దశరధరామ గోవిందా
Appearance
శంకరాభరణం రాగం ఆది తాళం
ప: దశరధరామ గోవింద నన్ను - దయజూడు పాహి ముకుంద || దశరధ ||
అ.ప: దశముఖ సంహార ధరణిజపతి రామ
శశిధర పూజిత శంఖచక్రధర || దశరధ ||
చ 1: మీ పాదములే గతి మాకు - మమ్మేలుకో స్వామి పరాకు
మా పాల కలిగిన శ్రీపతి ఈప్రొద్దు - కాపాడి రక్షించు కనకాంబరధర || దశరధ ||
చ 2: నారాయణ వాసుదేవ నిను - నమ్మితి మహానుభావ
గరుడగమన హరి గజరాజ రక్షక - పరమపురుష భక్త పాప సంహరణ || దశరధ ||
చ 3: తారకనామమంత్రము రామదాసులకెల్ల స్వతంత్రము
ఇరవుగ కృపనేలు యిపుడు భద్రాద్రిని - స్థిరముగ నెలకొన్న సీతామనోహర || దశరధ ||
This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.