Jump to content

దత్తాత్రేయ స్తోత్రము

వికీసోర్స్ నుండి

🌹🌻శ్రీ దత్త స్తవం🏵️🌷

🌹దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం | ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామి సనోవతు || ౧

భక్తుల యందు పుత్రప్రేమను కలిగి అపార ప్రేమతో వరములు ఇచ్చి, పరబ్రహ్మ స్వరూపం అయి,    తలచిన వెంటనే ప్రత్యక్షం మయ్యే శ్రీ దత్తాత్రేయ స్వామి నన్ను రక్షించు.🌻


🌺దీనబంధుం కృపాసింధుం సర్వకారణకారణం | సర్వ రక్షాకరం వందే స్మర్తృగామి సనోవతు || ౨ ||

దీనుల,ఆర్తుల యందు బంధువు,కరుణా సముద్రుడు ,అందరినీ రక్షించే దయ తత్వం కలిగి, తలచిన వెంటనే ప్రత్యక్షం మయ్యే శ్రీ దత్తాత్రేయ స్వామి నన్ను రక్షించు.🥀☘️

🌹శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణం | నారాయణం విభుం వందే స్మర్తృగామి సనోవతు || ౩ ||

శరణాగతి చెందిన దీనులకు కల్పవృక్షం,సర్వ వ్యప్తుడు అయిన నారాయణుడు,   ఆప్త పరాదీనుడు    అయి  తలచిన వెంటనే   ప్రత్యక్షం మయ్యే శ్రీ దత్తాత్రేయ స్వామి నన్ను రక్షించు .  💐

🌸🍀సర్వానర్థహరం దేవం సర్వమంగళ మంగళం | సర్వక్లేశహరం వందే స్మర్తృగామి సనోవతు || ౪ ||

అన్ని జ్ఞాన సంభంద అనర్దాలు  తొలగించి,శుభములు ప్రసాదించి ,కష్టాలు తొలగించి,ఐహిక కోసం ఉపాసన చేసినా,పారమార్ధిక ఫలం ప్రసాదించి తలచిన వెంటనే ప్రత్యక్షం మయ్యే శ్రీ దత్తాత్రేయ స్వామి నన్ను రక్షించు.🥀🏵️

🌸🌼బ్రహ్మణ్యం ధర్మతత్త్వజ్ఞం భక్తకీర్తివివర్ధనం | భక్తాభీష్టప్రదం వందే స్మర్తృగామి సనోవతు || ౫ ||

బహ్మజ్ఞానం వృద్ది చేసేవాడు ,ధర్మ తత్వం,జ్ఞాన తత్వం,ధర్మ జ్ఞానం,తపస్సు వృద్ది చేసి భక్తుల కోరిన వెంటనే ప్రత్యక్షం మయ్యే శ్రీ దత్తాత్రేయ స్వామి నన్ను రక్షించు.🍀🌻

🌹🌼శోషణం పాప పంకస్య దీపనం జ్ఞానతేజసః | తాపప్రశమనం వందే స్మర్తృగామి సనోవతు || ౬ ||

పాపములను శమింప చేసి జ్ఞాన తపస్సు అనే జ్యోతిని వెలిగించి ఆద్యాత్మిక,ఆది భౌతిక ,దైవిక తాపాలు జ్ఞాన దీప్తితో తొలగించి,తలచిన వెంటనే ప్రత్యక్షం మయ్యే శ్రీ దత్తాత్రేయ స్వామి నన్ను రక్షించు.🌸🌷

🌹🌻సర్వరోగప్రశమనం సర్వపీడానివారణం | విపదుద్ధరణం వందే స్మర్తృగామి సనోవతు || ౭ |

సుఖ ప్రాప్తి,దుఖ పరిహారం అనే సర్వ రోగములను నివారించి ,సర్వ ఆద్యాత్మిక,లోకిక పీడలు నివారించి,జన్మ,సంసార బంధములను తొలగించి,తలచిన వెంటనే ప్రత్యక్షం మయ్యే శ్రీ దత్తాత్రేయ స్వామి నన్ను రక్షించు.💐🌼

🌷🌼జన్మసంసారబంధఘ్నం స్వరూపానందదాయకం | నిశ్శ్రేయస పదం వందే స్మర్తృగామి సనోవతు || ౮ ||

సంసార బంధం నుంచి రక్షించి,జన్మ పరంపరలను హరించి,మనవ జీవిత అంతిమలక్ష్యoను అనుగ్రహించి ,తలచిన వెంటనే ప్రత్యక్షం మయ్యే శ్రీ దత్తాత్రేయ స్వామి నన్ను రక్షించు.🌼🌻

🥀🍀జయ లాభ యశః కామ దాతుర్దత్తస్య యస్తవం | భోగమోక్షప్రదస్యేమం ప్రపఠేత్ సుకృతీ భవేత్ ||౯ ||

           శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి విరచిత  దత్తాత్రేయ స్తవం పారాయణం చేసినవారికి ,                              జయం,లాభము,సంపద,కోరికలు,భోగములు,మోక్షము,దత్తాత్రేయకృపతో శ్రిఘం గా లభిస్తాయి.🌺☘️

🌹🌻శ్రీ దత్తాత్రేయ స్వామి కి అంకితం,తెలుగులోకి అనువాదన రాజ్యలక్ష్మి శ్రీనివాస్ బొడ్డుపల్లి.💐🥀

  • దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం
  • ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామీ సనో వతు|| 1
  • దీనబంధుం కృపాసింధుం సర్వకారణ కారణం
  • సర్వరక్షాకరం వందే స్మర్తృగామీ సనో వతు|| 2
  • శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణం
  • నారాయణం విభుం వందే స్మర్తృగామీ సనో వతు|| 3
  • సర్వానర్ధహరం దేవం సర్వమంగళ మంగళం
  • సర్వక్లేశహరం వందే స్మర్తృగామీ సనో వతు|| 4
  • బ్రహ్మణ్యం ధర్మతత్త్వజ్ఞం భక్తకీర్తివివర్ధనం
  • భక్తాభీష్టప్రదం వందే స్మర్తృగామీ సనో వతు|| 5
  • శోషణం పాపపంకస్య దీపనం జ్ఞానచేతసః
  • తాపప్రశమనం వందే స్మర్తృగామీ సనో వతు|| 6
  • సర్వరోగ ప్రశమనం సర్వపీడా నివారణం
  • ఆపదుద్ధరణం వందే స్మర్తృగామీ సనో వతు|| 7
  • జన్మ సంసార బంధఘ్నం స్వరూపానందదాయకం
  • నిశ్శ్రేయసవదం వందే స్మర్తృగామీ సనో వతు|| 8
  • జయ లాభ యసః కామ ధాతుర్దత్తస్య యః స్తవం
  • భోగ మోక్ష ప్రదస్యేమం ప్రపఠేత్ సుకృతీ భవేత్|| 9