దరిశనమాయెను శ్రీరాములవారి
Appearance
మేచబౌళి రాగం త్రిపుట తాళం
ప: దరిశనమాయెను శ్రీరాములవారి
దరిశనమాయెను దరిశనమాయెను || దరిశనమాయెను ||
చ 1: దరిశనమాయెను ధన్యుడనైతిని
యురమునందు సిరి మెరయుచున్నవాని || దరిశనమాయెను ||
చ 2: విభుశంభునకు యోగి ప్రభులకు నైనను
అభిముఖుడై యాననము జూపని వాని || దరిశనమాయెను ||
చ 3: కండ క్రొవ్వున తను మరచువాని తల
చెండెదనని కోదండ మెత్తిన వాని || దరిశనమాయెను ||
చ 4: పరమ భక్తుల కిల సిరులొసగెదనని
కరమున దాన కంకణము గట్టిన వాని || దరిశనమాయెను ||
చ 5: స్థిరముగ భద్రాచల రామదాసుని
అరసి బ్రోచెదనని బిరుదు దాల్చిన వాని || దరిశనమాయెను ||
This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.