Jump to content

దేవా సేవకులన్న (పద్యం)

వికీసోర్స్ నుండి

చిత్రం: కాళహస్తి మహత్మ్యం (1954)

రచన: తోలేటి

సంగీతం: ఆర్.సుదర్శనం, ఆర్.గోవర్ధనం

గానం: ఘంటసాల


దేవా సేవకులన్న నీచమతులై దీనాళి వేధించు దు

ర్భావుల్ యీ నరజాతి, యీ నరజాతి పూజకును ఆ... బ్రహ్మాది దేవేంద్ర సత్సే

వావ్రాతము వీడీ భిక్షకుడవై సేవింప యీ బంటుకే

ఈవే బంటుగ వచ్చినావు భళిరా... శ్రీకాళహస్తీశ్వరా

శ్రీకాళహస్తీశ్వరా... శ్రీకాళహస్తీశ్వరా...


ఈ పద్యము శార్దూలవిక్రీడితము అనబడు ఛందస్సు లో వ్రాయబడినది. ఛందో బద్ధముగా సవరించిన పద్యాన్ని ఈ క్రింద జత జేయటం జరిగింది.

శార్దూలవిక్రీడితము

దేవా సేవకులన్న నీచమతులై దీనాళి వేధించు దు
ర్భావుల్ యీ నరజాతి పూజకును ఆ... బ్రహ్మాది దేవేంద్ర సత్సే
వావ్రాతమ్మును వీడి భిక్షకుడవై సేవింప యీ బంటుకే
ఈవే బంటుగ వచ్చినావు భళిరా... శ్రీకాళహస్తీశ్వరా