దేవి రమే మామవాబ్ధితనయే

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


రాగం: వసంత. ఆది తాళం.

ప: దేవి రమే మామవాబ్ధి తనయే దేవ దేవ వాసుదేవ జాయే ||

అ: పావన కనకాద్రి వర నిలయే దేవాది వినుత మహిమాతిశయే ||

చ: రాకాధీశ సన్నిభ వదనే రాజీవలోచనే గజగమనే
లోకానంద విధాయినే లోకవిదిత కీర్తిశాలినే అకారాది వర్ణ
స్వరూపిణే తవ కరుణాపూర్ణ భక్తానాం అనుపమ సౌభాగ్య
దాయినే అమితానంద సందోహ దాయినే ||