దత్త దత్త దత్త దత్త దత్తజై

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
పల్లవి:
దత్త దత్త దత్త దత్త దత్తజై
దత్త దత్త దత్త దత్త దత్తజై

చరణం:
వినతి రస్తు దత్తదేవ మూర్తయే
విహిత భక్తి వాంఛితార్థ పూర్తయే

వినతచిత్త మందిరాధి వాసినే
మధుర మంజు దివ్య మందహాసినే

నిహత జంభదైత్య జృంభణాయ తే
అమరవీర్య వర్ధనాయ ధీమతే

రచిత కార్తవీర్య బాహు మాలినే
పరశురామ మాతృభక్తి శాలినే

బహు విధావతార నిత్య వృద్ధయే 
రుచిరపాద వల్లభత్వ సిద్ధయే

అథ నృసింహ యోగి రూపధారిణే
మహిత గాణగాపురాధి కారిణే

అధికసిద్ధి సులభ దాన శీలినే
సచ్చిదానంద తత్త్వ యోగ పాలినే