Jump to content

తెలుగుతల్లి/సంపుటము 1/నవంబరు 1937/తెనుఁగుతల్లి పోటీపరీక్ష నెం 1

వికీసోర్స్ నుండి

తెనుఁగుతల్లి పోటీపరీక్ష నెం.1.


మంచియదృష్టము! 20 రూ బహుమతి. ప్రయత్నింపుడు!!


ప్రవేశపు రుసుము ఒక్కొక్కటికి నాలుగు అణాలు.

ఉత్తరములు చేరవలసిన కడపటిదినము 10-12-1937.

ఫలితములు 1938 జనవరి తెనుఁగుతల్లిలో ప్రకటింబబడును.


ప ద్ధ తి

ఈ పదునాఱు చదరపు గడులలో 1 నుండి 80 వఱకుఁగల అంకెలు, వేసినయంకె మరల వేయక, పూరించుచురావలయును. క్రిందికి పైకిని, ప్రక్కలకును, మూలలకును, కూడిన 62 రావలయును.

ఉత్తరములన్నియు తెనుఁగుతల్లి పోటీ పరీక్ష నెం.1 శీర్షిక యుండు ఈ పత్రములొనే యుండవలెను. పైనియమములకు లోబడి, 62 సంఖ్య వచ్చు ఉత్తరములు(entreis) ఒకసారిగా నాలుగుగాని, అంతకంటె ఎక్కువగాని పంపువారికి తెనుఁగుతల్లి పత్రిక ఒక సంవత్సరము ఉచితముగా పంపబడును.

సీలుచేయఁబడిన ఉత్తరములోనున్న ప్రకారము పెక్కండ్రు పంపినచో బహుమతి సమముగ పంచిపెట్టబడును. ప్రవేశపు రుసుము తపాల ఆర్డరుగాగాని మణియార్డరుగాగాని పంపవచ్చును.

ఉత్తరప్రత్యుత్తరములు జరుపఁగోరువారు తపాలు బిళ్లలు పంపవలయును. మేనేజరు చేయు పరిష్కారమే కడపటిది.

మేనేజరు,

తెనుఁగుతల్లి ఆఫీసు,

(పోటీపరీక్ష శాఖ,) చిత్తూరు.