తెలుగువారి జానపద కళారూపాలు/కడ్డీ వాయిద్యం
Appearance
కడ్డీ వాయిద్యం
మిత్తుల అయ్యవార్లనీ, దాసరులనీ పిలువబడే వీరు, ఈ కడ్డీ వాయిద్యంలో ప్రవీణులు. ఈ వాయిద్యం వీణ మాదిరిగా ఉంటుందట. వీణ మాదిరే దీనిని కూడ చేతి వ్రేళ్ళతోనే వాయిస్తారు. వీరు ముఖ్యంగా ఈ వాయిద్యం మీద భగవన్నామ సంకీర్తనలు వాయిస్తూ వుంటారు.
ఈ వాయిద్యాన్ని ముందు నిల బెట్టుకుని రెండు సన్నని పుల్లలతో జలతరంగ్ వాయిద్యాన్ని వాయించి నట్లు వాయిస్తారు. ఈ స్వర మాధుర్యం ఎంతో మధురంగా వుంటుంది. వీరి వృత్తికి ప్రాణప్రదానమైంది ఈ వాయిద్యమే. అయితే ఈ వాయిద్యాన్ని అందరూ వాయించ లేరు. దీనికి ప్రత్యేకమైన శిక్షణతోనూ, సాధనతోనూ సాధించవలసిందే. అందువల్లనే ఈ వాద్యకాండ్రలో ప్రవీణులు చాల తక్కువ. తెలంగాణాలో ఈ వాయిద్యంలో ప్రసిద్ధులైన వారు కరీంనగర్ జిల్లా మెట్టుపల్లి తాలూకాలో వున్నారు. ఈ కళారూపాన్ని శిధిలం కాక ముందే రక్షించుకోవడం అవసరం.