తెలుగువారి జానపద కళారూపాలు/తెర చీరలవారు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

తెర చీరలవారు

ఆంధ్రదేశంలో తెర చీరలవారని ఒక జాతివారున్నారు. వారి గోత్రాలనూ, వారి పూర్వవృత్తాంతాలను, గాధలనూ చెపుతూ వుంటారు. వీరు సుద్దులను కూడ చెపుతారు.

పై విధానపు తెర బొమ్మల గురించి క్రీడాభిరామంలో ఒక పడతి పల్నాటి వీరచరిత్రను గూర్చి పాడుతూ వున్నదనీ, అక్కడ వారి చరిత్ర ఒక చిత్రఫలకం మీద వ్రాయబడెననీ, దానిని గూర్చి ఈ క్రింది విధంగా వర్ణింపబడింది.

TeluguVariJanapadaKalarupalu.djvu

కోల దానపు ద్రిక్కటి కూడి యున్న
గచ్చు వేసిన చిత్రంపు గద్దె పలక
వ్రాసినారదె చూడరా వైశ్యరాజ
శీల బ్రహ్మాది వీర నాసీర చరిత.

(క్రీడాభిరామం 125)

పై ఉదాహరణనుబట్టి పల్నాటి వీరచరిత్రను కాశీ కావడి ద్వారా, చీరల మీద చిత్రించిన బొమ్మల ద్వారా వీరి కథను చెప్పినట్లు వూహించవచ్చును.