దేవాలయాల మీద బూతు బొమ్మలెందుకు?/కోవెలంటే ఏమిటి!
కోవెలంటే ఉబలాటం కొంతమందికుంది. "ఉబలాటం అంటే ఉబలాటమే.... తెలిసి కాదు తెలియక కాదు" అని అన్నానా, తెంపరి వాదననో, తెలివితక్కువవాడననో తెగ తిడతారు. నాస్తికుడనని నలిపేస్తారు. పెట్టరాని పేర్లు పెట్టి పిచ్చివాడిని చేసేస్తారు.
తెలియదంటారా ?
[మార్చు]కోవెలంటే ఏమిటో మీకు తెలియదంటారా ? అలా అయితే ఈ ఆవెశం ఎందుకు ఈ సహస్రనామార్చనలెందుకు, ఈ సాష్తాంగాలెందుకు, ఈ చెంపలు వాయించుకోడాలెందుకు, ఈ మ్రొక్కుబడులెందుకు? తెలుసుకోకుండానే ఇవన్నీ చేస్తున్నారంటే, మీకే ఎలాగుంటుందో ఆలోచించుకోండి. అంతా మూర్ఖులూ, గొర్రెదాటుగాళ్లూ కావలసి వస్తుంది. అజ్ఞానానికి పట్టాభిషేకం చేయవలసి వస్తుంది. అది అట్టే సంతోషించవలసిన పని కాదు. అలా అయితే ఒప్పుకొనేవాడెవడు? అంచేత ఏదో కొంత తెలిసే ఉండాలి అంటాము.
తెలుసునంటారా?
[మార్చు]కోవెల అంటే ఏమిటో తెలుసునంటారా?... అనాలి. జంకుతూనో జడుస్తూనో తెలుసును అనాలి. తప్పదు. అనేటప్పటికి కారంభిస్తుంది. అంపవాన. పశ్న మీద పశ్న పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆ అడగడానికి మరి అంతు ఉన్నట్టే కనపడదు. చూడలేక కళ్ళు చీకదాట్లు పడతాయి; వినలేక చెవులు దిమ్మలు పడతాయి.
కోవెల అంటె అర్ధం ఏమిటి?
అది ఇలాగే కట్టడమెందుకు?
వాటి మీదనూ, లోపలనూ ఆ బూతు బొమ్మలెందుకుండాలి?
ఈ వెంట్రుకల మ్రొక్కుబడులేమిటి?
ఆ దెవత విగ్రహం అలా ఎందుకుంది?
ఈ దేవదాసీలెందుకు?
ఆ కామదహనాలేమిటి?
ఈ పూజారుల ఆచారాలేమిటి?
వీళ్ళకున్న పేర్లెందుకు వచ్చాయి?
ఆ సహస్ర నామాల అర్థాలు తెలుసునా?
ఇలాగ ముక్క ముక్కకీ ముసురుకొని వస్తాయి పశ్నలు.
చెప్పగలమా జవాబులు?
[మార్చు]ఆ ప్రశ్నలకన్నిటికీ కాకపోయినా, కొన్నిటికయినా చెప్పగలరా అంటే గుడ్లు మిటకరించవలసిందే. ఆ మాట ఒప్పుకోవడానికి కష్టంగా వుంటుంది గాని, నిజం అంతే అవుతుంది. గుడ్లు మిటకరిస్తాం. గొడ్డూ గోదాతోనూ, పిల్లా పిచ్చుకతోనూ కాలాన్ని వెళ్ళబుస్తూ వుంటాం మనం. అలాంటి మనం మిటకరిస్తే మించిపోయిందేమీ లేదు. మతం పెద్దలు, కోవెల పెద్దలు, ఆచార్యుల పెద్దలు, చదువు పెద్దలు, శిల్పి పెద్దలు ఉన్నరే వాళ్ళు మిటకరిస్తేనే తంటా. అది అలా వుండాలి. ఇది ఇలా వుండకూడదు అని అనడానికీ, అధికారం ఉన్నవాళ్ళు నీళ్ళు నముల్తేనే, తంటా. ఈ దోషం చెశావు కాబట్టి ఈ శాంతి చేస్తేనేగాని చంపేస్తాం మింగేస్తాం అని శాస్తాలు వల్లించే వాళ్ళు పెప్పెప్పె అంటేనే తంటా. వాళ్ళు ఏమయినా చెప్పుతారా చూడండి.
ఊరికే, అడిగినపాటున జవాబివ్వకండి. అది అన్యయం అవుతుంది. తెలివి అంత 'రెడీమేడు'గా తలకాయలోనే ఉంచుకుంటారా ఏమిటి? ఆ పండితులకీ, ఆ ఆచార్యులకీ కావలసినంత అవకాశం ఇవ్వండి. గ్రంథాలు తిరగవెయ్యమనండి. కావలిస్తే వాళ్ళకి కావలసిన పుస్తకాలు, వాళ్ళ దగ్గర లేకపోతే, సంపాదించి ఇవ్వండి. అన్ని సదుపాయాలూ చెయ్యండి. అంతా అయిన తరువాత 'అయ్యా ఏమంటారండీ'? అని అడగండి. ఏదో తేల్తుంది.
అల్లాటప్పా సమాధానాలు
[మార్చు]అంతేగాని, అడిగారుకదా అని 'అల్లాటప్పా' జవాబులు చెప్పితే మాత్రం లాభం లేదు. అలా చేయడానికి ప్రయత్నిస్తే ప్రశ్నల వర్షం ప్రకోపించిపోతుంది.
తనకు నమ్మకం వుండాలి. ఇతరులను నమ్మించాలి. అలాగయితేనే సమాధానం అవుతుంది. "ఆచార్య ఉవాచ" అని చెప్పితే అభాసు అవుతుంది. అన్నవాడికీ, ఆచార్యుడికీ, ఇద్దరికీ తంటా వస్తుంది. చదురెక్కి సమాధానం అడిగేటప్పుదు సాహసం పనికి రాదు. దాన్ని సాగనియ్యరు తెలిసిన వాళ్ళు. కుక్క జవాబూ పనికి రాదు. సరసులంగీకరించాలి. చాలినంత బలం వుండాలి.