తెలుగుతల్లి/సంపుటము 1/నవంబరు 1937/రంగులరాటము
స్వరూపం
< తెలుగుతల్లి | సంపుటము 1
రాముడు: ఒకమీటనొక్కిన ఇంటిపాఠములన్ని పూర్తిచేయుదానిని.
జడ్జి: నీవు వారిపై ఇటికఱాతిని విసరినట్లు సాక్ష్యము రుజువు చేయుచున్నది.
ప్రతివాది: అంతేకాదు దేవరా, ఆఱాయి వానికి తగిలినట్లుకూడ రుజువుచేయుచున్నది.
- * * * * * * *
పట్టణమున క్రొత్తగా అంగడిపెట్టిన సెట్టిగారికి మునిసిపల్ ఆఫీసు నుండి ఒక ఫారము పూర్తిచేసి పంపవలెనని వచ్చినది. చాల యోచనచేసి దానిని పూర్తిచేసినాడు.
పేరు: సుబ్బిసెట్టి.
పుట్టుక: బ్రదికియే.
వ్యాపారము: ఏమిబాగా జరుగుటలేదు
- * * * * *
"నాయనా, నేను పెండ్లిచేసికోవలెను"
"ఐదేండ్లకే పెండ్లా? ఎవరిని నాయనా?"
"అవ్వను"
"వెధవా, మాఅమ్మనారా పెండ్లాడుతావు?
"నీవుమాత్రము మాఅమ్మను పెండ్లిచేసికోలేదా?
- * * * * *
ఉపాధ్యాయుడు: నీవు చాల మేధావంతుడైతే ఏయంత్రమును కనిపట్టవచ్చును?
ఉదా: నీవు సొమరిపోతువని తెలియును. నీవురా, గోవిందా? గోవిం: ఆమీటను నొక్కువస్తువును కనిపెట్టెదము.
- * * * * * * * * *
భార్య: నన్ను పెండ్లాడుకు ముందు చాల ధనవంతుడవని అబద్ధములు చెప్పి మమ్ము మోసగించితివి.
భర్త: ప్రమాణపూర్తిగా అది ముమ్మాటికి సత్యము
- * * * * * *
"ఈ గుహలోపల దొంగ లున్నారు. నీవు దిగిచూచిరా." అని పోలీసు నొక్కని పొమ్మన్నాడు ఇన్ స్పెక్టరు. ఆపోలీసునకు భయమువేసినది. లోపలికి అడుగుపెట్టుచు వాడు "ఇదిగో, లోపలినుండి ఎవరైన పరుగెత్త నారంభించినచో వారిలొ మొదటివానిని మాత్రము మీరు కాల్చకూడదుసుమా" అని మందలించెను.
- * * * * * *
"డాక్టరుగారూ, కాగితాలాడుకొనుచున్నారేమి?"
"ఏమిచేయవచ్చును ప్రొద్ధుపోగొట్టు టేట్లు ?
"రోగులప్రాణా లేవియు చిక్కలేదా ?"
- * * * * *