తెలుగుతల్లి/సంపుటము 1/నవంబరు 1937/మంథానము
ఇంద్రుడు గౌతమపత్నిం జెఱుప గోడియై కూసి, యామె పాతివ్రత్యము నట్టేటగలిపి, తత్ఫలితముగ ఒడలెల్ల యోనులు సంపాదించుకొనియెను. వృషణములు పోగొట్టుకొని అశ్వినీదేవతలచే మేషాండముల నతికించుకొనియెనని యొక చోటగలదు. ఒడలెల్ల యోనులగుటగాని, వృషణ హీనుడగుటగాని, శాపవశమున గాదనియు సుఖరోగముచే ననియు మావాదము. అది స్వభావసిద్ధమును ఇతడు సర్వదా సర్వధా వ్యభిచారి, వ్యభిచారిణీసమాజమునకు నాయకుడు. రంభాదులే యితనికి కార్య సాధములు. వ్యభిచారమే ముఖ్యవృత్తియై యవి వేదోక్తములనిపించి ప్రభువుల నోళ్లుగట్టి యాగాదులమూలమున విచ్చలవిడిగా మిండఱికము చేయుచుండు వారికిట్టి వాడు గాక మఱియొకడు దేవరాజ్య పట్టాభిషిక్తుడైనచో తమయాటలు సాగునా? పూర్వదేవతలయొద్ద తమ యసహ్యకార్యములు సాగక పోవుటచేతనే వారిని పదభ్రష్టుల గావించుటయు, ఆస్థానమున అపరదేవతల నిలుపుటయు మునులకు తప్పని సరియైనది.
ఒకరాజ్యమున కధికారియగు వాని కెన్ని సుగుణములుండ వలయునో అందొక్కటియైన నింద్రునకున్నదా?
మిండఱికములో నింద్రుడందెవేపినచేయి. మాయలలోనదమా? అతని మించినవారులేరు. తమమాయలన్నియు వేరోక్తములనియు రాక్షసుల కార్యములన్నియు వేదబాహ్యములనియు కపటయుక్తములనియు లూలా మాలపుమాటలచే లోకము నోరుమూయుటకు తమకు ఫీజులేని వకీళ్లు మునులుండగా నీ చిన్న దేవతల కేమికొదువ? ఏదితప్పు? ఏదిఅయుక్తము? యెయ్యదకార్యము? అన్నియు వేదోక్తములే శాస్త్ర సమ్మతములే.
అసూయలో సైత మగ్రతాంబూలముగొన నర్హుడింద్రుడే. యజ్ఞ విధ్వంసకులని రాక్షసుల నగడుపఱచిన ఋషులు పృధుని సగరుని యజ్ఞములను మఱియు నెందఱివో యజ్ఞాములను పాడుచేసిన క్రతుభుక్ర్పభునేల అగడెత్తింపలేదు? స్వార్థపరత్వమున మఘవుని చెప్పి మఱియొకరిని చెప్పవలయును. తననెత్తికి పిడుగులై వత్తురని రాజుల యజ్ఞములను వినాశ మొందించుటయు రాక్షసులతపస్సుల పాడొనరించుటయు శతక్రతుని నిత్యకృత్యములు. మొదటియజ్ఞ విధ్వంసకుడు శివుడు. అతడు రాక్షసపక్షపాతి. అట్లయ్యును ఎల్లకాపరిగానుండు వాడు గావున నతని నగడెత్తించిన తమకే పెక్కుచిక్కులు కలుగుననియే యతని కార్యములను ధర్మయుక్తములని సమర్థించుచు వచ్చిరి.
ఇంద్రుడు మహాశూరుడు కావున దేవరాజ్యార్హుడందమా? ఏరాక్షస ప్రభునొద్ద నతడోడకుండినది? దినగండము నూఱేండ్లాయు నన్నట్లింద్రుని వైభవము సర్వకాలములయందు సుస్థిరము కాకయుండెడిది. ఒక్కొక్క రాక్షసుడు దండెత్తివచ్చి దేవతల్ నడవులకు బాఱదోలి స్వరాజ్యమైన స్వారాజ్యమును గైకొన్నపుడు మునులు నింద్రునిడుచేరి "మాయాగారికార్యము లెల్ల విధ్వంసమయ్యెను. దేవరాజ్యం పూర్వ దేవతల యధీనమయ్యెను. లోకము పాడుపడియెను." అనిబ్రహ్మతోమొఱలిడుటయు అతడు వారిని విష్ణువుపాలికి గొనిపోయి మొఱ్ఱవెట్టి మొత్తుకొనుటయు అతడొక తంత్రము పన్ని ఆసత్కాలము నందు సైతము శూరధర్మము నీడన యమాయాకులగు పుణ్యజనుల నంతమొందించి దేవతల యధాస్థానమున నిలుపుటయు సూటికిమాటికి జరుగు చుండునని మున్నే చెప్పి యున్నారము వీరివలె వాఱును అధర్మమార్గమున సంచరించు వారై యుండినచో దేవతలేనాడో పేరులేక నశించియుండువారే. వంచకుల మాయలు అమాయకుల యెద్దనే గదా సర్వతో ముఖముగ జెల్లుబడి యగుచుండును.
ఇట్టి పరమ శూరుడు, పాతివ్రత్య విధ్వంసకుడు తపోనిష్నుకారి అక్రమ ప్రవర్త కుడే దేవతారాజ్యమునకు సర్వవిధముల నర్హుడు కావలయు. పరీక్షించి యున్నత పదవులీయ నిట్టికార్యము లొనర్చె ననుకొందమన్నను పురాణము లట్లు చెప్పుటలేదు. అహల్యకు కేవలం కామియై మొసగించి చెఱిచెను. రాక్షస్ల తపస్సులే కాక విశ్వామితాది మహర్షుల తపస్సులనుకూడ తన కొంప కేదో ముప్పువచ్చునను భయముచే స్వార్ధపరుడై చెఱప బూనెను.
ఎన్ని తప్పులుచేసినను ఎంతనీచ ప్రవర్తకుడైనను ఇంతకంటె తమ కను కూలుడు, ఆత్మోన్నతి వీడినవాడ్, చసలుడు, కీలుబొమ్మ దొరకడనియే ఋషు లితనినే దేవరాజ్యపదమున పడరానిపాటులుపడి నిలువబెట్టుకొనుచుండిరి. ఓకప్పుడేదోతిరస్కారభావమునబ్రవర్రించెననిమునులింద్రుని పదభ్రష్ణునిగావించి యాచోట నహుషుని నిలిపిరి. వారి యష్యవర్తనములు కొన్నాళ్లలోనే నహుషు నకు వెగటుపుట్టించెను. అంతనతడు వారి చర్యల నిర్బీకుడై ఖండింప బూనగా నతనిపై లేనిపోని యపనిందలు మోపి మునులతని పదభ్రష్టుని గావించిరి.
నహుషుడు శచిని గొరినది నిజమా? ఇంద్రుడు పదచ్యుతుడై యడవులబడి తిరుగుచున్నప్పుడు వానిభార్య వానితో దిరుగక యింట సుఖించుచుండునా? ఉండినచో నామె పతివ్రతలలొ మేలుబంతి యనిపించు కొనునా? ఇంద్రునివెంట నడవులలో సంచరించుచున్న శచిని నహుషుడు గోరుట యసంభవము. ఇంద్రపదము నధిష్టించినవాని మనస్సంత నీచకృత్యము నకు జొచ్చునా? లేక ఆపదవి నందిన వారికెల్ల నట్టిబుద్ధియే కలుగునా?
మునులచే పల్లకి మోయించెనని యొకచోటను అగస్త్యుని గాంచి పరిహాసము కై త్రాటిని జూపి పామని బెదరించెనని యొకచోటను గలదు. విచారింప నీరెంట నెదియు నిజముకాదు. నూఱు యాగలు చేసి ఋషులకు సర్వస్వముదానము చేసి వారినిసంపూర్ణసంతుష్టులగావించిన నహుషుడు, ఇంద్రపదవిని వచ్చినంత నే మఱునాడే కన్నుగానక ముందువెనుకలు మఱచి తలకు చెప్పులడిగెడు అల్పుని చందమున మునులచే పల్లకి మోయింప గోరునా? మతియున్న మానఫునకిది విశ్వాసార్హమగునా?
అగస్త్యుడు మహామహీమా సంఫన్నుడని యెఱుగకుండునంత బాలకుడా నహషుడు? ఋషులే దేవతలకుసైత మధికారలని నమ్మి వారిమూలముననే క్రతుశతము కావించిన ప్రభువు మునుల మహిమల నెఱుగనివాడనుటకంటె ప్రపంచ విరుద్దము వేఱొండునుండునా? అందును లోకవిఖ్యాత మహైమా సంపన్నుడు అగస్త్యునే గేలిచేసెననుట యని చారమూలకముకాదా? తాము గీచినగీతయే వేదము. తమ వాక్యములను కాదనువాడే పతితుడు, పాపి, పాషండుడు అనిశాపించిన దురహంకరబూయిష్ఠులగువారి వాక్యము లిట్లుగాక మఱెట్లుందును? తప్పొప్పుల విమర్శించుట కెవ్ఫరికి నధికారములేదని చండ శాసనము కావించియున్నప్పుడు వారేది యెట్లు వ్ర్రాసికొన్ననేమి? నాడుకాకున్న నాలుగుతరమ్లు దాటినపిమ్మటనైన వెఱ్ఱిలోకము నమ్మకుండునా?
నహుషుడు తను కనుకూలుడై యుండని కతమున లోకుల కనులు గప్ప గొన్ని యపనిందలు కల్పించి పామదై పడియుండుమనిశపించి నిరురించు నపుడు పామును గొట్టినట్లేకొట్టి చంపివైచిరి. వాడేట్టివాడైనను ఇంద్రునివంటి కీలుంబొమ్మ మఱియుకడు దొరకడని యతినినే యధాస్థానమున నిల్పిరి.