తెలుగువారి జానపద కళారూపాలు/సూళ్ళూరుపేట సుళ్లు ఉత్సవం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

సూళ్ళూరుపేట సుళ్లు ఉత్సవం

TeluguVariJanapadaKalarupalu.djvu

ఈ ఉత్సవం అన్ని ప్రాంతాల్లోనూ లేకపోయినా, కొన్ని ప్రాంతాల్లో జరుగుతూ వుంటుంది. మరికొన్ని చోట్ల సిడిబండి ఉత్సవాలు, గాలపు సిడి ఉత్సవాలు జరుగూ వుంటాయి. నా చిన్నతనంలో సిడిబండి ఉత్సవాన్ని కృష్ణా జిల్లా ఉయ్యూరు వీరమ్మ తిరుణాళ్ళలో చూశాను.

సుళ్ళు ఉత్సవం ఈ నాటికీ నెల్లూరు జిల్లా సూళ్ళూరు పేటలో చెంగాళమ్మ తిరునాళ్ళలో జరుగుతూ వుంది. అనాదిగా ఈ ఉత్సవం జరగటంవల్లనే అ ఊరికి సూళ్ళూరుపేట అనే పేరు సార్థకమైన దంటారు.

సూళ్ళూరు పేటలో చెంగాళమ్మ దేవస్థానంలో ప్రతి ఏట బ్రహ్మోత్సవాలు జరుగుతూ వుంటాయి.

ఈ ఉత్సవంలో సుళ్ళు ఉత్సవానికి ఎంతో ప్రాముఖ్యాన్నిస్తారు. రాష్ట్రం మొత్తం మీద ఇక్కడ జరిగినంత బ్రహ్మాండంగా ఈ ఉత్సవం మరెక్కడా జరగదంటారు. సాయత్రం పూట ఆలయ ప్రాంగణంలో దాదాపు మువ్పై అడుగుల ఎత్తులో ఒక స్థంభం నాటి పైభాగాన ఓ రాట్నం అమరుస్తారు. ఆ రాట్నానికి నలభై అడుగుల పొడవున్న మరొక కొయ్యను అమర్చి దానికి ఒక వైపు పాలవెల్లి చట్రం కడతారు. ఆ చట్రానికి జీవంతో వున్న మేకనూ, మనిషి బొమ్మనూ, రోలు, ఒడిబాల ఏర్పాటు చేసి పూల మాలలతో వాటిని అలంకరించి ఒక్కోసారి తొమ్మిది చుట్లు తిప్పుతారు.

ఇలా సిడిమాను తిరిగే సమయంలో దానికి కాట్టి వున్న మేక భయంకరంగా ఆరుస్తుంది. క్రింద యువకులు మేళతాళాలతో ఆవేశంతో నృత్యం చేస్తూ వుంటారు. తప్పెట్ల మోతలతో దద్దరిల్ల చేస్తారు. ఈ దృశ్యాన్ని ఉత్సవాన్ని ఉత్సవానికి వచ్చిన ప్రజలు విరగబడి చూస్తారు. ఇంత ప్రాముఖ్యంగా సుళ్ళు ఉత్సవం జరగడం వల్ల దీనికి కొంత కాలం సూళ్ళూరు అని పిలిచే వారు. అది క్రమాను గతంగా సూళ్ళూరుపేటగా మారి పోయింది.

చెంగాళమ్మ తిరునాళ్ళలో అన్నిటి కన్నా ఆసక్తి కరమైన కళారూపం ఈ సుళ్ళు తిరగటమే. ఈ వుత్సవంలో మహిషాసుర మర్థన తెప్పోత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలకు ఒక్క నెల్లూరు జిల్లా నుంచే కాక, చిత్తూరు, తమిళ నాతు ప్రాంతాల నుంచి కూడా ప్రజలు తండోపతండాలుగా వస్తారు. చెంగాళమ్మ దేవాలయం, మద్రాసు __ కలకత్తా ట్రంకు రోడ్ ప్రక్కనే వుంది. వచ్చి పోయే వాహనాల వారు అక్కడ ఆగి పూజలు జరిపి వెళుతూ వుంటారు. చెంగాళమ్మ మహత్తు కలిగిన దేవతగా కొలుస్తారు.

TeluguVariJanapadaKalarupalu.djvu

బ్రహ్మోత్సవ కార్య క్రమాలు జరిగినన్ని రోజులూ, సంగీత, నృత్య, నాటక, సాంస్కృతి కోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. విద్యుద్దీపాలతో ఆ

TeluguVariJanapadaKalarupalu.djvu

ప్రాంతాన్నంతా రంగు రంగుల బల్బులతో అలంకరిస్తారు. ఈ ఉత్సవంలో ఎక్కడా కనిపించని సుళ్ళు తిరిగే సిడి బండి ప్రత్యేక ఆకర్షణ.