞులమగుచు మనము స్వతంత్ర ప్రయత్నములను జేయుచుండవలెను ఈమార్గమునఁ బోయిన బాగుగనుండునని ముందంజ వేయుటకు విద్యావంతులును, విద్యావంతులచే నారంభింపఁబడిన కార్యములు శాశ్వతములుగ నుండునట్టు చేయుటకు ధనవంతులును సంసిద్ధులైయుండవలెను శాస్త్రజ్ఞానాభివృద్ధికై మనదేశము నందు జరుగవలసిన పనినిగూర్చియు, జరుగనున్న పనినిగూర్చియు విచారించెదము

సాధనములు

దేశమందంతట శాస్త్రజ్ఞానాభివృద్ధి కావలయునన్న దేశభాష యందు గ్రంథములు, నాళాస్త్రములను బోధించు పార శాలలు నుండవలయును కేవలము విద్యాపీరములుండి గ్రంథములు లేకపోయినను బ్రయోజనములేదు కేవలము శాస్త్రములుండియుఁ జెప్పవారు లేక పోయిన నుపయోగములేదు ! ఇందుకు దృష్టాంతముగ నొక చిన్న యుదాహరణమిచ్చెదను చెన్నపట్టణమునందు నాయుర్వేద పారశాల యున్నదని మీ రెఱిఁగినవిషయమే అందు నింగ్లీషు పద్దతిప్రకారము శారీర శాస్త్రము (Physiology and Anatomy) అను విషయమొకటి విద్యార్ధులకు బోధించెదరు. పాశ్చాత్య వైద్యశాస్త్రమునం దారితేరిన డాక్టర్లే యీ విషయమును బోధించెదరు కాని యీ విషయమును బోధించు గ్రంథము దేశభాషలందు లేనందున, విషయబోధ చేయుటలో నుపాధ్యాయులకును, విషయమును బోధచేసి కొనుటలో విద్యార్ధులకును మితి లేని పరిశ్రమ కలుగుచున్నది తెలుఁగునందు శ్రీ వీరేశలింగము పంతులుగారిచే రచింపఁబడిన చిన్న శారీరకశాస్త్రము గ్రంధము కలదు. కాని యది యీ తరగతికిఁ జాలదు ఇంతకంటె నెన్నియో మడుంగులు విపులముగ వ్రాయఁబడిన గ్రంథము కావలయును .అట్లే శస్త్రవైద్యమునుగులకించిన గ్రంథము తెలుఁగులో లేనేలేదు ఇతర దేశభాషలందును లేదు కావున నది నేర్చుటయే యసంభవమైనది. ఆవిషయము నాయుర్వేద వైద్యశాలలో నేర్పు విషయములలోనుండి తీసివేసిరి అశ్లే యాయుర్వేదసంబంధమైన యుద్దంథములు సంస్కృతమునందే కలవు తెలుఁగునఁగాని యితర భాషలందుఁగాని లేవు "కావున సంస్కృతము చక్కగ రానివారికి నాగ్రంథ ములవలన విశేష లాభము కలుగదు ఈ యిక్కట్టు నాలోచించి యేు శ్రీభిసజ్మణి పండితగోపాలాచార్యులవా లాయుర్వేద గ్రంథమాల నొక దానిని స్థాపించి గీర్వాణగ్రంథములను చెలుఁగు చేసి యాంధ్రులకృతజ్ఞతకు బాత్రులైరి. మచిలీపట్టణములో స్థాపింపబడిన జాతీయ కళాశాలాధి కారులుకూడ భిన్న భిన్న కళాకౌశల్యములు నేర్పుటకు దగిన గ్రంథములు లేనందున నేగ్రంథములు పరనీయములుగా నేర్పరుపవలయునాయని తొక్కులాట పడుచున్నారు ! ఇది చదువు చెప్పవారుండి చదువుకొను గ్రంథములు లేనందునఁ గలుగు నిబ్బంది ఇళ్లే కొన్ని యెడల గ్రంథము లున్నను వానినిఁ జదువు వారుగాని, చెప్పవారుగాని యుండరు. ఉపయోగములేక పుస్తకములు చెదలు పట్టిపోవును. తెలుఁగులో బీజగణితము (Algebra) ఉన్నది. క్షేత్రగణితము (Mensuration) ఉన్నది. అట్టిగ్రంథములకు విశేషప్రచారము లేక యవి ప్రాచ్యలిఖితపుస్తక భాండా గారమునందు మూలదాగి యేలయుండవలయును ? వాని నుపయోగించు గురువులు, నభ్యసించు విద్యార్థులును లేక, అట్లగుటచే దెలుఁగులోఁ గూడ 'నాల్జెబ్రా చెప్పవచ్చునా? తెలుగులో ‘జ్యామెట్రి' నేర్పగలమా ? Progressions చెప్పిన ఇంగ్లీషులో జెప్పవలయు నేగాని తెలుఁగులో నేర్పుటకు వీలు లేదు అని మనవారే వాదింపఁ జొచ్చిరి! ఇంగ్లీషు గణితమునకుమాఱుగా లీలావతిగణితమునే మన పాఠశాలలోఁ జెప్పచుండినచో నిట్టి సంశయములు మనవారి కేల పుట్టును ? ఇప్పడు మన పిల్లవాండ్రు ఎఫ్. ఎ. తరగతిలో నేర్చుకొనుచున్న ప్రొగెషనులు, • పెర్ము శేషటేషన్, కాంబినేషనులు ' మన పిల్లలు నాలుగవ యుయిదవ తరగతులలో, ". వ్యవహారము, అంకపాళ వ్యవహారము" అను పేళ్లతో నేర్చుకొని యుందురు. నా తాత్పర్యము పాశ్చాత్య గణితశాస్త్రము మనగణితశాస్త్రమున కంటెఁ దక్కువ యభివృద్ధిలో నున్నది యని చెప్పటకాదు. ఇటీవలి గణితజ్ఞల బుద్ధిసూక్మతచే బాశ్చాత్య గణితశాస్త్రముయొక్క క్షేత్ర మత్యద్భుతముగ వైశాల్యముఁ జెందినదియని నేనెఱుంగుదును. కాని యావిద్య యంతయుఁ దెనుఁగునఁ జెప్పరాదా? జ్ఞాన మొక భాష యొక్క యబ్బసామ్మకాదు. ఏభాష మూలముననైనను దానిని సాధింపవచ్చును. ఎవరి మాతృభాషలో వారు సులభముగను గొలఁది కాలములోను, గొలఁది శ్రమలోపలను తెలిసికొన వచ్చును. పరభాషలో నభ్యసించిన యెడల నెక్కుడు కాలము, నెక్కుడు శ్రమయు, నెక్కుడు ధనవ్యయమును బట్టును. ఈ భేదము కనిపెట్టి యింగ్లీషు విద్యలన్నియు మన భాషలోనికిఁ దెచ్చి లోకులకు బోధించుట సమంజసము , అట్లు చేయక పరభాషలలోఁ జెప్పట స్వభావవిరుద్ధము.

ఇఁక నిప్పటి విద్యాభ్యాసపద్ధతి చూతము. 1_వ ఫారముగాని 2-వ ఫారముగాని మొదలుకొని మన పిల్లవాండ్రకు భూగోళము, అంకగణితము, రేఖాగణితము, పదార్థ విజ్ఞానము మొదలయిన విషయములన్నియు నింగ్లీషునఁ జెప్పఁ బ్రారంభించెదరు. అప్పటికా బాలునికి నింగ్లీషుజ్ఞాన మెంత వఱకుండును? తప్పలు లేకుండ రెండు వాక్యములుకూడ వ్రాయు సామర్థ్యము వాని కుండదు . తనమనస్సులోని యూ హల నింగ్లీషునందుఁ జెప్పఁజాలఁడు. అట్టి వానికి నింగ్లీషునందు రేఖాగణితము చెప్పిన నేమి ప్రయోజనము ? A point is that which has no dimension అనిన వాక్యమునకు నర్థము చక్కఁగఁ జేసికొనలేనివానికి 'యూక్లీడు' భూమితి యింగ్లీషులోఁ జెప్పి "గందునఁ బ్రయోజనమేమి? భట్టీ పెట్టుట, యనఁగా నర్ధము తెలిసినను, డెలియక పోయినను వల్లించి తూచా తప్పకుండ నొప్పగించి పరీక్షలలోఁ గృతార్ధులగుట, యిందువలన సిద్ధించుచున్నది చెప్పినదానికి నర్ధముచేసి గాని కొనుట గానీ, మనస్సునందలి యూహల జెప్పటకుఁ గాని తగినంత భాషా జ్ఞానము లేనివారు గ్రుడ్డిపారములు చేయక పరీక్షలోఁ గృతార్ధులగుటకు వీలున్నదా ? లేదు కావున నింగ్లీషులో నీ విషయమును నేర్పి మనము మన విద్యార్ధుల యొక్క బుద్ధి వైభవమును దగ్గించు చున్నామని నా యొక్క దృఢనిశ్చయము ఇప్పడు ప్రవేశ పరీకవఱకుఁ జదువుచున్న విద్యార్ధుల ధారణాశక్తియంతయు, నింగ్లీషునందు భిన్న విషయముల నింగ్లీషుభాషలో వల్లించుటయందే వ్యయమగుచున్నది స్వభాషయందు వారికీవిషయముల నేర్పిన నింతపరిశ్రమ యుండడుగదా? వారికి విషయము బహుసులభముగా బోధపడును ఒక్కసారి బోధపడిన తరువాత విద్యార్థి గ్రంధమునంతయు వల్లింపఁబనిలేదు ప్రశ్నలకు విద్యార్థి ప్రత్యుత్తరము చెప్పనపుడు తన మూటలలోనే చెప్పఁగలఁడు తనవూటలలోనే వ్రాయఁగలఁడు అందుకై వేఱుపరిశ్రమగాని ప్రయత్నముగాని యక్కఱలేదు వచ్చిరాని ఇంగ్లీషులో నేర్చుకొనుటకంటెను, బదులు చెప్పటకంటెను, స్వమాతృభాషలో నేర్చు కొనుటయు బదులు చెప్పటయు నూఱు రెట్టు సులభతరము ప్రతిపారశాల లోను బ్రవేశపగీకవఱకును බීෆ గ్లీషు, సంస్కృతము మొదలగు వాజ్మయ నిషయములు తప్ప మిగిలిన విషయములన్నియు, అంకగణితము, బీజగణితము, రేఖా గణితము, క్షేత్రగణితయి, పదార్ధవిజ్ఞానశాస్త్రము, రసాయన శాస్త్రము మొదలయినవన్నియు, బాలకుల మాతృభాషలయందు నేర్పిన యెడల నిప్పడు బి ఏ వారి కీవిషయములందు నెంత ప్రవేశముకలదో యంత ప్రవేశము ప్రవేశపరీక్షలోని విద్యార్ధులకుఁ గలుగుననియు గనీసము మూఁడు సంవత్సరముల కాలము కలిసివచ్చు ననియు, నందుకయ్యెడు వ్యయ ప్రయాసలు తప్పననియు నాయొక్క దృఢమైన యభి ప్రాయము బడిజీతములు భరించుటకు వీలులేకుండఁ బెరిగిన యీ కాలమున నొక్కొక విద్యార్థికి మూఁడు సంవత్సరము లనఁగా వేయి రూపాయలని వేఱుగఁ జెప్ప నక్కఱలేదు నలుగురు పిల్లలు గలవారికి నాలుగు వే లా దాయముగదా !

ఒక యాక్షేపము

కాని యిట్లు చేసిన యెడల నింగ్లీషుభాష మనవారికిఁ జక్కఁగ నల వాటు కాదు దానియందు మనవిద్యార్ధులకుఁ గలుగుచున్న ప్రజ్ఞా విశేషంబులు తగ్గును అందుచే నింగ్లీషుభాషాధ్యయనమువలన మనకు నిప్పడు గలుగుచున్న యద్భుతమైన మానసోన్నతియు నాదరోృదయ ములును దొలఁగి మనకు మిక్కిలిహాని సంభవించునని కొందఱనవచ్చును ఇంగ్లీషు విద్యార్ధు లింగ్లీషు వాజ్మయంబు నధికముగా నభ్యసింపవలయు నన్నమాట నాకును సమ్మతమే ఆ యద్వితీయ వాజ్మయ ప్రభావమును నేనెఱుంగుదును దాని నభ్యసించి మనభాష నంతస్థితికిఁ దెచ్చుటయే విద్యా ధికుల యర్ఘకృత్యమిని నా తాత్పర్యము కాని యాభాషయందు గణితమును, బీజగణితమును, గమ్మరమును, గుమ్మరమును నేర్చినఁగాని యాభాష చక్కగా రాకపోవునని నేను దలపను కావ్యములను, వ్యాసములను, జర్చలను, జరిత్రలను, రాజకీయోపన్యాసములను, నుద్దంథములను, దత్వగ్రంథములను చదివిన బాషాప్రావీణ్య మలవడు నేగాని గణితాదికములు చదివినందునఁగాదు. కావుననింగ్లీషు చక్కగ రావలయునన్న నిప్పడింగ్లీసు వాజ్మయము దినమునకు నొక్క గంట చెప్పచున్న యెడల నిఁక ముందు రెండుగంటలు చెప్పవచ్చును శాస్త్రములు తెలుఁగు లోఁ జెప్పవచ్చును ఇ టైంగ్లీషువాజ్మయమును జక్కఁగఁ బూర్తిగ నేర్చుకొనవచ్చును శాస్త్రములను సాధింపవచ్చును ఇప్ప, ‘ డితో భ్రష్ట _తతో భ్రష్ట" అన్నట్టు మన బాలకులకు నింగ్లీషు బాగుగ వచ్చుట లేదు, శాస్త్రములు చక్కఁగఁ దెలియుట లేదు. ఇకముందు నేను జెప్పిన ఏర్పాటు చేసినయెడల విద్యార్ధు లన్ని విషయములందును బాండితి కలవారగుదురు. ఇప్పడు పరభాష లో శాస్త్రముల నేర్చుకొనుటకుఁ బట్టుచున్న పరిశ్రమ నే, యింగ్లీషు వాజ్మయమును వశపఱచు కొనుటకు నుపయోగించితి మేని యింగ్లీషు గ్రంథకారులతో దులతూగునట్టి యాంగ్ల సాహితి మనకుఁ దప్పక యలవడఁగలదు.

ఇంగ్లీషువిద్యను గఱపు బడులలోనే శాస్త్రములను దెలుఁగునందుఁ జెప్పమన్నపుడు ప్రాధమిక పారశాలల నన్ని విషయములను దెలుఁగునందే నేర్పవలెనని వేఱుఁగఁ జెప్పవలెనా ? ఇంగ్లీషు రాక యే మనవారు బీజగణిత మందలి వర్గ సమీకరణము (Quadratic Equation) అనేక వర్ణసమీకరణము (Simultaneous Equations), రేఖాగణితమందలి వృత్త (Circle) దీర్ఘ వృత్త (Ellipse) సంబంధమైన సిద్ధాంతములును, భౌతికశాస్త్రమందలి విద్యుత్ర్ప వాహకములను గుఱించిన సిద్ధాంతములును దేట తెలుగున నొకరితో నొకరు సంభాషించుసమయము తెనుఁగు దేశమున కబ్బెనేని యది మనదేశాభ్యు దయమునకు నిశ్చయమైన చిహ్నమని చెప్పవచ్చును ఇది మనలోఁగొంద ఱకు విశేషముగా నింగ్లీషుభాష తప్ప జ్ఞానార్టనమునకు వేఱుసాధనముండునా యని తలంచువారికి నేనుగోరిన కోర్కె గొంతమ్మకోర్కెవలె దోచిన దోఁపవచ్చును కాని మహారాష్ట్ర దేశమునకు వెళ్లి చూచిన యెడల నిందేమియు వింతలేనట్టు స్పష్టపడ గలదు. నేను పదార్ధవిజ్ఞానశాస్త్రమును మొదట మహారాష్ట్రమునందె చదివితిని. ఎఫ్ ఎ పరీక్షకుఁ జదువు విద్యార్ధులకు బీజగణితమందలి కొన్ని లెక్కలను మరాటీలో బోధ చేయునట్టి యింగ్లీషు రానట్టి నార్మల్ స్కూల్ మరాటీవిద్యార్ధుల నేనెఱుఁగుదును కొన్ని దినముల క్రిందట విజ్ఞానసర్వస్వము నిమిత్తమై యార్యగణితమును గుఱించి కొన్ని సంగతులు తెలిసికొనుటకుఁ జెన్న పట్టణమందలి ప్రాచ్య లిఖితపుస్తక భాండాగారమునకుఁ బోవుట తటస్థించెను అప్పడు నేనచ్చట బీజగణితములోని అను సూత్రములను గాగితముమీద వ్రాసికొని లెక్కలు వేసికొనుచుండగా నొకవైష్ణవుఁడువచ్చి యదియేమని నన్నడిగి విషయము కొంచెము తెలిసికొని వెంటనే వానితో సమానములైన సూత్రములను సంస్కృతములోఁజదివి నాకెంతయు విస్మయమును గలుగఁ జేసెను' ఈ వైష్ణవున కింగ్లీషు రాదు-సంస్కృతము, అరవము, కొంచెము తెలుఁగు మాత్రము వచ్చును ఈ బీజగణితసూత్రము లాతఁడు వీధిబడిలో నేర్చుకొనెనఁట కావున నెట్టి ఘనమైన శాస్త్రములైన నాంధ్రమున బోధచేయ వచ్చును ఆంధ్రమున వ్రాయవచ్చును

గ్రంథనిర్మాణము

కావున మనము మొట్టమొదట చేయవలసినపని శాస్త్రీయ గ్రంథముల నిర్మించుట శ్రమపడి యిట్టి గ్రంథములను వ్రాసిన నేమి ప్రయోజ నము ? ఎవరు చదివెదరు ? గ్రంథకర్త కేమి లాభము ? అని కొందఱడుగ వచ్చును కాని మనమిట్లు నష్టజా తకముల గుణించుచు నెన్ని దినము లుండ వలెను ? ఇట్లు నష్టజాతకము గుణించువా రెవరేమి యన్నను దానిని ఖండిం చుటకు సిద్ధముగానుందురు. పారశాలలలోఁ దెలుఁగున శాస్త్రములు చెప్పఁడనినపుడు మీకుఁ దెలుఁగులో శాస్త్రగ్రంథము లేవియని యడ్డము చెప్పదురు. శాస్రగ్రంథములు వ్రాయుఁ డన గానె "ఆ గ్రంథముల నుప యోగించు బళ్లేవోయి' యని వీరె మరల నడ్డమువచ్చెదరు. వీరి సిద్ధాంత మనుసరించినఁ బిచ్చికుదిరినఁగాని పెండ్లికాదు, పెండ్లియైనఁగాని పిచ్చి కుదురదు వీరివాదము వినుచుండినఁ బిచ్చియుఁ గుదురదు, పెండ్లియు గాదు కావునఁ బరస్పరాశ్రయదోష భూయిష్టమైన వీరివాదమును చూచి మనము భయపడవలదు ఇదియుఁగాక క్రొత్తగా నిర్మింపఁబడు గ్రంథములు వ్యర్థముగా మూలపడియుండునని గ్రంధకర్తలు తలఁపవలదు దొరతనము వారి వలనఁ బ్రోత్సాహము కలిగినయెడల విశేషమే అట్లు ప్రోత్సాహము కలుగక పోయినను బాఠశాలలలోఁ బఠనీయముగా నియమింపకపోయినను యోగ్యతగల గ్రంథమును— అది నవలగానిండు, చరిత్ర గ్రంథము కానిండు, కరినమైన శాస్త్రము కానిండు— ఆంధ్రలోకము తప్పక యాదరించుననియే నా తాత్పర్యము. ఇటీవల నాంధ్రదేశమునందు భాషాభిమానము కలిగినది పూర్వ మైదు సంవత్సరములలో నొక గ్రంథముయొక్క ౫౦౦ ప్రతు లమ్ముడుపోవుట దుర్లభముగా నుండెను. ఇప్పడొక్కొక్క గ్రంథము యొక్క ౨౦౦౦, ౩౦౦౦ల ప్రతులు విక్రయమగుటయేగాక రెండుకూర్పులు, మూఁడు కూర్పులు అచ్చగుట తటస్థించుచున్నది. ఏ పారశాలయందును బఠనీయ గ్రంథములుగా లేకపోయినను విజ్ఞానచంద్రికాగ్రంథమాలలో నిదివఱకుఁ బదునొకండు శాస్త్రీయ గ్రంథములు ప్రకటింపఁబడినవనియు, నందుఁ బెక్కులు రెండుసారులచ్చొత్తింపఁబడిన వనియు, నేగ్రంధమును ౩౦౦౦ ప్రతులకం పెను దక్కువ యమ్మడు పోలేదనియు, రసాయన శాస్త్రము వంటి కరిన శాస్త్రనునుగూడ నింగ్లీషు రాని స్వర్థకారులు కొందరు చదివి యుపయోగించు కొనుచున్నారనియు, నింగ్లీషు రానివారు పెక్కండ్రు గవర్నమెంటు టెక్నికల్ పరీకులకై యీగ్రంథముల నుపయోగించుకొను చున్నారనియు నందఱకు బాహాటముగాఁ దెలిసిన విషయమే కావున గ్రంథము లమ్ముడు పోవన్న భీతి గ్రంథకర్తలు మానవలయును. ఒకానొక పుస్తకము మంచిదగు నేని యది పరనీయగ్రంధము కాకపోయినను, “ఆ గ్రంథము నుపయోగింపవద్దు, మాకిష్టమైన యీగ్రంథము నే ఉపయోగింపుఁ'డని ఇకౌస్పెక్టర్లు చెప్పచున్నను నుపాధ్యాయులును, శిష్యులు నీ మంచిపుస్తక మునే తెప్పించి చదివెదరు ఇకాస్పెక్టరు వచ్చినప్పడు దాచిన దాచెదరేమో గాని యోగ్యమైన గ్రంథములఁ జదువుట మానరు

ఒక వేళఁ గొన్ని గ్రంథములకు లోకాశ్రయము లేకపోయినను, నాంధ్రదేశమందలి రాజులు, మహారాజులు మొదలయిన వారును, శ్రీమం తులును విద్యాసంఘములు నిట్టి గ్రంథకర్తలకు సాయముచేసి వివిధశాస్త్ర ములను గుఱించిన గ్రంథములను వ్రాయింపవలెను. భాష యందుఁ బ్రబంధములు, నాటకములు, నవలలు మొదలయిన లలితవాజ్మయ మభివృద్ధిఁ జెందుట యొక యొత్తు, శాస్త్రజ్ఞానాభివృద్ధి కనుకూలములైన గ్రంథములు నిర్మాణ మగుట యొకయెత్తు ఇట్టి గ్రంథములు దేళ దారిద్ర్యవినాశకములు ఇప్పడు మన దేశమునందు దేశ భాషాభివృద్ధికిఁ గొంతప్రయత్నము జరుగుచున్నను, లలితవాజ్మయాభివృద్ధియందే యొక్కుడు శ్రద్ధ కానవచ్చు చున్నది. ప్రకృతిశాస్త్రనిర్మాణమునకు నొకటి రెండు సంఘములు తప్ప నితరములు ప్రయత్నించుట లేదు. ఇది యెంతయు శోచనీయము భాషాభి వృద్ధికై మనవారు చేయు ప్రయత్నములలో సగము ప్రయత్నము శాస్త్ర జ్ఞానాభివృద్ధికిని, సగము ప్రయత్న మితర లలితగ్రంథాభివృద్ధికిని వ్యయ పడునట్లు చూచుచుండవలెను. ఒకానొక సంఘము పది గ్రంథములను బ్రక టింపఁదలఁచెనేని వానిలోనైదు భౌతికాదిశాస్త్ర ప్రవర్తకములుగను, మిగి లిన యయిదు వేఱువిషయములను బ్రతిపాదించునవిగను నుండునట్లు చూడవలయును ఒకానొక జమీందారుగారు గ్రంథకర్తలకు బహుమతు లీయఁదలఁచిన నందు సగముధనము శాస్త్రములకును, సగముధన మితర విషయములకును బంచింుూవలయును. శాస్త్రగ్రంథములు వందలకొలఁది వెలువడినతరువాత నీ నియమమును బాటించినను బాటింపవచ్చును కాని యంతవఱకు నీ నియమమును మన వారు శ్రద్ధతో బాట్రించినఁగాని యు.ూ" దేశము యొక్క యార్ధికావస్థ యభివృద్ధిఁ జెందనేరదు ఇప్పడిప్పడు కొన్ని ప్రకృతిశాస్త్ర గ్రంథములు వెలువడినవీ కాని వెలువడినవి స్వల్పము వెలువడవలసినవి. యసంఖ్యములు వేలకొలఁది గ్రంథములు పుట్టవలసినచోటఁ బది యిరువది పుట్టిన నేమూలకువచ్చును ? బంగాళీభాషయందును, మరాటీ భాష యందును వ్రాయబడిన భౌతికశాస్త్రగ్రంథములను జూచిన నెట్టి వానికైనను విభ్రమము కలుగక మానదు

పారిభాషికపదములు

దేశభాషలలో శాస్త్రీయగ్రంథములు వ్రాయుటకు శాస్త్రీయపద ముల యభావ మొుక ప్రబలకారణమని కొందఱు చెప్పచున్నాగు కాని శాస్త్రీయపదములకై యెవ్వరు నాగనక్కఱలేదు ఇదివఱకుఁ గొందఱచే నేర్పాటు చేయబడిన పదము లుండెనేని వానినే స్వీకరించి గ్రంథము వ్రాయవచ్చును "ఇదివఱకున్న పదములు బాగుగ లేవు' అని మూతివిరుచు వారు పెక్కురు గలరు అట్టివారి కీక్రిందివిధమున "The Twentieth century English Maratta Dictionary (Literary, Scientific and Technical)”eo మహాకోశము యొక్క కర్త యిట్టు ప్రత్యుత్తర మిచ్చియున్నాఁడు. * It may be that a word newly coined by two or three experts may be found fault with as inaccurate by a fourth one This fourth expert will offer his own coinage as an improvement forgetting all along that there will be others who will find similar fault with his own creation ... what happens at present is that every new writer arbitrarily mints his own technical terms not taking pains to see what his predecessors in the same department, have done. It is easy to say for one that a certain word is not an accurate rendering of its corresponding English word but if this very objector is requested to make his own suggestion and from every point of view a faultless one, he often finds himself unable to do it and then atonce gives in his adhesion to the old proposal.” ఇట్లు వీరి పదములు వారికిఁ బనికి రావు: వారిపదములు వీరికిఁ బనికి రావు. వీరికందఱకుఁ బనికివచ్చుపదము లేర్పడువఱకు గ్రంథములు వ్రాయకుండఁ గూర్చుండిన యెడలఁ గాలాంతమువఱకు నిట్లే యుండవలెను ! కావున బుద్ధిమంతులు చేయవలసినపని యేమనఁగా నిట్టి గ్రంథములు వ్రాయునపు డదివఱకు గంథములు వ్రాసినవారిచే నుపయోగింపఁబడిన పదములనే వీలయినంత వఱకు వాడవలెను. అట్టి పూర్వగ్రంథములు లేకపోయినపుడును, నితరుల పదముల నుపయోగించుటకు నిష్టము లేనప్పడును స్వయముగాఁ బదముల నిర్మింపవచ్చును. అదియు నిదియుఁ జేతకానప్ప డింగ్లీషు పారిభాషిక పద ములనే తీసికొవి గ్రంథము వ్రాయవచ్చును. కాని పదములు లేవని, எஞ் గ్రంథములు నిర్మించుట మూనవలదు. శాస్త్రములు మెుదటఁ బుట్టును. పారిభాషికపదములు పిదప స్థిరపడును. ఇది యే యితర దేశమందలి శాస్ర వాజ్మయాభివృద్ధి యొక్క మర్యాద. పాశ్చాత్యదేశమందు జంతుశాస్త్రము మిక్కిలి యభివృద్ధి నొంది, యందలి పారిభాషికపదములు పండితపరిషత్తు లచే నిర్ణయింపఁబడుచున్నవని మీరందఱు నెఱింగిన విషయమే. అట్టి శాస్త్రము యొక్క పారిభాషిక పదములు నప్పడప్పడు మాఱుచునే యున్నవి. ౧౭౬౬ లినాయిస్ అను శాస్త్రజ్ఞుఁడు జంతువుల వర్గీకరణ మేర్పఱచి యొక పరిభాష యేర్పరిచెను. 1829 లో క్యువియర్ అను వాఁడు దానిని గొంతవఱకు మార్చి క్రొత్తపరిభాష నిర్మించెను. 1835 లో జీవన్ అను శాస్త్రజ్ఞుఁడు మరల నీవర్గీకరణమును దిద్దెను. ౧౮౪౮ లో ఆర్. ల్యూకార్డు అనువాఁడును, ౧౮౫౫ లో హెన్‍రి ఎడ్వర్డ్స్ అను వాఁడును, ౧౮౫౯ లో అగాజిన్ అనువాఁడును, ౧౮౬౬ లో హెకల్ అను శాస్త్రజ్ఞుఁడును, 1910 లో ల్యాంకిష్టరు అనువాఁడును మఱికొందఱును జంతుశాస్త్రములందలి వర్గీకరణ పరిభాష నిష్టము వచ్చినట్లు మార్చిరి. తుదకు ఎన్ సైక్లోపీడియా బ్రిటానికా యొక్క 11 వ కూర్పునందు జంతు శాస్త్రమను ముఖ్యవ్యాసము వ్రాసిన లేఖకునకు నాశాస్త్ర సంబంధమైన యితర వ్యాసములు వ్రాసిన లేఖకులకును వర్గీకరణమును గుఱించియుఁ, పారిభాషికపదములను గుఱించియుఁ బెక్కభిప్రాయ భేదములు కలవు ! కావున నేఁడే యందఱకు సమ్మతములైన శాస్త్రీయపదములు గూడినఁ గాని గ్రంథములు వ్రాయమనుటగాని, వ్రాయవద్దనుటగాని వెఱ్ఱితనము. కావున శాస్త్రమునందును, భాషయందును నభిమానముగలవారు నిర్భయ ముగఁ దమచేతనైనంతవఱకు శాస్త్రీయగ్రంథముల నిర్మించి యితర గ్రంథ కర్తలకును, నూతనముగాఁ బుట్టుచున్న పుట్టనున్న భాషా విషయక పరి షత్తులకును మార్గదర్శకులగుదురుగాక ! యని నమ్ముచున్నాను.

పారిభాషికపదములను గుఱించి యింకొక చిన్న సంగతి చెప్పవలసి యున్నది. హిందూ దేశమునందుఁ బ్రస్తుతము శాస్త్రీయపదములను సృజించుటకునై మహాప్రయత్నములు చేయుచున్నవారు కాశీలోని నాగరీప్రచారిణిసభ వారు; రెండవ వారు ట్వంటియత్ సెంచురీ డిక్ష్నరీ సంపాదకులును. మొదటిదానిలో ప్రొఫెసరు రే, ప్రొఫెసరు బోస్, ప్రి. సీల్ వంటి ఆంగ్ల, సంస్కృత భాష లయందును, బాశ్చాత్య శాస్త్రములయందును, మహామహోపాధ్యాయు లనిపించుకొను వారు కలరు. ట్వంటియత్ సెంచురీ డిక్ష్నరీలో ప్రొ. గజ్జర్, డాక్టర్ సర్ బాలచంద్ర వంటివారును గలరు. కావున మనభాషలో నూతనముగా శాస్త్ర వాఙ్మమయమును బుట్టింప నెంచిన "వారు తప్పక యీ రెండుగ్రంథములఁ జూడనగును.

ఇంక నొకపూర్వపక మున్నది. కొందఱు నూతనపదములను మనము సృష్టింప నక్కఱలేనేలేదు ; ఇంగ్లీషుపదములనే గ్రహించుట మంచిదని వాదించెదరు. కాని దీనికి నేను వేఱుగ జవాబు చెప్పనక్కఱ లేదు. జర్మనీ వారే చెప్పఁగలరు. యూరోప్ ఖండమునం దిప్పడు నిర్మింప బడుచున్న శాస్త్రీయపదములు గ్రీకు, ల్యాటిన్ భాషాభూయిష్టమై మూరెడు మూరెడు పొడవుగ నుండునని శాస్త్రజ్ఞ లెఱుఁగుదురు. గ్రీకు ల్యాటిన్ భాషలు దేవభాషలుగాఁ గల జర్మనీ వారికి వీని నంగీకరించుటకు నభ్యంతర ముండఁగూడదుకదా ? కాని వారీ దీర్ఘపదములకుఁ దమభాషలో మాఱు పదములను గల్పించుకొని విద్యార్థుల నిమిత్తమై వ్రాయఁబడు పొత్తము లలో వానినే వాడుచున్నారు ! జర్మనీ దేశజ్ఞులే యిట్లుచేయఁ బూర్తిగ భిన్న భాషాసంప్రదాయము గల మన మా కర్కశపదంబులనే సంస్కారమైనఁ జేయక తీసికొనవలె ననుట వింతగను విపరీతంబుగను గన్పట్టుట లేదా ? కావున మనము వీలయినంతవఱకు దేశ్యపదములను, వాడుకలోనున్న సంస్కృతపదములను వాడవలయును. అట్టిపదములు లేనప్పడు సంస్కృత వాఙ్మయమునుండి సమానార్ధకముల నిచ్చుపదముల నుపయోగించుకొన వలెను అట్టిపదములును దొరకనప్ప డింగ్లీషు పదములఁ దీసికొనుట యప వాదము (Exception) గాను, స్వభాషాపదముల నుపయోగించుట సామాన్య నియమము (General Rule) గను నెంచవలయును అనఁగా విధిలేనప్పడు మాత్ర మన్యభాషాపదములఁ దీసికొనవలయును.

విద్వాంసులారా ! భాషాభిమానులారా ! మీరికనైన నౌదాసీన్యము మాని మహోత్సాహముతో శాస్త్రీయగ్రంథరచనకుఁ బూనుకొనియెదరని వేఁడుచున్నాను.

“ఆంధ్ర సాహిత్య పరిషత్పత్తిక-ప్రమాదీచ సంవత్సరము, సం 2 నుంచి పునర్ముద్రితమ.

ఆంధ్రత్వ మాంధ్రభాషా చ

నాల్పస్య తపసః ఫలమ్

- అప్పయ్య దీక్షితులు (s , 1554-1626)

  1. కీ. శే. కొమఱ్ఱాజు వేంకటలక్ష్మణరావుగారు (1877-1928)