దినకరా శుభకరా దేవా
స్వరూపం
వినాయక చవితి (1957) సినిమా కోసం సముద్రాల రాఘవాచార్య రచించిన పాట.
దినకరా శుభకరా దేవా
దీనాధార తిమిర సంహార దినకరా శుభకరా
పతిత పావనా మంగళదాతా
పాప సంతాప లోకహితా
బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూపా
వివిధ వేద విజ్ఞాన నిధాన
వినతలోక పరిపాలక భాస్కర ||| దినకరా శుభకరా |||