తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ
తెలిసినడుచుకొమ్ము తెలుగు బిడ్డ
[మార్చు]1.పాలనాధికార పగ్గాలతో, పేద
బ్రతుకు తెరవొసంగు బాటలన్ని
ఒరులకిచ్చి వారికూడిగం సేతువా?
తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ
2.
ప్రాచ్యభాష యెదిగి ప్రాంతీయ భాషకు
ఊపిరంద నీక యుసురు తీసె
మ్రింగి వేసెగా తిమింగ్ల రూపు దాల్చి
తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ
3.
ప్రాణ వాయు వాంగ్ల భాషకే అందిస్తె
మాతృభాష కింక మనుగడేది ?
గొప్పదైన పాము కప్పను మ్రింగదా ?
తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ
4.
కొంప పెత్తనమ్ము ఉంపుడు గత్తెకా ?
ఎంత ధారుణమ్ము ? ఎంత తెగవు ?
తల్లి సవతి యైన పిల్లల భవితేమి ?
తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ
5.
పసి వయస్సులోనే పరభాష చొప్పించి
లేత మెదడు మీద వాత లిడకు
పులుల స్వారీ పగటి కలలు గావింపదా ?
తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ
6.
అమ్మవడిని మానిపి అతిచిన్న బిడ్డల
సవతి కప్పగించి సాకమనిన
సవతి ప్రేమ మనను చెప్పు నాకింపదా?
తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ
7.
మమత పుంజుకొని మమ్మీలు, డాడీలు
కుమ్ముచుండే తల్లి రొమ్ము మీద
ముద్దు సేయ దివిటీ మూతి కాల్చిన రీతి
తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ
8.
తమిళ మలయాళ తల్లులకీనాడు
బిడ్డలిచ్చుచున్న పెంపు చూడు
తల్లిభాష నీకు తగనిదై పోయెనా?
తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ
9.
పర భాషలో నెంత పాండిత్యమున్ననూ
భావ వ్యక్తీకరణ భ్రష్టు గుండు
అలవిగాని బండ తలకెత్తుకున్నట్లు
తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ
10.
అట్టహాసమైన ఆంగ్ల వక్తల మధ్య
తెల్లబోయి మిగులు తెలుగు వక్త
సానిడాబుగాంచి జంకెడి భార్యలా
తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ
11.
యెల్ల వనరులున్న తల్లి భాషీనాడు
బ్రతుకు యవని బ్రహ్మ రక్కసల్లె
కానుపించు చుండ కనికరించేదెవరు?
తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ
12.
దేశభాషలందు తెలుగు లెస్సన్నట్టి
కృష్ణదేవరాయ కీర్తి శిఖలు
అన్ని దిశల చాటి వన్నె కెక్కిన భాష
తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ
13.
చరితతో పాటు తగిన సాహిత్య ప్రాచీన
ప్రతిభ కలిగినట్టి ప్రముఖ భాష!
కన్న తెలుగు తల్లి ఉన్నతిని కాపాడు
తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ
14.
ఇంపు చేయవచ్చు కంప్యూటరందుండు
అచ్చరాల బెడద ఖచ్చితముగా
అలవికానిదంటు అన్వేషణకు లేదు
తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ
15.
ఉన్నలోపములను తిన్నగా సవరించి
తల్లిభాష నున్నతముగా తీర్చిదిద్ది
అప్పగింపవోయి అధికార పీఠాన్ని
తెలివి తెచ్చుకోని తెలుగు బిడ్డ
16.
దేశ భాషలందు తేజరిల్లిన తెలుగు
వాసి తగ్గి ఆంగ్ల దాసి యయ్యె
కుక్క వాత పడ్డ బక్క సింహం భంగి
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
17.
ఆంగ్ల సంస్కృతాల నాలింగనం గొనీ
సరకుగొనని తెలుగు సన్నగిల్లె
కూరుచున్న కొమ్మ కూలిపోబోతోంది
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
18.
అచ్చ తెలుగు వదలి ఆసంస్కృతంబునే
మంత్రములకు వాడు తంత్రమేమి ?
శ్రేష్టమైన వృత్తి చేజారుతుందనా ?
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
19.
తెలుగు దేశ బిడ్డ తెలుగు పండిత పోష్టు
ఆంగ్ల భాషలోన ఆర్డరేసి
అచ్చ తెనుగు వాని బిచ్చమెత్తింతురా
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
20.
అన్యదేశమందు ఆంధ్రులిర్వురు కలువ
మాతృ భాష దాచి మసులు కొండ్రు
మనిషి దాచు కొనెడి మర్మాంగ జబ్బల్లే
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
21.
ఆంధ్రభాష మనకు అధికారి యైయింత
అన్నమిచ్చుననెడి ఆశయుండె
ఆంగ్లమిచట జేరి అడియాశ జేసెరా
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
22.
అర్ధమవని భాష కథికార మందిస్తె
బడుగు మూకనెల్ల పారద్రోలి
కనక పీఠమందు శునకమై వర్ధిల్లు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
23.
రూకలిచ్చు భాష కాకతో నేర్చేరు
యేమి యివని దాని నేర్వరెవరు
పాలు యివని పశువు కబేళాల కర్పితం
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
24.
మిసిమి కల్గు కవుల పసిడి పల్కుల తల్లి
సిరుల రాజసమ్ము తరిగిపోయె
తిరుమలేశు నగలు అరువు కేగిన రీతి
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
25.
పేద తెలుగు వారు పిరియాదు లందిస్తె
ఆంగ్లమందు తీర్పు లదరగొట్టు
కోతి కాపరైన కొబ్బరి కాయల్లె
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
26.
స్వంత భాష నున్న సౌలభ్య మేనాడు
అన్యభాషలందు అందబోదు
తల్లిప్రేమ, మారు తల్లిలో దొరకునా ?
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
27.
ఆంగ్ల భాష సుంత అలవడినంతనే
తెలుగు నీసడించు పులుగు లార
యేరు దాటి తెప్ప నేల తగలేతురు ?
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
28.
వెర్రి తెలుగు కవికి యెర్ర పైసా కూడ
రాల్చు దిక్కు లేదు రాష్ట్ర మందు
తనదు రాతె తనకు తల కొర్వి యగుచుండె
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
29.
ఇంచుమించుగా ప్రపంచ వ్యాప్తంబుగా
పదునెనిమిది కోట్ల ప్రబలమైన
సంతు యుండు తల్లి కింత అన్యాయమా ?
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
30.
అష్ట దిగ్గజాల హావభావాలతో
కృష్ణ దేవరాయ కొలువులోని
తెలుగు వైభవమ్ము తిరిగి మళ్ళొచ్చునా
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
31.
పొరుగు భాషతనకు భుక్తి కల్పించినా
తనదు మాతృభాష దైన్య స్థితికి
కఠిన ఆకురాయి కరిగి ఆక్రోశించె
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
32.
తెలుగు ఉద్యమాన్ని తెగువతో చేపట్టి
లౌక్యమౌ పధాన రహంతుల్లా
గారు,బండి ముందు కరదీపికై నిలిచే (బండి ముందు నడుచు బంటు తానై నిలిచే)
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
33.
అంటు వ్యాధి వోలె వ్యాపించి దేశాన
ఆంగ్ల మోజు ప్రజల కంట గట్ట
కాని వెంట్లు వెలసె కడగండ్ల ప్లాంట్లుగా
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
34.
తెలుగు నేల మీద తెలుగు బిడ్డే తెలుగు
ఉచ్ఛరింప, పట్టి శిక్షవేయు
బంటు పెత్తనమ్ము ఇంటి కెగ బ్రాకింది
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
35.
మిసిమి కోలు పోయి పసిడి బాల్యంలోనె
బండబారు తోంది భరత జాతి
కానివెంట్లు జైళ్ళు, ఖైదీలె పిల్లలై
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
36.
అమ్మ యనెడి తెలుగు కమ్మని పిలుపును
మమ్మి వచ్చి చేరి మట్టు పెట్టె
మేక వన్నె పులిని సాకిన ఫలమిది
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
37.
పదవి నున్న వారు పలుకక, స్కూళ్ళు, ని
ర్లక్ష్యపరచగ భాష లైను దప్పె
దిక్కు లేని బిడ్డ కుక్క పాలైనట్లు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
38.
మొదటి తరగతందె ముదనష్ట పింగ్లీషు
తెలుగు భాష గొంతు నులుముచుండె
చంటి బిడ్డ కెపుడు చనుబా లె పట్టవలె
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
39.
ప్రధమ విద్య మాతృ భాష యందున్నపుడె
గట్టి పడును బేసు మట్టమెపుడు
పై తరగతులందె పరభాషలకు చోటు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
40.
తెలుగు మీడియమ్ము తెలుగు విద్యార్ధులకు
చదువు కొనుట కెంతో సౌఖ్యప్రథము
ఇంపిత మగుదారి కంప కొట్టించారు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
41.
గుండెలోని బాధ దండిగా వివరింప
మాతృభాష యొకటె మహిని చెల్లు
మనసు దోచు పండు మామిడే నన్నట్లు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
42.
తెలుగు నేల మీద తిన్నగా జన్మించి
తెలుగు పాలు త్రాగి తెలుగు తల్లి
రొమ్ము మీద గుద్దు రోమియోగాకుమీ
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
43.
పెద్ద భాష వచ్చి గద్దెపై కూర్చుంటె
మాతృభాష నోట మన్ను పడును
పక్షి గూటి లోకి పాము జొర పడ్డట్లె
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
44.
వొరుల కిచ్చి పొలము వారి వద్దే కూలి
చేయబోవు టెంత హేయ కరము
ఆంగ్ల ఆదిపత్యమటువంటిదే గురూ
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
45.
ఇరుగు పొరుగు భాష కిస్తున్న గౌరవం
తెలుగు కివ్వ రేమి తెగులొ మనకు
పేద కన్నిచోట్ల వేదనే యెదురగు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
46.
విధినెరింగి నేటి అధికార గణమంత
ఆంగ్ల భేషజాన్ని అట్టె వదిలి
తెలుగు ఉచ్చరిస్తె తిరిగి రాదా గతము
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
47.
అమెరికాకు బోవు ఆ నల్గురి కొరకు
ఆంగ్ల బండ నెత్తిరందరికిని
సూది కొరకు మోయు స్థూల దూలం వలె
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
48.
పరుగు లెత్తి యచట పాలు ద్రావే కంటె
నిలబడింట త్రాగు నీరు మేలు
అమెరికాల కేగి యగ చాట్లు పడ నేల
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
49.
చదువు చక్కనైన సంస్కార లావణ్య
అందమైన తెలుగు ఆడపిల్ల
కన్ని యుండె, యిప్పు డయిదవ తన మివ్వు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
50.
సర్వమతము లందు సామూహ ప్రార్ధనల్
స్వీయ భాషలందు చేయరేల
దేవుడితరభాష తెలియని మూర్ఖుడా ?
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
51.
ఆంధ్రముస్లిములను అరబ్ ఆకర్షించె
సంస్కృతమ్ము తెలుగు జాతి నొంచె
బల్లి యొడిసి పట్టు బలహీన జీవులన్
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
52.
రక్తి చూపకుంటె ముక్తి సున్నాయంచు
భక్త తటికి త్రొక్కి పట్టి నేర్పు
మౌఢ్యమతపు భాష మర్మంబు తెలుసుకో
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
53.
శాస్త్ర యుక్తమై సంస్కృతమేనాడో
తెలుగు భాష మీద తిష్ట వేసి
కొలువు తీరినట్టి గోముఖ వ్యాఘ్రహం
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
54.
వేల యేండ్ల నుండి విలువైన గ్రామీణ
పారిభాషికాల పట్టరైరి
ఎక్కడున్న గొంగళక్కడే నన్నట్లు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
55.
మాతృభాష తోనె మహనీయుడైనట్టి
సత్య సాయి గొప్ప చరిత చూడు
నేల విడిచి సాము మేలు కాదెన్నటికి
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
56.
లోటు పాటులుంటె నీటుగా సవరించి
పాటు చేసి తెలుగు మీట నొక్కు
ఎలుకలున్న వంచు యిల్లు తగలేతుమా
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
57.
A,B లు C,D లు, యే శివాజీకొచ్చు?
ఆంధ్ర భోజుకేమి ఆంగ్లమొచ్చు?
కోడికూయకుంటె కొంప తెల్లారదా?
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
58.
జన్మమిచ్చినట్టి జననిగా వేనోళ్ళ
పొగడగానె తల్లి దిగులు పోదు
పూజసేయ గోవు పుష్టికి నోచునా
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
59.
భక్తి మహిమ పెంచు భారతం రామాయ
ణాది కావ్యధారలందు తడిసి
తెలుగు నేలలందు వెలుగు లీనిన భాష
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
60.
బడుగు భాష యనుచు బాణాలు సంధించి
తెనుగు తల్లి యుసురు తీయబోకు
నిందమోపి సతిని బొందపెట్టిన రీతి
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
61.
చిన్న చూపదేల చీదరింపదియేల?
తెలుగు తల్లి మీద ద్వేషమేల?
ఆంగ్లకోటు దాల్చి అధికుడ ననుకోకు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
62.
మాతృభాష నొదిలి మరియొక భాషపై
కాలుమోపు వాడు కలత చెందు
నాటు పడవ నొదిలి ఓటి పడవెక్కకు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
63.
చిన్నతనము నందె కన్నతల్లిని వీడి
అన్యదేశవాస ఆంధ్రులంత
తెలుగు దైన్యస్థితికి దిగ్బ్రాంతి చెందేరు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
64.
అర్ధమవని భాష అధికార మందుంటె
అనువదించి తెల్పు అల్పులైన
మాయ మోసగాళ్ళు మనకొంప ముంచరా
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
65.
పాలనాధికార పగ్గాలు చేపట్టి
సాటిభాష లన్ని సాగు చుండ
తల్లి తెలుగు భాష దాస్యమే విడదాయె
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
66.
సకలమైన యితర జాతి పదాలతో
సంకరించె నన్న శంక పడకు
యెట్టిదైన పిల్లి యెలుకను పట్టేను
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
67.
రాజపీఠమందు రంజిల్లు భాషకు
మతపు భాషలకును క్షతియులేదు
ప్రాణ హానియెపుడు ప్రాంతీయభాషకే
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
68.
వట్టిమాట లంటు కొట్టిపారేయక
పట్టుతోడ బుద్ది పదును చూపి
మేలు చేయు భాష నేలిక చేసుకో
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
69.
వచ్చి రాని ఆంగ్ల భాషతో కుస్తీలు
పట్టు లెక్చరర్ల బాధచూడు
నక్కలకును ద్రాక్ష నిక్కితే అందునా ?
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
70.
మాతృదేశ ప్రేమ మరువకు మరువకు
మాతృభాష ప్రతిభ మబ్బువీడి
వెల్లివిరిసి నపుడె యిల్లు స్వర్గంబురా
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
71.
దేశమేమొ తెలుగు దేశీయులు తెలుగు
అమలు చేయు వారలంత తెలుగు
ఆంగ్ల భాషకేల అధికార పీఠమ్ము?
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
72.
ప్రజల నోళ్ల నుండు భాషోన్నతిన్ పొందు
ప్రజకు దూరమైన భాష చచ్చు
తైలమివని దివ్వె తిన్నగా కొండెక్కు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
73.
ఒరుల గొప్ప చూచి పరవశించుట మాని
స్వంత జాతి ప్రతిభ చాటనెంచు
కుంటి యైన కూడ యింటి బిడ్డే మేలు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
74.
ఆంగ్ల భాషయేమొ అసలు నేర్వను రాదు
తెలుగు చదవ బ్రతుకు తెరవు లేదు
సొంత కూడు పాయె బంతి కూడూ పాయె
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
75.
ఆలయాల పూజ కర్హత లేదని
తెలుగు మంత్రములకు విలువ నివరు
తెలుగు రాని వాడు దేవుడెట్లాయెనో
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
76.
కామధేను వంటి కమ్మని తెలుగుండ
ఇంగిలీషు నెత్తి కెత్తుకోకు
గంగి గోవు నొదిలి గాడిద కొలువట్లు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
77.
బానిసత్వమందు బ్రతికిన జాతికి
తగ్గదాయె మోజు దాస్యమందు
పోదు బిడ్డతోనె, పురిటి కంపన్నట్లు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
78.
ఆంగ్ల భాష మీద అభిమానమున్ బెంచి
తెలుగును విడనాడు తెగువ యేల ?
ఆలి దొరకెనంచు అమ్మను చంపకు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
79
తేనె లొలుకు నట్టి తెలుగును విడనాడి
గొంతు దిగని ఆంగ్ల చింతయేల?
అక్షయమ్మునొదలి భిక్షెత్తు కొన్నట్లు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
80.
లిపిని సంస్కరించి అపర వజ్రమ్ముగా
తీర్చి దిద్ది చూడు తెలుగు భాష
రాజ పీఠమునకె తేజస్సు నందించు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
81.
ఇళ్ళలో యింగ్లీషు బళ్ళలో యింగ్లీషు
తల్లి భాష విలువ తరుగుతోంది
చుప్పనాతి ప్రభుత చోద్యం చూస్తోంది
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
82.
కంటిపాప వోలె కాపాడగల బిడ్డ
గనిన రీతి, నిద్రననుసరిస్తె
మాతృ మూర్తి కింక మరణమే శరణము
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
83.
స్వంత తల్లి నగలు, సవతికి అందించి
బాధపెట్టు సుతులు బ్రతుకనేల
మాతృభాష ద్రోహ మిట్టిదేయగుజుమి
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
84.
బలసినట్టి భాష, బలహీనమగు దాని
యిట్టె మింగి వేసి గుట్ట గూల్చు
తెలుగు భాష కిట్టి స్థితిని రానీయకు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
85.
ఆంధ్ర ప్రభుత తెలుగు కంగీకరించినా
పెక్కు ఆఫీసర్లు లెక్క గొనరు
పారునీళ్ళ కెపుడు పాచి తెగులన్నట్లు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
86
తెగులుపట్టినట్టి తెలుగు బిడ్డల్లోని
అంతరించినపుడె ఆంగ్లతిక్క
మాతృభాష కొచ్చు మంచి రోజానాడు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
87.
ఇళ్ల లోనె కాదు బళ్లలో గుళ్లలో
కోర్టులందు ప్రజల హార్టులందు
చోటు గొన్న భాష సుస్థిరమై నిలుచు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
88.
ఆంగ్లముండు వారి కన్ని ఉద్యోగాలు
తెలుగు భాష కింక విలువ యేది
అద్దె వాడికిల్లు అసలు వాడికి నిల్లు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
89.
లోకమార్పు తోడ పోకడలు మారాలి
మారనట్టి దెల్ల మరణ మందు
తెలుగు తల్లి కట్టి స్థితిని పట్టింపకు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
90.
కొన్ని చోట్ల ప్రజలు ఎన్నో తరంబులు
కూర్చుకున్న భాష కూలెనంటె
భాషతోడ జాతి భవిత మరణింపదా
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
91.
ఆంధ్ర భాషకంటె ఆంగ్లమే మేలైతే
చదివి నీవె అందు చతురు డగుము
ఆంగ్ల గజ్జి తెచ్చి అందరికి పుల్మకు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
92.
తెలుగు వేషధారణ తెలుగు వేదికలందె
వేదికలను దాటి వెలికిరాదు
ఆంగ్లమైక మందె ఆఫీసు గణముండు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
93.
అసలు చిత్త శుద్ది ఆఫీసరందుంటే
తెలుగు కూడ మంచి స్థితి గడించు
మెత్తగుంటె రౌతు నర్తించు గుర్రాలు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
94.
విలువ తరిగినట్టి తెలుగు మీడియాన్ని
యెంచుకున్నవాడు కించవడును
యేమిటీ పరీక్ష యెన్నాళ్ళు ఈశిక్ష?
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
95.
అరచి పిలువగానె అక్బరు పాదుషా
చచ్చిపోయెను కదా వచ్చు టెట్లు?
అర్ధమవని భాష తర్జుమా యిట్లుండు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
96.
పట్టిమూఢ మతము వల్లించు ప్రార్ధనల్
పాత భాషలోనే వాతలిడును
అర్ధమవని గోష వ్యర్ధ ప్రయాసరా
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
97.
సకల మతములందు సమభావ దృష్టితో
తెనుగు భాష యున్నతికి తపించు
రహంతుల్లా గారి తహతహను గుర్తించి
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
98.
బడుగు తెలుగు భాష పాలింప యోగ్యమా
సాద్యమెట్టులనకుడు చవట లల్లె
నూర్ బాషా గారి తీరుగని నేర్చుకో
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
99.
అరయ యూనికోడు కందరూ క్రమముగా
మారి మాతృభాష మనుగడకును
సహకరించినపుడె సంపూర్ణ సమృద్ధి
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
100.
కన్నతల్లి కింత గంజి పోయుట మాని
సానికొంప మరిగి చంపజూచు
బిడ్డలున్న పురిటి గడ్డ కాదీ భూమి
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
101.
పూర్వరాజసాన పుట్టి పెరిగిన భాష
ప్రజలు రేబవళ్ళు పలుకు భాష
కవుల గంటమందు కదం త్రొక్కిన భాష
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
102.
ఆంధ్రదేశ రాజ అధికార పీఠాన
తెలుగు తల్లి పఠిమ తీర్చి దిద్ది
నిలుపకల్గు వరకు నిద్రపోరాదని
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
103.
పరుల పాలనమ్ము పనికి రాదంటి మే
వారి తోక (భాష) పట్టి వదల రేమి?
ఉడిగమ్ము కింత ఉబలాటమెందుకో ?
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
104.
ఐక్యరాజ్యసమితి అల్పాయు భాషల్లో
తెలుగు చేరెనంచు తేల్చి చెప్పె
కళ్ళు తెరవకుంటె ఇల్లు గుల్లై పోవు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
105.
చంటిబిడ్డ త్రాగు చనుబాలురా తెలుగు
అమ్మ రొమ్ము విడిచి ఆంగ్లమనెడి
ఖరము చన్ను గుడుచు ఖర్మ పట్టింపకు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ |
ఆకురాతి శతకం 1 పద్యాలు
[మార్చు]గ్రాసమునకు వేరు బాస నార్జించినా
కరకు తనపు నీతి గరుపనెంచి
తల్లిబాష లోన వల్లిస్తి పద్యాలు
ఆకురాతి మాట అణు బరాట
రాయి వేల్పుకాదు రక్షించికాపాడ
తాడుపాము కాదు తరిమికరువ
వట్టి భ్రమల నమ్మి నట్టేట మునుగకు
ఆకురాతి మాట అణు బరాట!!
బల్లి మీద పడిన అల్లాడు ప్రాణాలు
పిల్లి అడ్డువస్తే గొల్లు మనును
తుమ్ము తుమ్మిరంటే కుమ్మేసి నట్లుండు
ఆకురాతి మాట అణు బరాట!!
వార ఫలపు పిచ్చి పరమ సోంబేరికి
జాతకాల పిచ్చి నేతలకును
చపల ఛాందసులకు శకునాల పిచ్చిరా
ఆకురాతి మాట అణు బరాట!!
అంజినములు నిల్పు నరచేత స్వర్గాన్ని
సేదదీర్చు పస్తి, సోది కెళితె
చచ్చినోళ్ళ తెచ్చి సన్నిధి నిలబెట్టు
ఆకురాతి మాట అణు బరాట!!
ఇళ్ళు కత్తెరందు, పెళ్ళిళ్ళు మూఢాన
వద్దు వద్ద నేటి పెద్దలార
చెడ్డ తిధులలోన గడ్డి తినవచ్చునా ?
ఆకురాతి మాట అణు బరాట!!
చిలక జోస్యమొచ్చె కులుకుచూ బులిపింప
కుళ్ళు వాస్తు పుట్టే యిళ్ళు కూల్చ
బ్రతుకు లార్ప చేతబడులుద్భ వించెరా
ఆకురాతి మాట అణు బరాట!!
కలల రూపు దాల్చు ఘన కట్టడాలపై
దిష్టిబొమ్మ లుంచు భ్రష్టతేల
బొమ్మ పెట్టకుంటె గుమ్మాలు కూలునా
ఆకురాతి మాట అణు బరాట!!
మంచి చెడ్డలన్నీ మనిషియందే యుండ
వార వర్జ్యమనుచు, వదరనేల
పళ్ళు రాల నుండ పంచాంగ మాపునా ?
ఆకురాతి మాట అణు బరాట!!
మూఢ నమ్మకాల కీడుగా తలపోయు
పిరికి వాడు పనుల దారికి పోడు
బొమ్మ తేళ్ళ చూచి దిమ్మరిల్లిన రీతి
ఆకురాతి మాట అణు బరాట!!
వాస్తు – జ్యోతిష్యం
[మార్చు]10.
కాపురాలలోని కష్టాలు వినగానే
వాస్తు యింటి కప్పు వంక జూచు
సిద్ద యోగి ప్రాణి చిలకలో నున్నట్లు
ఆకురాతి మాట అణు బరాట!!
11.
తిరుగుచుండు భువికి దిక్కులు ఉండునా
వెర్రి వాస్తువునకు బుర్ర కలదె?
బుర్రలేని వారి భుక్తిరా గృహవాస్తు
ఆకురాతి మాట అణు బరాట!!
12.
వంటి రోగములకు వాస్తుకై పరుగిడ
యింటి దోషములను అంటకట్టు
గాడిదలకు మందు బూడిదే నన్నట్లు
ఆకురాతి మాట అణు బరాట!!
మూస:Col-3
13.
గౌరవముగా పిలిచి కట్నం సమర్పించి
కొంపకూల్చు విధము కోరు కొనకు
డబ్బులిచ్చి చెప్పు దెబ్బలు తిన్నట్లు
ఆకురాతి మాట అణు బరాట!!
14.
వాస్తు శాస్త్రమందు వాస్తవంబాయింటి
గట్టి తనము, కాంతి, గాలి వరకే
మిగులు పైత్యమంత మిత్రుల కల్పనే
ఆకురాతి మాట అణు బరాట!!
15.
చేతి రేఖలెంచి చెప్పు జ్యోతిష్యాలు
నరుని మరణ ఘడియ లరయలేవు
పురుగులేరు కప్ప పులుల వేటాడునా
ఆకురాతి మాట అణు బరాట!!
మూస:Col-3
16.
పెను ప్రమాదములను మును ముందుగా దెల్ప
కూత పెగిలిరాదు జాతకముకు
గొడ్డుమోతు జన్మ గడ్డికే అంకితం
ఆకురాతి మాట అణు బరాట!!
17.
అస్థిరంబు లైన వాస్తు జ్యోతిష్యాలు
గణిత శాస్త్రమునకు కావుసాటి
కుంటి గార్ధభాలు గుర్రాన్ని బోలునా
ఆకురాతి మాట అణు బరాట!!
మూస:Col-3
బాబాలు – స్వాములు
[మార్చు]
18.
భవ్యబోధలుండు నవ్య పోకడ లుండు
ఫైవ్ స్టారులందు పడక లుండు
సకల సుఖములుండు, సన్యాసిగా నుండు
ఆకురాతి మాట అణు బరాట!!
19.
దివ్య మహిమలున్న దీక్షిత బాబాకు
భర్త పోయినోళ్ళె భక్తురాళ్ళు
భక్తురాండ్ర కెపుడు భద్రత లోపమే
ఆకురాతి మాట అణు బరాట!!
20.
భక్త జనులు మోక్ష బ్రాంతిలో లీనమై
పొంచియుండు ముప్పుగాంచలేరు
యెరను మ్రింగు చేప లరయునా గాలాన్ని
ఆకురాతి మాట అణు బరాట!!
21.
గొలుసు లుంగరాలు గుప్త శివలింగాల
మాయ చేసి నిందమోయనేల
అడిగి నట్టి దిస్తె గుడికట్టి కొల్వమా
ఆకురాతి మాట అణు బరాట!!
22.
ఇలకుబేరు లల్లె బలసి బాబా లుండ
ఆ ప్రపంచ బ్యాంకు అప్పులేల
అక్షయమ్ము నొదిలి భిక్షెత్తు కొందురా
ఆకురాతి మాట అణు బరాట!!
మూస:Col-3
23.
ఙ్ఞానబోధ చేయు సాధు సద్గురులకు
ధనము ప్రోగు చేయు ధ్యాసపోదు
కొంగ జపములన్నీ కొరమేను కోసమే
ఆకురాతి మాట అణు బరాట!!
24.
చదువు రాని శుంఠ స్వామియై కూర్చుండ
పెక్కు చదివి నోళ్ళు మొక్కు చుండ్రు
గడ్డి తినెడి పులుల గాడిద లేలవా ?
ఆకురాతి మాట అణు బరాట!!
25.
సాధుమూఢ బోధ మేధావి వర్గాన్ని
పట్టే నంటే విడచిపెట్ట బోదు
మడుగు మొసలి నోట మదగజం పడ్డట్లే
ఆకురాతి మాట అణు బరాట!!
26.
స్వర్గలోక సృష్టి స్వాముల వంతైతె
ఘనత పెంచిపాడ కవుల వంతు
పగటి కలలు కనుట భక్తుల వంతయా
ఆకురాతి మాట అణు బరాట!!
27.
స్వాములుచ్చరించు స్వర్గాన్ని నమ్ముకొని
గొర్రెలెన్నొ దూకే గోతిలోన
దూకి బావు కొన్న దాఖలాలున్నవా?
ఆకురాతి మాట అణు బరాట!!
మూస:Col-3
28.
కూడుగుడ్డ లివని గురుపీఠ మదియేల
గుడ్డి చదువునేర్పు గురువు లేల
మూఢ బోధవలన ముష్టయిన పుట్టునా
ఆకురాతి మాట అణు బరాట!!
29.
యెరుక యెరుక యండ్రు యెరిగిన వారేరి ?
పూర్ణుడన బడేటి పురుషుడేడి ?
ఇసుక దంచుకొనిన ఒసగునా తైలంబు
ఆకురాతి మాట అణు బరాట!!
30.
భక్తి పరులలోని బలహీనతల, సొమ్ము
చేసుకొన్న వాడే సిద్దయోగి
వలను పడ్డ చేప వంటింటికే చెల్లు
ఆకురాతి మాట అణు బరాట!!
31.
వేషధారి నేడు విలువైన సన్యాశి
బాసమార్చువాడు పరమయోగి
గోచిలేనివాడు గొప్ప వేదాంతయా
ఆకురాతి మాట అణు బరాట!!
మూస:Col-3
సారసాంగులు – సాధికారిత
[మార్చు]32.
పాతివ్రత్య మహిమ పడతుల కానాడు
అంటకట్టినపుడె ఆదిమునులు
నేటి స్త్రీల బ్రతుకు నేతి బీరైపోయె
ఆకురాతి మాట అణు బరాట!!
33.
పూరుషాళికిచ్చె పునర్వివాహాలు
స్త్రీలకివ్వలేదు సిద్ద ఋషులు
పంచువారే పేద పింఛన్లు తిన్నట్లు
ఆకురాతి మాట అణు బరాట!!
34.
ఆడదాని బ్రతుకు అణగార్చి, మగవాడి
కప్పగించి పోయి రాది మునులు
కోడి నప్పగించి కోసుకో అన్నట్లు
ఆకురాతి మాట అణు బరాట!!
35.
భర్త శవముతోడ భార్యను చితికీడ్చి
తగలపెట్టి గొప్ప ధర్మమనుచు
జబ్బచరచు కొనిన జాతిరా మనదంటే
ఆకురాతి మాట అణు బరాట!!
36.
తాళికట్టనేల తాళీతో పాటుగా
గాజుపూస గొను రివాజదేల
గాజులోలువ గానే మోజులు మాయునా
ఆకురాతి మాట అణు బరాట!!
మూస:Col-3
37.
పురుషులెంతమంది తరుణుల మార్చినా
తప్పుకానరాదు – ధార్మికులకు
విధవరాళ్ళగోడు – మధురమై దోచేనా
ఆకురాతి మాట అణు బరాట!!
38.
స్త్రీలు తప్పు చేయ రాలతో కొడుదురే
విటుని తప్పు లెక్క సేయరేమి ?
ఆడదంటే యెంగిలాకు సమమాయెనా?
ఆకురాతి మాట అణు బరాట!!
39.
సంతు ఆడదాని జన్మహక్కయి యుండ
విధవరాలి సంతు చిదమనేల
పాండవులను కుంతి భర్తకే కన్నదా?
ఆకురాతి మాట అణు బరాట!!
40.
ఆలిపోయినోడు అన్నింట యోగ్యుడే
భర్తపోవు చాన భాగ్యహీన
తెగిన చెప్పులందు తేడాలు యెందుకో
ఆకురాతి మాట అణు బరాట!!
41.
గ్రామ దేవతలకు కన్నెపిల్లలు యేల ?
బసివి, దేవదాసీ, పదవు లేల
దొంగకోడెగాళ్ళ బెంగతీర్చేందుకా ?
ఆకురాతి మాట అణు బరాట!!
మూస:Col-3
42.
సతికి సీతనడత శాసించు మగడు, కో
దండ రాముడల్లే వుండవలదె
పాతివ్రత్యమంత పడతికై పుట్టెనా
ఆకురాతి మాట అణు బరాట!!
43.
అణచివేత నుండి ఆక్రోశ ముప్పొంగి
తిరగబడిన నాడు స్త్రీ జనంబు
పురుష జాతిలోన భూకంప మెగయదా?
ఆకురాతి మాట అణు బరాట!!
44.
తారమేని బట్ట తగ్గించి తగ్గించి
సిగ్గు తీయుచున్న చిత్రములకు
పసిడి గుడ్లు పెట్టు బాతాయె ఆడది
ఆకురాతి మాట అణు బరాట!!
45.
పాతివ్రత్యమనెడి బ్రహ్మస్త్రమే యుంటే
స్త్రీలవద్ద నాటి సీత పగిది
నేటి మహిళ కీ కరాఠీలు ఎందుకు ?
ఆకురాతి మాట అణు బరాట!!
మూస:Col-3
దేవుళ్ళు – మతాలు
[మార్చు]46.
రాతి వేల్పు ముందు భీతితో మసలేటి
గుణము లంతరించె జనము లందు
చెక్కపులుల నడుమ కుక్క బెదురెన్నాళ్ళు
ఆకురాతి మాట అణు బరాట!!
47.
దైవవూసు లన్ని దండగ యనుచునే
మీడియాలు వంత పాడు చుండు
ఎంత వారలైన కాంతకు దాసులే
ఆకురాతి మాట అణు బరాట!!
48.
అన్ని నిర్వహించు అర్చకుడే దెల్పు
మందిరాల కుండు మహిమయెంతో
వంటికంపు దేల్ప వస్త్రంబులేసాటి
ఆకురాతి మాట అణు బరాట!!
49.
ముక్తి మోక్ష మనుచు మూఢులరావించి
గుండుసేయ, భక్తి పండె ననుచు
బస్సు లిచ్చివేయు పైలోక టిక్కెట్లు
ఆకురాతి మాట అణు బరాట!!
50.
సూర్య గ్రహణ వేళ శోభిల్లు గుడులన్ని
మూత పడును, దోష భీతి వలన
భీతి చెండువాడు జాతికి దేవుడా ?
ఆకురాతి మాట అణు బరాట!!
51.
యాత్ర భక్త జనుల యముడు కాజేసినా
భక్తురాండ్రు రేప్ బారి పడిన
కరిని బ్రోచినోడు, కంపింపడేమయా
ఆకురాతి మాట అణు బరాట!!
52.
గణపతోత్సవాలు కనని దుష్పలితాలు
కలహపోరు కలిమి గంగపాలు
కోరి కోరి చావు కొని తెచ్చుకొనుటయే
ఆకురాతి మాట అణు బరాట!!
53.
మనిషి కొక్క సారె మనువు దేవుళ్ళకు
యేట యేట పెళ్లి యెందుకోయి ?
పెద్ద గుడుల మీది గద్దల మేపనే
ఆకురాతి మాట అణు బరాట!!
54.
పుట్ట గొడుడులల్లె ఊరూరా దేవుళ్ళు
పుట్టుకొచ్చు చుండు గుట్టుయేమి
గుడ్డిభక్తి పెంచి గడ్డిమేసేందుకే
ఆకురాతి మాట అణు బరాట!!
మూస:Col-3
55.
జీవనాడి లేని సింహంబు కంటెను
బక్కదైన యరచు కుక్కమేలు
మాయవేల్పు కంటే మహిషంబు మేలయా
ఆకురాతి మాట అణు బరాట!!
56.
యేసు ప్రభువు మళ్ళి యేతెంచునని, పాపు
లేదురు చూచు చుండి రెపటి నుండొ
ఎండ మావి దాహ మేరీతి తీర్చును
ఆకురాతి మాట అణు బరాట!!
57.
పార్వతీ సుతుండు పాలు త్రాగిండని
పరమ భక్తులం పరుగు విడిరి
దున్నపోతు ఈనే దూడ యేదన్నట్లు
ఆకురాతి మాట అణు బరాట!!
58.
ఒక్క కన్ను తెరచి చక్కగా చూచెనా
షిరిడిసాయి ఎంత చిత్రమండి ?
ఏమి వచ్చిపోయేనో స్వామి రెండవ కన్ను
ఆకురాతి మాట అణు బరాట!!
59.
అమ్మవారి మేని యాభర్ణముల్ పోయి
వగచు చుండె, యేల వర పడెదవు ?
తనకే దిక్కులేదు, తల్లికాపాడునా
ఆకురాతి మాట అణు బరాట!!
60.
బాధ తీర్చమని సమాధికి మొక్కేరు
గోతిలోని శవము గోడు వినునే
మాడిపోయిన బల్బు యేడిస్తే వెల్గునా
ఆకురాతి మాట అణు బరాట!!
61.
సత్య నిష్టలందు సాగు అయ్యపదీక్ష
ముగియగానె నడత మొదటికొచ్చు
నీతిలేని బ్రతుకు జ్యోతి సవరించునా
ఆకురాతి మాట అణు బరాట!!
62.
అడుగగానె స్వామి గుడినుండు పోలేరు
నిప్పుతెచ్చెననకు నిజముగానె
పోతులూరి వారి పొగ చుట్ట ఘాటిది
ఆకురాతి మాట అణు బరాట!!
63.
శిలువ నెత్తు కొనిన, శిలలకు మొక్కినా
భువి సమాధిచెంత బోర్లపడిన
త్రోవలోని అరటి తొక్కయిన కదలునా
ఆకురాతి మాట అణు బరాట!!
మూస:Col-3
64.
పలుకె బంగరనుచు విలపించెనేకాని
పలికి నట్టు లెచట తెలుపలేదు
రామదాసు దంత రాగాల యేడుపే
ఆకురాతి మాట అణు బరాట!!
65.
మతములెన్ని వేల గతుల రోదించినా
భావ జనిత వేల్పు పట్టుపడడు
పగటి కలల రంభ పట్టుకు చిక్కునా
ఆకురాతి మాట అణు బరాట!!
66.
మత ప్రచార బురద మది నిండ పుల్ముకొని
అన్యమత జనాల కంట బోకు
కాటువేయు తేళ్ళు గూటికి రాలేవు
ఆకురాతి మాట అణు బరాట!!
67.
మూఢ మతము లిచ్చు మోక్ష హామీలన్నీ
మాయ బ్యాంకు చెక్కు మాదిరుండు
రొఃఖ్ఖమేమొరాదు దుఃఖమా ఆగదు
ఆకురాతి మాట అణు బరాట!!
68.
సైన్సు రాకతోనే స్వర్గ పాతాళాలు
కాకులెత్తుకెళ్ళె, కలలు కనెడి
మేటి భక్తి కిపుడు కాటియే రహదారి
ఆకురాతి మాట అణు బరాట!!
69.
చావు పిదప మళ్ళి జన్మ వుందనుటకు
వుండు స్వర్గమోక్ష వూరటలకు
కుళ్ళు మతపు జొల్లు కూతలే సాక్ష్యామా
ఆకురాతి మాట అణు బరాట!!
70.
మానవాత్మపోయి, లేని పరమాత్మలో
లీనమగు ననేటి ఙ్ఞానులారా
ఎపుడు ఎచట నెవరు యేరీత గాంచిరి ?
ఆకురాతి మాట అణు బరాట!!
మూస:Col-3
మూఢ నమ్మకాలు అవినీతి మార్గాలు
[మార్చు]71.
వణికి వణికి నేడు వరస ప్రేలుళ్ళతో
నగర జీవితాలు రగులు చుండే
మనిషి కంటే మృగము మంచిదై పోయేరా
ఆకురాతి మాట అణు బరాట!!
72.
గాంధి కలలు కన్న గ్రామ సీమల్లోకి
బ్రాంది షాపులొచ్చి బార్లుతీరె
విందుహాలులోకి పందులెగపడ్డట్లు
ఆకురాతి మాట అణు బరాట!!
73.
ఆయువీయబోదు గాయత్రీ రుద్రాక్ష
మాలవేయగానే మహిమరాదు
యేల కోడిగ్రుడ్ల కీకలు పెరికేరు ?
ఆకురాతి మాట అణు బరాట!!
74.
చచ్చి బూడిదైన సాధువే దేవుడై
బతికినోళ్ళ పీక పట్టుకొనును
వెర్రిరాములంతా ఇర్రి(జింక)కి లోకువే
ఆకురాతి మాట అణు బరాట!!
75.
బడిత పూజ పొందు పాముల పుట్టలో
పాలు పోయు వెర్రి భామలారా
వేప గింజలందు తీపి కాంక్షింతురా ?
ఆకురాతి మాట అణు బరాట!!
76.
ప్రేమ పావురాల పెళ్ళివూసెత్తుచో
భవ్వు భవ్వు మనుచు పైకి దూకు
కుల మతాలు పిచ్చి కుక్కలురా నాన్న
ఆకురాతి మాట అణు బరాట!!
77.
భోగులైనవారి రోగాల కోసమే
యోగ వూడి పడియే నుద్దరింప
వ్యభిచరించు వారి కెయిడ్సు తోడైనట్లు
ఆకురాతి మాట అణు బరాట!!
78.
ఒట్టి కంఠశోష ఉట్టి పడు తుంపర్ల
పెళ్ళిమంత్రమే అభేద్యమైతే
యేడు గడవకుండ తాడేల తెగునయా ?
ఆకురాతి మాట అణు బరాట!!
79.
భూత వైద్యమంత బూటకార్భాటమే
దయ్యమెక్కడుంది తరిమి వేయ
స్థనములందు యెముక తడిమితే దొరుకునా
ఆకురాతి మాట అణు బరాట!!
80.
ఏక దంతు లడ్డు వేలాన పెట్టుచో
పాట లక్షలందు పరుగు తీయు
హాలివుడ్డుతార “బ్రా”ల కెగ పడ్డట్లు
ఆకురాతి మాట అణు బరాట!!
81.
నీతిదప్పనేల, నేర్పుతో నిధులన్నీ
మెక్కి సీ.బి.ఐ కి చిక్కనేల
బొక్కి పందికొక్కు బోనులో పడ్డట్లు
ఆకురాతి మాట అణు బరాట!!
82.
మంత్రజలము వలన సంతాన మబ్బుచో
మగడు ఎందుకోయి మానినులకు
నరకయాతనెట్టి ఉరికంబ మెక్కునా
ఆకురాతి మాట అణు బరాట!!
మూస:Col-3
83.
ఉంగరాలు పొదుగు రంగురాళ్ళల్లోకి
జాతకాలు వచ్చి పాతుకొనియె
నమ్ము గొర్రెలుంటె నమలవా తోడేళ్ళు
ఆకురాతి మాట అణు బరాట!!
84.
కోరికలను పెంచి కోడళ్ళ హతమార్చు
కాపురాలు చెడును ఖచ్చితముగ
కళ్ళు పొడుచుకొనిన మళ్ళీ చూపొచ్చునా
ఆకురాతి మాట అణు బరాట!!
85.
బ్రహ్మ చర్యమేల భ్రష్టు పట్టింపనా
యతుల వంటి వారే పతనమైరి
వరద నడ్డగిస్తె దారుల ముంచెత్తదా
ఆకురాతి మాట అణు బరాట!!
86.
బరితెగించి నట్టి వరకట్న భూతాలు
ఆడ శిశుల జన్మకడ్డు పడియె
కొరివి నేమరిస్తే కొంపను కాల్చదా
ఆకురాతి మాట అణు బరాట!!
87.
అపర ఛాందసులకు ఆధ్యాత్మికంబనే
సాలెగూటి మోజు చస్తె పోదు
ఎండుచేపబోను ఎలుకలు విడుచునా
ఆకురాతి మాట అణు బరాట!!
88.
ధర్మపరులు నడపు దళిత గోవిందాల
ధాటివేరు నడచు బాట వేరు
దంతి పండ్లు వేరు దంతాలు వేరయా
ఆకురాతి మాట అణు బరాట!!
89.
అనుభవాలమూట అటుకపై కెక్కించి
రామకోటి వ్రాయు రసికులార
బొక్కగానే యిసుక చక్కెరకాబోదు
ఆకురాతి మాట అణు బరాట!!
90.
కంపరంబు గొల్పు యం. పీ ల లంచాలు
దేశప్రజల కప్రతిష్ట తెచ్చె
కనకపీఠ మెక్కి శునక విన్యాసమా
ఆకురాతి మాట అణు బరాట!!
91. చాటునుండు పులులు మాటేసి కబళించు
ఫ్యాక్షనిజము వైపు పరుగులిడకు
చంపుకొనుట క్రూర జంతువునైజమ్ము
ఆకురాతి మాట అణు బరాట!!
92.
స్వామి రుణము మనకు క్షేమమాయని
భక్తుడున్న దంత వేయు హుండిలోన
అన్నదాన మంటే అతిధికి గాలమే
ఆకురాతి మాట అణు బరాట!!
93.
బాసుదైన వాడిబాబుదైనను సరే
కాలిక్రింది పైలు కదిలిరాదు
తగిన బరువు నిడక తక్కెడ కదలునా
ఆకురాతి మాట అణు బరాట!!
94.
పాము తేళ్ళ విషము పారాణి తావుల్లో
మంత్రములకు లేని మహిమ వచ్చు
బాసురానివేళ బంటు రాజైనట్లు
ఆకురాతి మాట అణు బరాట!!
95.
సకల జీవరాసి సమతుల్యమైనపుడె
వరుణుడవని మీద కరుణ జూపు
వరుణుడరయ కుంటే ధరణి జీవుండునా
ఆకురాతి మాట అణు బరాట!!
మూస:Col-3
96.
పచ్చిబూతె పంచప్రాణాలు సినిమాకు
గుడ్డి భక్తిలోనె గుడుల సోకు
ప్రభుత బహుపరాకు బ్రాందీ షాపుల్లోనె
ఆకురాతి మాట అణు బరాట!!
97.
ఎడమ చేత సీత యెత్తిన ధనసుకు
భుజము మోపలేక బోర్లపడిన
దశముఖునకు యెట్లు వశమాయెరా సీత
ఆకురాతి మాట అణు బరాట!!
98.
ఎంచి పంచుకోదు మంచితో వంచించి
కొంచెమైన దాచి యుంచుకోదు
స్వార్ధపరుని కంటె గార్ధభం మేలోయి
ఆకురాతి మాట అణు బరాట!!
99.
మభ్యపెట్టి చేయు మైనర్ల పెళ్ళిళ్ళు
పుట్టగానె చంపు పట్టుగూళ్ళు
గ్రామదేవికిచ్చు గావు కోళ్ళంబోలు
ఆకురాతి మాట అణు బరాట!!
100.
ప్రభుతకున్ను మరియు ప్రతిపక్షనేతకు
పట్టి యిద్దరికిని బ్రహ్మరధము
చిత్తుచేయు ప్రజల చెత్త పంచాంగాలు
ఆకురాతి మాట అణు బరాట!!
101.
అడుగు బడుగు జనము లల్లాడ, క్రీడకై
కుమ్మరించు చుండె కోట్లు కోట్లు
రాజద్రవ్యమంత రాళ్ళ పాలన్నట్లు
ఆకురాతి మాట అణు బరాట!!
102.
రామసేతువెక్కి రంకె లేసే వారు
జాతి నష్టపోవు రీతికనరు
టాపుమీదియాత్ర టైరు గోడరయునా
ఆకురాతి మాట అణు బరాట!!
103.
భద్రతాదళాలు నిద్రించినపుడెల్ల
ఉగ్రవాద దాడు లుప్పతిల్లు
పంట చేనుకెపుడు పందిబెడ దున్నట్లు
ఆకురాతి మాట అణు బరాట!!
104.
ప్రబల రాజసొత్తు కబళింప యజ్ఞాలు
పుట్టె, వాటికిపుడు పూజలేల ?
కాడిదున్నపోతు పాడికి యోగ్యమా
ఆకురాతి మాట అణు బరాట!!
105.
ఎద్దుటీగ పడిన బొద్దింక పడినను
బల్లి పడిన కాళ్ళ జెర్రి పడిన
తిరుమలాద్రి లడ్డు తీపియే జనులకు
ఆకురాతి మాట అణు బరాట!!
106.
ఓట్లు కొనెడి నేత, ఒళ్ళమ్ము కొనెడి స్త్రీ
త్రాగుబోతు మగడు, తగని సతుడు
కన్నమేయు దొంగలున్నతి గాంతురా
ఆకురాతి మాట అణు బరాట!!
107.
చీట్ల ఆటకేగి సీక్వెన్సు కోల్పోకు
డ్రింకు షాపులందు గ్రుంకు లిడకు
చౌకబారు లాడ్జి జాకెట్లు విప్పకు
ఆకురాతి మాట అణు బరాట!!
మూస:Col-3
కట్నాలు – కామాంధులు
[మార్చు]108.
కన్నె ప్రేమ కంటె – కట్నాలె కడు ప్రీతి
చదువరీల కైనా – చవట కైన
అడ్డ గాడిదలకు – గడ్డిపైనే మోజు
ఆకురాతి మాట అణు బరాట!!
109.
వరుల కట్నకాంక్ష – ఉరిత్రాళ్ళుగామారి
అంతరించుచుండే – ఆడ శిశువు
సంత యెడ్లను కొన – సాధ్యమా పేదలకు
ఆకురాతి మాట అణు బరాట!!
110.
ఆడ దంత రిస్తే – జోడీకి మగవాళ్ళు
గుంపు కట్టి వీధి – కుక్కలల్లె
పంచుకొనుట కైనా – పాంచాలి దొరకునా
ఆకురాతి మాట అణు బరాట!!
మూస:Col-3
111.
సాటి స్త్రీని బట్టి – సామూహికంబుగా
రేప్ చేయు దుష్ట – పాపులార
గొప్ప జాతి మీది – కుక్క బుద్దేలరా
ఆకురాతి మాట అణు బరాట!!
112.
కన్నకూతురనక – కామాంధులై బిడ్డ
బ్రతుకు పాడు చేయు – పశువు లార
ఇంట దొరకు ననుచు – పెంట భుజింతురా
ఆకురాతి మాట అణు బరాట!!
113.
మూఢ నమ్మకాలు – ముసిరి యున్నన్నాళ్ళు
ఆకురాతిశతక – మవని నుండు
గాడి కొక్కులుండ – గాలింప ఆగునా
ఆకురాతి మాట అణు బరాట!!
మూస:Col-3
114.
విధవరాళ్ళ చేసి –నుదుటి కుంకుమదీయ
మోము చూపలేని –ముదిత నెపుడు
కాటువేయజూచు –నాటు కుక్కలు తప్ప
మనువు కొప్పుకొనేడి –ఘనులు కలరే? –ఆకురాతి
115.
కలియుగాంత మనుచు –కడతేరు దినమంచు
కమ్ముకున్న ఈ పుకార్లనెల్ల
సొమ్ము చేసుకొనేడి సోగ్గాళ్ళదే హవా
ఆకురాతి మాట- అణుబరాటా
మూస:Col-3
ఆకురాతి శతకం 2
[మార్చు]1.
నిక్కమైన దాని నొక్కి వక్కాణించు
రంకు బొంకు పళ్ళు – రాలగొట్టు
డూపు చేయువారి – షేపులే మర్చేయు
ఆకురాతి మాట అణు బరాట !!
2.
సత్య యుతము నెల్ల – చరితగా నిలబెట్టు
అనృతాల పీక – నదిమి పట్టు
కుల మతాల గొంతు – నులిమి గోరీ కట్టు
ఆకురాతి మాట అణు బరాట !!
3.
గుడ్డి నమ్మకాల – నడ్డిపై నర్తించు
కల్ల బొల్లి చెత్త – గంపకెత్తు
కూట నీతి పరుల – కోటలు బీటలౌ
ఆకురాతి మాట అణు బరాట !!
మూస:Col-3
4.
ఆకుఅలుము మేయు – మేక యాగాలతో
రాజయోగ భోగ – రక్తులైన
రసిక యతుల కుంటి – రాతలే వేదాలు
ఆకురాతి మాట అణు బరాట !!
5.
ధర్మమనుచునే యధర్మ పురాణాలు
భక్తి భ్రమలలోన ప్రజల ముంచి
ఉబ్బరించి ప్రబల – జబ్బుగారూ పొందే
ఆకురాతి మాట అణు బరాట !!
6.
విశ్వఙ్ఞానమునకు – వేదాలే నెలవని
జబ్బ చరచుకొనెడి – జాతి మీద
దొడ్డి దారి నుండి – దూకిందిరా సైన్సు
ఆకురాతి మాట అణు బరాట !!
మూస:Col-3
7.
సైన్సు కోటలోన – జన్మించి మీడియా
జేరి పోయె శత్రు (భక్తి) – శిబిర మందు
మాతృ దేశ ద్రోహి – మహి విభీషణుడల్లె
ఆకురాతి మాట అణు బరాట !!
మూస:Col-3
పురాణాల్లోని – ఘరానాముళ్ళు
[మార్చు]8. పడచు విధవ రాళ్ళు – కడుపులతొ మొదలైన భారతము కళంక – బాట పట్టె ఆదిలోనే పుట్టె – హంస పాదన్నట్లు ఆకురాతి మాట అణు బరాట !!
9. ఆది కవిని మ్రింగె – అరణ్య పర్వమని తెలుగు సేయ జడిసె – తిక్కన కవి ఎద్దు బెదిరిపోయె – ఎర్ర గుడ్డను చూచి ఆకురాతి మాట అణు బరాట !!
10. అన్ని చోట్ల కలదు – యనిన పోతన్నయే కలడొలేడొ యనుచు – పలవరించే కథలలోని వేల్పు – విదిలిస్తె రాలునా ఆకురాతి మాట అణు బరాట !!
11. పలుకే బంగరనుచు – విలపించెనే గాని పలికినట్టు లెచట – తెలుప లేదు రామదాసు దంత – రాగాల యేడుపే ఆకురాతి మాట అణు బరాట !!
12. పనికి రాని దోయి – పాంచాలి చరితమ్ము భర్తలైదుగురికి – భార్య ఒకటే కుక్కలకును తప్ప – కుదురునా ఈరీతి ? ఆకురాతి మాట అణు బరాట !!
13. అందగాడి పొందు – ఆశించు ఆడది సహజమే కదయ్య – సచ్చరిత్ర చెవులు ముక్కు కోసి – చేతిలో పెడుదువా ? ఆకురాతి మాట అణు బరాట !!
14. తిన్న కుక్క యేదొ – తిని పోయే పెరటిలో ఉన్న దాన్ని పట్టి – వూనినట్లు పాపి ఇంద్రుడైతె – శాప మహల్యాకా ? ఆకురాతి మాట అణు బరాట !!
15. గాలి కొకరు పుట్టె – నేల కొకరు పుట్టె కాలి ధూళి నుండి – కాంత పుట్టె వెర్రికథలు పుట్టె – గొర్రెల నలరింప ఆకురాతి మాట అణు బరాట !! మూస:Col-3 16. సీతలోని మహిమ – స్త్రీ జాతి కున్నచో కట్నమనెడి అగ్గి – కాల్చగలదె ? పాతివ్రత్య మంత – పచ్చి బూటక మోయి ఆకురాతి మాట అణు బరాట !!
17. భార్యలింట నుండ – పలుభామ కౌగిళ్ళ కంట కాగినట్టి – తుంటరీలు పాండవులకు ధర్మ – పట్టాభిషేకమా ? ఆకురాతి మాట అణు బరాట !!
18. సుతుల కొరకు ఎంత – మతిహీనుడైనను భార్య నొరుల కడకు – పంపగలడె ? పాండవ జననాలు – ప్రజల కాదర్శమా ? ఆకురాతి మాట అణు బరాట !!
19. మగడి పక్కలోన – మగువనూ వదలవే కాపురాలు వలదె – గోపికలకు ? ఒరుల కొంపలార్ప - మురళి చేపడితివా ఆకురాతి మాట అణు బరాట !!
20. నమ్మియున్న సతిని – నడి వీధి నిలబెట్టి అమ్మి వైచినపుడె – హరిశ్చంద్రు సత్యవ్రతము కాస్త – సాగరం పాలాయె ఆకురాతి మాట అణు బరాట !!
21. ఆకసంబులోన – అలరారు సూర్యుడు కన్నె పిల్లకేట్లు – కడుపు చేసె ? సూత పుత్ర జన్మ – జాతికే తలవంపు ఆకురాతి మాట అణు బరాట !!
22. తనువు కండ కోసి – దానమ్ము చేసేటి దాత నుండి నేర్చు – నీతి ఏమి ? చక్రవర్తి శిబికి – శాశ్వత మరణమే ఆకురాతి మాట అణు బరాట !!
23. నదులు యెగసి దాట – నరుల వల్లే కాదు జాతిలోన జూడ – కోతి యయ్యు ఆంజనేయు డెట్లు – అంబుధి దాటేనో ? ఆకురాతి మాట అణు బరాట !! మూస:Col-3 24. చావు లేని యమర – జీవిగా ఇతడికి ముద్రవేసి చనిరి – మూఢ యతులు అమరజీవియిపుడు అవనిపైలేడేమీ ? ఆకురాతి మాట అణు బరాట !!
25. భర్త గుడ్డి యైతె – భార్యకు గంతలా ? మగువ కిట్టి శిక్ష – జగతి గలదె ? మహిళ యనిన పురుష – అహముకు బానిసా ? ఆకురాతి మాట అణు బరాట !!
26. జంబుకుని వధించి – జానకీ రాముండు మలిన పడియె అడవి – మత్త గజము తాన మాడి ధూళి – తలకెత్తు కొన్నట్లు ఆకురాతి మాట అణు బరాట !!
27. కుష్టు రోగి మగని – దుష్ట కోరిక దీర్ప సానికొంప జేర్చె – సాధ్వి సుమతి ఇంతకంటె స్త్రీకి – హీన బ్రతుకున్నదా ? ఆకురాతి మాట అణు బరాట !!
28. తూల నాడ నేల – దుష్టుడా రావణుడు ? అంటకుండ సీత – నింటి కంపె రేప్ చేసియుంటె – ఆపువారెవరోయి ? ఆకురాతి మాట అణు బరాట !!
29. ఆర్తి మంగపతిని – కీర్తించి కీర్తించి అంతరించి పోయె – అన్నమయ్య భక్తవరదు డొచ్చి – పల్లకి మోసెనా ? ఆకురాతి మాట అణు బరాట !!
30. కాల ఙ్ఞానమంత – ఘంటా పధమ్ముగా పలికినట్టి వీర – బ్రహ్మమునకు మళ్ళీ జన్మ శూన్యమని – తెల్వదాయెనే ? ఆకురాతి మాట అణు బరాట !!
31. పుట్టి నపుడు లేదు – గిట్టినపుడు లేదు నడుమ బట్టయేల ననియె వేమ ? పరమయోగి మాట – పాటింప యోగ్యమా ? ఆకురాతి మాట అణు బరాట !! మూస:Col-3
|} </poem>
అబలలు – అఘాయిత్యాలు
[మార్చు]32.
తాళి కట్టమంటె – దారికి మాత్రం రారు
క్షితిని శాంతముగను – బ్రతుక నివరు
విధవరాలికెపుడు – వీధి కుక్కల పోరు
ఆకురాతి మాట అణు బరాట !!
33.
కాపటి త్రాగుబోతు – కారుకూతలు విని
నిండుచూలు సతిని – నిష్టూరముగా
అడవి కంపినోడు – ఆరాద్యదేవుడా ?
ఆకురాతి మాట అణు బరాట !!
34.
మతము లెంత మోక్ష – హితబోధ చేసినా
గత చరిత్రలోని – ఘటన లరయ
యతుల బుద్ధులెపుడు – రతికేళి మీదనే
ఆకురాతి మాట అణు బరాట !!
35.
పసుపు కుంకుమనెడి – పడతి సౌభాగ్యాన్ని
తగలకట్టినారు – మగడి మృతికి
అత్తసొమ్ముదాన – మల్లుడిచ్చిన రీతి
ఆకురాతి మాట అణు బరాట !!
మూస:Col-3
36.
చదువు నంట రాదు – స్వాతంత్ర మనరాదు
యొదిగి మగని క్రింద – యుండుమనెడి
మనువు ధర్మ స్మృతులు – మహిళా కాదర్శమా ?
ఆకురాతి మాట అణు బరాట !!
37.
చిట్టి వయసులోన – కట్టించు మేడతాళి
చొప్పవామిలోని – నిప్పపగిది
తెప్పరిలక ముందె – గుప్పున దహియించు
ఆకురాతి మాట అణు బరాట !!
38.
ఇంటి దీపమైన – యింతికే ముసుగైతె
కాంతి కోలు పోవె – కాపురాలు
కాంతి లేని యిల్లు – శాంతికి నోచునా ?
ఆకురాతి మాట అణు బరాట !!
39.
మూసి యున్న పిడికి లాశతో చూచేరు
తెరచి యున్న దాని – దెసకు పోరు
వసుధలోన స్త్రీకి – ముసుగే ప్రధానమా?
ఆకురాతి మాట అణు బరాట !!
మూస:Col-3
40.
కలసి మెలసియుండు – కాలేజి చదువుల్లో
సెక్సు విద్య వచ్చి – చేరి పోయే
వెలది చదువు లింక – పులి మీద స్వారీయే
ఆకురాతి మాట అణు బరాట !!
41.
సహజ పాయసాన – సైనేడు గుళికల్లె
ప్రేమలందు హింస – పెచ్చరిల్లె
తావి చిలుకలార – తస్మాత్ జాగ్రత్త !
ఆకురాతి మాట అణు బరాట !!
42.
ఆడ హంగుపొంగు - లారేయ సినిమాలు
హుక్సు తెంచి దూకె సెక్సు విద్య
కన్నె పిల్ల బ్రతుకు – కత్తిపై సామాయే
ఆకురాతి మాట అణు బరాట !!
మూస:Col-3
భక్తి సామ్రాజ్యంలో – భంగపాట్లు
[మార్చు]43.
రాయలిచ్చినట్టి – రత్నాలు నగలేవి ?
తెలుపవయ్య స్వామి – పలుకవేమి ?
సతులకళ్ళు కప్పి – సాని కందిస్తివా
ఆకురాతి మాట అణు బరాట !!
44.
తీర్చి గాట్లు పెట్టు – తిరుమల గుండ్లకు
ఏడ్స్ సోకు నంటె – ఏలనండి ?
తింటూ కంబళందు – వెంట్రుకలన్నట్లు
ఆకురాతి మాట అణు బరాట !!
45.
గుడి ప్రదక్షిణల్లొ – కుక్కలు, పందులు
వచ్చి చేరు చుండె - స్వచ్ఛముగను
వాటి కిపుడు పుట్టె – వైకుంట రసపిచ్చి
ఆకురాతి మాట అణు బరాట !!
46.
దారి పొడవు నుండు – దైవ గుళ్ళన్నింట
మోకరిల్ల మనసు – మూఢ భక్తి
నవ్వు మొగముదెల్ల – నా భార్యె అన్నట్లు
ఆకురాతి మాట అణు బరాట !!
47.
ప్రజల వద్ద కిపుడు – బ్రహ్మోత్సవంబులే
తరలి వచ్చు చుండె – వరము లీయ
యిళ్ల వద్దె మనకు – యింపైన క్షవరాలు
ఆకురాతి మాట అణు బరాట !!
48.
దిక్కు మొక్కు లేని – ముక్కోటి దేవతలు
తిరుమలాద్రి మీద – తిష్టవేసి
"రోపువే” కు అడ్డు – చాపిరి మోకాళ్ళు
ఆకురాతి మాట అణు బరాట !!
49.
పేద సాద నోళ్ళు – పెద్ద పెట్టున కొట్టి
సోమరులను మేపు – స్వామి వీవు ?
కాకులను వధించి – గద్దల కిడినట్లు
ఆకురాతి మాట అణు బరాట !!
మూస:Col-3
50.
కొప్పు లోని పూలు – కోనేటి రాయుండు
లాగి వైచుకొనియె – రాను రాను
ఒంటి చీరకూడ – వొలుచుకు పంపడా
ఆకురాతి మాట అణు బరాట !!
51.
గుళ్ళు గోపురాలు – కోకొల్లలుండంగ
రామ జన్మ భూమి – రగడయేల?
రాముడిపుడు మందిరమ్ముకై వగచేనా ?
ఆకురాతి మాట అణు బరాట !!
52.
భక్తి స్తోత్రములకు – బల్బయిన వెల్గదే
స్వస్థకూటమేల – చర్చి లేల ?
కుంటి ప్రార్ధనలకు – కుదురునా రోగాలు ?
ఆకురాతి మాట అణు బరాట !!
53. కుక్కిక్యూలనడుమ – త్రొక్కి చంపేసినా
కొండ దేవి కొలువు – దండగనరు
వెర్రిగాను నమ్ము – గొర్రె కసాయినే
ఆకురాతి మాట అణు బరాట !!
54.
బ్లేడులుండవచ్చు – పిడిబాకు లుండొచ్చు
వడ్డీ కాసులోని – వడలయందు
వెల్లడింప కోయి – కళ్ళు పోతాయట
ఆకురాతి మాట అణు బరాట !!
55.
రామజన్మ భూమి – రాసిత్తు మన్నను
రాలవాయె ఓట్లు – రామ రామ
గొడ్డు టావు పితుక – నడ్డిరగ తన్నదా ?
ఆకురాతి మాట అణు బరాట !!
56.
చదువలేని భక్త – చవట విద్యార్ధులకు
స్లిప్పులంద జేయు – సీజనాయే
మొక్కులంద వేల్పు – లెక్కడున్నారయా?
ఆకురాతి మాట అణు బరాట !!
మూస:Col-3
57.
పండుగొస్తె మూఢ – భక్తితూటాలతో
మూఢభక్తి నింపు – మూకలందు
కైపు మహిమ దెల్పి – కల్లుత్రాపినరీతి
ఆకురాతి మాట అణు బరాట !!
58.
ధరణి భక్త తతికి – దైవ నిందనగనే
చెడ్డి తడిసి వొళ్ళు – చెమట పట్టు
పాడు పుట్ట చూచి – భయ భ్రాంతులైనట్లు
ఆకురాతి మాట అణు బరాట !!
59.
ఆడ మగయు కానీ – వాడ కొజ్జాలంత
స్వామి రూప మెత్తి – జనుల బ్రోవ
ఊళ్ళ మీద పడిరి – వూసర వెల్లులై
ఆకురాతి మాట అణు బరాట !!
60.
ఇహ సుఖాలు దుఃఖ - హేతువను స్వాముల్లొ
స్వర్గ సుఖపు టాశ – చచ్చెనేమొ !
రాసలీల లందు – దూసుకెళ్తున్నారు
ఆకురాతి మాట అణు బరాట !!
61.
అష్ట సిద్దులనుచు – కష్టాల కొలిమిలో
కాగినట్టి పరమ – యోగులంత
కన్ను మూయ గానె – కాటికే అంకితం
ఆకురాతి మాట అణు బరాట !!
62.
దైవ భక్తులంత – కైవల్యమున్ బొంది
స్వర్గ ధామ మునకు – చేరు చుండ
తరుగ వలయు జనులు – పెరుగు చున్నారేమి ?
ఆకురాతి మాట అణు బరాట !!
63.
సైన్సు నెదురలేని – శతకోటి మతముల్లొ
“కాల చక్ర” కూడ – కలసి పోయె
చచ్చి నోణ్ణి మరల – సంకేసు కొత్తురా ?
ఆకురాతి మాట అణు బరాట !!
మూస:Col-3
పండుగలు - దండగలు
[మార్చు]64.
పస్తులెపుడు పేద – నేస్తాలు, రంజాను
పండుగంచు మళ్లి – పస్తులేల ?
పస్తులుండగానె – వస్తాదు లగుదురా ?
ఆకురాతి మాట అణు బరాట !!
65.
దండి జీతగాళ్ళె – దశరాకు మామూళ్ళు
రొల్లు చుందురెపుడు – రోతయనక
కుండ దోచుహక్కు – కుక్కల కున్నట్లు
ఆకురాతి మాట అణు బరాట !!
66.
ధనము వీధులందు – దగ్ధమై పోతుండ
గుండె చిక్క పట్టి – గుటకలేయు
పేద గుండె కాల్చు – పెనుము దీపావళీ
ఆకురాతి మాట అణు బరాట !!
మూస:Col-3
67.
పండుగ యుగాదికి – పంచాంగ శ్రవణాలు
పరమ ఛాందసులకు – బంధనాలు
పఠితపండితులకు – పసిడి యాభరణాలు
ఆకురాతి మాట అణు బరాట !!
68.
నల్ల దుస్తులేల – వల్లింపు భజనేల ?
జ్యోతి దర్శనాల – జాతరేల ?
నీతి లేని బ్రతుకు – జ్యోతి సవరించునా ?
ఆకురాతి మాట అణు బరాట !!
69.
నీటి కలుషితాలు – పోటెత్తి జనులపై
కాటువేయుననెడి – మాట నిజము
నిజము స్వీకరింప – గజముఖా లొప్పునా ?
ఆకురాతి మాట అణు బరాట !!
మూస:Col-3
70.
జాతరలకు మేటి – సమ్మక్క సారక్క
పూనకాలొకింత – పొదుపరిస్తె
యేటి కొక్కటైన – నీటి ప్రాజెక్టగు
ఆకురాతి మాట అణు బరాట !!
మూస:Col-3
మూఢ విశ్వాసాలు
[మార్చు]71.
బాల బాలికలను – బలిమి టి. వి. చెరచు
చిత్ర సీమ యువ చరిత్ర చెరచు
మూఢ భక్తి ముసలి – మూకను చెరచురా
ఆకురాతి మాట అణు బరాట !!
72.
చదువు గిదువు లేల – సంసార దిగులేల
హనుమ కవచ మొకటి – కొని ధరించు
కోరుకున్న దొచ్చి – కొంగులో పడునట
ఆకురాతి మాట అణు బరాట !!
73.
కన్నె గర్భమందు – కల్గె యేసయ్యంటె
శాస్త్ర మెట్టులొప్పు – సాధులార ?
నాటకుండ విత్తు – నారు మొలకెత్తునా ?
ఆకురాతి మాట అణు బరాట !!
74.
ఏక ముఖియె కాదు – ఎన్నో ముఖాల రు
ద్రాక్ష యైన కూడ – లబ్దిసున్న
యెండు కాయ రసము – పిండితే కారునా ?
ఆకురాతి మాట అణు బరాట !!
75.
బాధ తెలుప సాధు – బాణామతీ యనును
తడిమి మాంత్రికుండు – దయ్యమనును
ఖరము నాశ్రయిస్తె – కాలు ఝాడింపదా ?
ఆకురాతి మాట అణు బరాట !!
76.
భ్రాంతి గొలిపిచంపు – బాణామతిని నమ్మి
పామరుండు చెడును – పాము వంటి
తాడు కాళ్ళకు పడి కోడి చచ్చినరీతి
ఆకురాతి మాట అణు బరాట !!
77.
మూఢ నమ్మకాల – ముప్పేట దాడిలో
పెక్కు పండితాళి – చిక్కు వడియె
గుడ్డి పులులు చిక్కె – కుందేళ్ళ కన్నట్లు
ఆకురాతి మాట అణు బరాట !!
78.
దూరదర్శనీకి – చేరువై టి. టి. డి.
భక్తి సీరియళ్ళ - పధకమల్లె
పడగ విప్పె పాము – పుడమి కప్పల బ్రోవ
ఆకురాతి మాట అణు బరాట !!
మూస:Col-3
79.
కష్టజీవి నోటి – కబళాన్ని కాజేయ
ముమ్మరించె మూఢ – నమ్మకాలు
నక్క కాకి నోటి – ముక్క రాల్చినరీతి
ఆకురాతి మాట అణు బరాట !!
80.
మురికి నీటి గుంట – ముసిరేటి దోమల
పెంపు చేసినట్లు – పేదలందు
తగని భూతవిద్య – దయ్యాల సృష్టించె
ఆకురాతి మాట అణు బరాట !!
81.
కుంటి నడచునంట – గుడ్డి చూచేనంట
చిలక వోలె మూగ – పలుకునంట
యేసుప్రార్ధనంట – ఆసుపత్రింకేల ?
ఆకురాతి మాట అణు బరాట !!
82.
అన్ని చదివి నోళ్ళె - అంధ విశ్వాసాల
మునిగె యుందు రెపుడు – మూఢులల్లె
కొండ యేనుగులకు - తొండాలు లేనట్లు
ఆకురాతి మాట అణు బరాట !!
83. దైవ భక్తి లోన తరియించు భక్తులే
కన్నవారికింత - కవళమిడరు
నడక నేర్పు బల్లి - కుడితిలో పడ్డట్లు
ఆకురాతి మాట అణు బరాట !!
84.
కోరుకున్న దెల్ల - కొంగులో పడునట
రత్నజ్యోతి వారి - రాళ్ళు కొనుడి
రాల్చి వేయుపళ్లు – రాయిలేకుండనే
ఆకురాతి మాట అణు బరాట !!
85.
చిత్రసీమబూతు – సిగిరెట్ల లో ఘాటు
భక్తి పరుని మొక్కు - బ్రాంది కిక్కు
మచ్చికైన కుక్క - చచ్చినా వదలవు
ఆకురాతి మాట అణు బరాట !!
మూస:Col-3
86.
గంగతీర్ధ మిపుడు - గంటె డైనా చాలు
బొట్టు త్రాగి చూడు - ఇట్టె తెలియు
స్వర్గప్రాప్తి యెంత - శర వేగమాయెనో ?
ఆకురాతి మాట అణు బరాట !!
87. మూఢ భక్త కోటి - ముసిరేటి నదులన్ని
ఉరక లెత్తుచుండె - మురికి తోడ
వాటి స్నాన మిపుడు - వైకుంఠ యాత్రయే
ఆకురాతి మాట అణు బరాట !!
88.
పుష్కరాలొసంగు - పుణ్యమే పుణ్యంబు
మురికినీట తలను – ముంచినపుడె
మోక్ష ప్రాప్తి మహిమ – సాక్షాత్కరించేను
ఆకురాతి మాట అణు బరాట !!
89.
చేత కాని డ్రైవ్ - చేటు తెచ్చిందనక
నిదుర లేచి చూస్తి - విధవ ననును
వెధవ నింద కెల్ల - విధవయే లోకువా ?
ఆకురాతి మాట అణు బరాట !!
90.
ఆపదలను గాయ - ఆదేవు డుండెనని
కళ్ళు మూయబోకు - వొళ్ళు మరచి
యెదురు తగిలె నంటె అదిరి పళ్ళూడేను
ఆకురాతి మాట అణు బరాట !!
91.
యోగమని సుఖాన్ని - త్యాగమ్ము గావించి
దండగనుచు తనువు – నెండగట్టి
ఒరిటి సచ్చినోళ్ళు - వైకుంఠ, మేగిరా ?
ఆకురాతి మాట అణు బరాట !!
92.
కపట నేత లెంత – ఘటికులై పోరినా
ఓట్ల యుద్దమందు – ఓడిపోవు
గబ్బు వేపపళ్లు – దిబ్బకేనన్నట్లు
ఆకురాతి మాట అణు బరాట !!
మూస:Col-3
కన్నె పిల్లలు - కామాంధులు
[మార్చు]93.
పెళ్ళిముందె టెష్టు – పెట్టించి చేసుకో
తల్లి నమ్మరాదు – పిల్లగాళ్ల
చిలిపి జామ ఎయిడ్స్ – చిలకలు కొరికుండు
ఆకురాతి మాట అణు బరాట !!
94.
పెళ్ళి కాక ముందే – పెనగకు సెక్సులో
పట్టెనంటె ఏడ్స్ – పుట్టి మునుగు
పూతలోనె పైరు – పురుగంటు కొన్నట్లు
ఆకురాతి మాట అణు బరాట !!
95.
కొట్టు నరుకు చంపు – కోసినా గీసినా
కాముకులకు పోదు – ప్రేమ జబ్బు
మాడ్చు గాక మిడత – మంట నంటే తిరుగు
ఆకురాతి మాట అణు బరాట !!
96.
తిరు నిలయములోనె – తిరుమలేశుడె సాక్షి
చుక్క, ముక్క, మందు – చుంబనాలు
ఆంక్ష లెవరి మీద – అందరూ భక్తులే
ఆకురాతి మాట అణు బరాట !!
97.
కన్ను మిన్ను కనని – కామాంధునికి పండు
ముసలి దైన యొకటి – పసిది యొకటె
ఎగ బడేను పశువు – యే గడ్డి కైనను
ఆకురాతి మాట అణు బరాట !!
మూస:Col-3
98.
కన్న కూతురనక – కామాంధులై బిడ్డ
బ్రతుకు పాడు చేయు – పశువులార
ఇంట దొరకు నంటె – పెంట భుజింతురా ?
ఆకురాతి మాట అణు బరాట !!
99.
పసుపు కుంకుమలకు – పరితపించే స్త్రీలు
చేయు పూజాలందు – చేవయుంటె
ముండమోయు ఆడ – దుందునా భూమిపై ?
ఆకురాతి మాట అణు బరాట !!
100.
కన్నె వలపు కంటె – కట్నాలె కడుప్రీతి
చదువరీల కైన – చవట కైన
అడ్డ గాడ్డెకెపుడు – గడ్డిపైనే మోజు
ఆకురాతి మాట అణు బరాట !!
101.
వరుల కట్నకాంక్ష – ఉరిత్రాళ్లుగామారి
అంతరించుచుండె – ఆడ శిశువు
సంత గిత్తల కొన – సాద్యమా పేదలకు ?
ఆకురాతి మాట అణు బరాట !!
102.
ఆడ దంత రిస్తె – జోడీకి మగవాళ్ళు
గుంపు కట్టి వీధి – కుక్కలల్లె
పంచుకొనుట కైన – పాంచాలి దొరకునా
ఆకురాతి మాట అణు బరాట !!
మూస:Col-3
103.
సాటి స్త్రీని బట్టి – సామూహికంబుగా
రేపు చేయు దుష్ట – పాపులార
గొప్ప జాతి మీది – కుక్క బుద్దేలరా ?
ఆకురాతి మాట అణు బరాట !!
104.
బాయి ఫ్రెండు ఎన్ని – భ్రమలు కల్పించినా
లొంగరాదు మాన – భంగమునకు
కుక్కవాత పడ్డ – కూటి విస్తరి భంగి
ఆకురాతి మాట అణు బరాట !!
105.
మూఢ నమ్మకాలు – ముసిరి యున్నన్నాళ్లు
ఆకురాతి శతక – మవని నుండు
గాది కొక్కులుండ – గాలింపు ఆగునా ?
ఆకురాతి మాట అణు బరాట !!
మూస:Col-3
ఆకురాతి శతకం – 3
[మార్చు]వింతలు – విడ్డూరాలు
[మార్చు]1.
మొదటి భాగములను – పదునైన దృష్టితో
చదివి పంపినట్టి – స్పందనలకు
బ్రతుకు ధన్యమయ్యె – శతకోటి వందనాల్
ఆకురాతి మాట అణు బరాట !!
2.
ఒరుల బోడిచేయు – తిరువేంకటాద్రికే
అంట కత్తిరేసి – రైన వాళ్ళె
దొంగ కొంపలోన – దొంగలు పడ్డట్టు
ఆకురాతి మాట అణు బరాట !!
3.
వివిధ మతములెన్ని – భువిని వర్ధిల్లినా
మౌఢ్యమంటనట్టి – మతము లేదు
కోతులన్నిటికిని – మూతులు వంకరే
ఆకురాతి మాట అణు బరాట !!
4. గుడికి ప్రక్క నుండు – గోదారిలో మున్గి
పంది చేసె నంట – ప్రదక్షిణలు
పాడు మూఢ భక్తి – పందికీ సోకెనా ?
ఆకురాతి మాట అణు బరాట !!
5.
కప్ప శోభనాలు – గాడ్దెల పెళ్లిళ్లు
జనులు చేయు పల్లె – జాతరలకు
సంతు పుట్టు గాని – జడివాన పట్టునా ?
ఆకురాతి మాట అణు బరాట !!
6.
మళ్ళి మళ్ళి వచ్చు – మహి సూర్య గ్రహణాలు
గడియ వేసి యుంచు గుడికి – స్వామి
ఊపిరుంటె బ్రతుకు – ఉప్పమ్ము కొనియైన
ఆకురాతి మాట అణు బరాట !!
7.
ఎలుక దున్నపోతు – ఎద్దుపై గద్దపై
ఎక్కి తిరుగు వేల్పు – డొక్కులంత
నభ విహారులైన – సరులకు లోకువే
ఆకురాతి మాట అణు బరాట !!
8.
వ్యయముచేసి డబ్బు – యజ్ఞాలు చేస్తిరే
వర్షమేది యనుచు – వగతురేల
కోపదారి మగడు – కోరినపు డొచ్చునా ?
ఆకురాతి మాట అణు బరాట !!
9.
ప్రబలకీర్తి గొన్న – ప్రాచీన గుడులన్ని
కాల గర్భ మందు – కలిసి పోయె
వాటి వేల్పు లేరి – కాటికి పోయిరా ?
ఆకురాతి మాట అణు బరాట !!
10.
కల్తితాళి బొట్లు – కళ్యాణ మస్తుకా
యేమి కరువు వచ్చె – స్వామి నీకు ?
పాడి మీద డబ్బు – పరి గేరు కొన్నట్లు
ఆకురాతి మాట అణు బరాట !!
11.
అవని దయ్యములకు అల్లాహ్ బెదరేను
సైతానంటె యేసు – చచ్చి బ్రతుకు
గ్రహణ మంటె విష్ణు – గజగజ వణకేను
ఆకురాతి మాట అణు బరాట !!
12.
గుడులు కొల్లలుండ – బడియాట స్థలములా ?
యజ్ఞముల కటంచు – యాష్టపోకు
చచ్చు మగడు ఎచ్చట – శయనిస్తె నీకేమి ?
ఆకురాతి మాట అణు బరాట !!
13.
కొంగ జపము చేయు – దొంగ బాబాకాళ్ళ
వద్ద మోకరిల్లు – పెద్ద లార ?
గుంట నక్క కెలుగు బంటి – దాసోహమా ?
ఆకురాతి మాట అణు బరాట !!
14.
వడ్డి కాసు లోని – వజ్రాల నగలన్ని
కుదువ కట్లకేగి – కుదురు కొనియె
పొంగి పొంగి పాలు – పొయ్యి పాలైనట్లు
ఆకురాతి మాట అణు బరాట !!
15.
అల రికార్డు డాన్సు – అశ్లీలమై దోచు
ఖ్యాతి గొన్న చిత్ర – బూతు ముందు
పేదవాడి భార్య – పెద్ద కేటన్నట్లు
ఆకురాతి మాట అణు బరాట !!
16.
బొంది తోడ స్వర్గ – మందింప గల స్వాము
లెందరో కలరట – ఇండియాలో
ఎయిడ్స్ వ్యాధి లాగ – ఎప్పుడూ లభ్యమే
ఆకురాతి మాట అణు బరాట !!
17.
చిత్ర సీమ బాట – చిలిపి కన్నెల వేట
శోభనాల తీట – జోలపాట
మోజుతీర నేర్పు – మొగుడు పెళ్లాలాట
ఆకురాతి మాట అణు బరాట !!
18.
ప్రేమ కిష్టపడని పిల్లపై కసిబూని
దాడి చేయు వాడె – దగ్ధమగును
నిప్పుజోలికేగి – నీల్గి చచ్చిన రీతి
ఆకురాతి మాట అణు బరాట !!
19.
కుక్క తిరుపతేగ – గొప్ప సింహం కాదు
కాశికేగ పంది – గజము కాదు
శబరిమలయి కేగ – సాలభంబు సిలకౌనె
ఆకురాతి మాట అణు బరాట !!
20.
సమ్మె దాడులందు – సర్కారు సొమ్మందు
రేప్ చేయుటందు – రేసులందు
తలను దూర్చువాడు – పులివాత పడ్డట్లె
ఆకురాతి మాట అణు బరాట !!
21.
చంద్రయాన వేళ – శాస్త్రవేత్తలు పోయి
గుడికి మొక్కుటెంత – గుడ్డి తనము
గగన యానమునకు – గాడిద సాయమా ?
ఆకురాతి మాట అణు బరాట !!
22.
సిగ్గు విడిచినట్టి – సివిలింజనీయర్లె
తగ్గి వాస్తువైపు – మొగ్గు చుండ్రు
పంది బురద నొదిలి – బ్రతుక లేదన్నట్లు
ఆకురాతి మాట అణు బరాట !!
23.
ఆస్తికునకు వచ్చు – ఆదాయ మదియేమి ?
నాస్తికునకు జరుగు – నష్టమేమి ?
భక్తి భ్రమలలో స్వ – శక్తిని కోల్పోకు
ఆకురాతి మాట అణు బరాట !!
24.
నవగ్రహాల కేసి – భువి జీవ రాసుల
అంట కట్టి నారు – ఆది ఋషులు
కోళ్ళ పట్టి చికెను – కొట్ల కేసిన రీతి
ఆకురాతి మాట అణు బరాట !!
25.
అగ్రదేశములకు – ఆగ్రహం తెప్పించు
ఉగ్రవాదమునకు – వూత మేల ?
సానుభూతి క్రూర – సర్పాల మీదనా ?
ఆకురాతి మాట అణు బరాట !!
26.
తాము దాల్చిలబ్ది – బాముకోవచ్చుగా
వొరుల మీద రుద్దు – దురదయేల
రంగురాళ్ళు బ్రతుకు – రాతలు వ్రాయునా ?
ఆకురాతి మాట అణు బరాట !!
మూస:Col-3
27.
మూఢనమ్మకాల్లో – మునిగిన స్త్రీ వల్ల
భర్త చెడును బిడ్డ – భవిత చెడును
తాను చెడ్డ కోతి – వనమెల్ల చెరచదా
ఆకురాతి మాట అణు బరాట !!
28.
నోరు వాయి లేని – భూరి దేవుళ్ళకు
బూతు పులిమినారు – రోత కవులు
దిక్కులేని శవము – కుక్కలు తిన్నట్లు
ఆకురాతి మాట అణు బరాట !!
29.
చక్క గుంటె నడత – సంసార కొంపలకు
ఎట్టులంటు కొనును – ఎయిడ్స్ వ్యాధి ?
దారి యిడక కుక్క – దూరునా వంటింట
ఆకురాతి మాట అణు బరాట !!
30.
గడ్డి తినెడు వేళ – కండోము దాల్చని
కాముకులకు ఎడ్స్ – గాలి సోకు
చాప క్రింది నీరు – కాపురాలే కూలు
ఆకురాతి మాట అణు బరాట !!
31.
లేడి కూన మీద – రేసుకుక్కల భంగి
కన్నె పిల్ల మీద – కాముకేళి
తగిన దండ నుంటె – తెగియింతురా యిట్లు
ఆకురాతి మాట అణు బరాట !!
32.
అంటరాని తనము – అన్నింట దూరినా
లంజి తనము కాడ – రాదు అడ్డు
కుల మతాల దెపుడు – గుడ్డెద్దు పోకడే
ఆకురాతి మాట అణు బరాట !!
33.
అధిక నల్ల డబ్బు – అఙ్ఞాత భక్తుండు
హుండి లోన వేసి – ఉడాయించు
పిల్లివోలె మోక్ష – పీఠాన్ని కాజేయ
ఆకురాతి మాట అణు బరాట !!
34.
మనిషి చచ్చి పోవు – మరుజన్మకందురే
పిండ మెవరి కోయి – పిచ్చి నాన్న ?
కపట బాపనయ్య – కాకుల జూపెనా
ఆకురాతి మాట అణు బరాట !!
35.
మానవత్వమునకు – మచ్చు తునకైనట్టి
కన్నవారి మీద – కరుణ మరచి
మానవుండు తిరిగి – వానరుడగు చుండె
ఆకురాతి మాట అణు బరాట !!
36.
రాజశేఖరుణ్ణి రక్షింపుమని యేడ్చి
కాళ్ళ వేళ్ళ బడియు – ఖంగుతిన్న
మతము లన్నియింక – బ్రతుకుట దండుగే
ఆకురాతి మాట అణు బరాట !!
37.
బొజ్జ గణపతుల – నిమజ్జన వేళల్లో
కొన్ని ప్రాణులైన – మన్ను కలయు
తోడు లేక పోదు – దొడ్డ పీన్గన్నట్లు
ఆకురాతి మాట అణు బరాట !!
38.
పరమ నిష్టలెన్నొ – పాటించు రంజాను
ముగియగానే నడత – మొదటికొచ్చు
రాయి గుద్దుకున్న – రబ్బరు బంతిలా
ఆకురాతి మాట అణు బరాట !!
39.
తనువులుండు వరకు తప్పవీ దుః ఖాలు
తనువునే త్యజింప – మనిరి మునులు
మూషికాలు కొంప – మూసేయమన్నట్లు
ఆకురాతి మాట అణు బరాట !!
40.
కాటు వేయు నాగు – కలిమినందించునా ?
నమ్మి కొలుచు ముద్దు – గుమ్మలార
అద్దమేల నమ్మ – అరచేతి గాజులకు
ఆకురాతి మాట అణు బరాట !!
41.
దొడ్డ దేవతలకు – బిడ్డల బలియిచ్చి
నిధుల కోరుకొనెడి – అధములార
నిధుల మూట, తల్లి – ఉదర మందున్నదా ?
ఆకురాతి మాట అణు బరాట !!
42.
చెట్లు చేమలెపుడు – ఛేదించు మూకకు
వేప రాగి చెట్లు – వేల్పులయ్యె
బాతుగుడ్లలోన పసిడి కన్గొన్నట్లు
ఆకురాతి మాట అణు బరాట !!
43.
ఉల్లి తల్లి కాదు – ఉంచుకున్నది, భార్య
కాదు, భక్తి మోక్ష గామి కాదు
నేతి బీర చూపి – నెయ్యంటె చెల్లునా ?
ఆకురాతి మాట అణు బరాట !!
44.
అక్రమాలకేగి – ఆస్తి పరుడై నోడు
చిక్క కుండ పోదు – సి. బి. ఐ కి
దొంగదైన కుక్క – దొరికి పోకుండునా ?
ఆకురాతి మాట అణు బరాట !!
45.
జడలు వీడిపోయె – జాకెట్లు మరుగాయె
వంటి మీది చీర – వలస బోయె
నాతి సిగ్గు దాగె – ఈత దుస్తుల్లోన
ఆకురాతి మాట అణు బరాట !!
46.
మళ్ళి పుట్టి నట్టి – “మగధీర” ( సినిమా ) తెల్పు
మళ్ళి వత్తుమనుచు – వెళ్ళి నట్టి
యేసు బ్రహ్మగార్ల – కేమాయె రారైరి?
ఆకురాతి మాట అణు బరాట !!
47.
తాళి యుండు వరకె – తరుణి కాహ్వానాలు
తాళి తెగిన దాని – దలపరేమి ?
తాళికున్న విలువ – తరుణికి యివ్వరా ?
ఆకురాతి మాట అణు బరాట !!
48.
రేప్ చేయ నేర్పు – దోపిడీలను నేర్పు
గెంత నేర్పు, కౌగి లింత నేర్పు
ఇంత కంటె నేర్వ – నేముంది సినిమాల్లో
ఆకురాతి మాట అణు బరాట !!
49.
అంధ యుగము నాటి – ఆచారమైనట్టి
బుడుగు వయసులోన – వడుగు లేమి ?
వడుగు చేయ కుంటె – వచ్చు కీడేమిటో ?
ఆకురాతి మాట అణు బరాట !!
50.
సైన్సు యేడ్చు మూఢ – శాస్త్రజ్ఞులను గాంచి
కోరి కోరి చేసుకున్న మగడు
సాని వెంట పడితె – సతులేడ్చు కొన్నట్లు
ఆకురాతి మాట అణు బరాట !!
51.
ధరణి పడ్డనాడె – దాత రాసిండని
భక్తి పంచజేరి – బాధపడకు
కట్టివేయబడిన – గాడిద కైవడిన్
ఆకురాతి మాట అణు బరాట !!
52.
నాగరీకమైన – నైటీలు బయదిల్లి
చీర లాగి వైచె – సిగ్గుతీయ
పాత మొగుడి తోటి – పండుగా యన్నట్లు ?
ఆకురాతి మాట అణు బరాట !!
మూస:Col-3
53.
వ్రతము చేయగానె – బ్రతుకులు మారవు
క్రతువు చూచి వర్ష – రుతువు రాదు
మాయ మంత్రములకు – మానునా గాయాలు ?
ఆకురాతి మాట అణు బరాట !!
54.
సైన్సు యుగములోన – చాదస్తయుతమైన
యేమిటీ ప్రచార – మేసుదేవ
పాతకములు చేసి – ప్రార్ధిస్తె పోవునా
ఆకురాతి మాట అణు బరాట !!
55.
తనువు మీది నగలు – తాకట్టు కేగినే
సంకటంబదేమి – వేంకటేశ ?
ఉన్న పరువు కాస్త – ఊడ్చుకు పోయెనే
ఆకురాతి మాట అణు బరాట !!
56.
తేనెకార్చు చున్న – తెలిబూది రాల్చినా
విగ్రహాలు చూపు – వింతలన్ని
కేటుగాళ్ళు చేయు – కిటుకులే కదస్వామి
ఆకురాతి మాట అణు బరాట !!
57.
మదిని దైవ బక్త యొదిగి యున్నన్నాళ్ళు
వాస్తవాల చెవుల – వాలనీదు
దుక్కి టెడ్ల గాట – కుక్క చేరిన రీతి
ఆకురాతి మాట అణు బరాట !!
58.
జాతరనుచు రేగి – జగదాంబ గుడి ముందు
త్రాగు బోతు లెగసి – మూగ ప్రాణి
పీక కోయగానె – దూకునా వర్షాలు ?
ఆకురాతి మాట అణు బరాట !!
59.
తనను జేరవస్తు దారి దుర్ఘటనలో
చచ్చినట్టి బక్త జనుల బ్రోవ
చేతకాని వాడు – జాతికి దేవుడా ?
ఆకురాతి మాట అణు బరాట !!
60.
బోరుబావు లిపుడు – నీరివ్వడం మాని
బాలల కబళించు – బాట పట్టె
స్కాన్ల వేట కాడ – కూనల్ బలైనట్లు
ఆకురాతి మాట అణు బరాట !!
61.
భక్తి పారవశ్య – ముక్తి యాత్రల్లోన
దారి పోడవు దైవ – దర్శనాలు
కడకు యాక్సిడెంట్లు – కైలాస టిక్కెట్లు
ఆకురాతి మాట అణు బరాట !!
62.
త్రాగుడులకు నాన్న – తగలేయ డబ్బంత
వున్న అడుగు బొడుగు ఊడ్చి తెచ్చి
అమ్మ ఆలయాల – కర్పించి కూర్చుండు
ఆకురాతి మాట అణు బరాట !!
63.
అల స్వమూత్ర పాన – మౌషధం బయి పోయె
ఆవు పంచితమ్ము – అమృత మాయె
పంది మూత్రమేల – పనికి రాదయ్యేనో ?
ఆకురాతి మాట అణు బరాట !!
64.
బోడి గుండు కున్ను – మోకాటి చిప్పలకు
ముడులు పెట్టినారు – బడుగు మునులు
నభగ్రహాలు వచ్చి – నరుల వేటాడునా
ఆకురాతి మాట అణు బరాట !!
65.
రుషుల బోధ లైన – రుగ్వేద పలుకైన
పనికిరాని చెత్త – పనలు కట్టి
పెంట కుప్ప కెత్తి – పీడ వదిలించుకో
ఆకురాతి మాట అణు బరాట !!
66.
సంబరంగ చేయు – సామూహ పెళ్ళిళ్ళు
స్వావలంబనాన్ని – చంపి వేయు
కుక్కలదుపు సేయ – ముక్కలు రాల్చేరు
ఆకురాతి మాట అణు బరాట !!
67.
నన్స్ పెదవి మీద – నాజూకు ముద్దిచ్చి
పలకరింతురంట – ఫాదరీలు
ముద్దు పెట్ట కుంటె - ముదరదా పెను భక్తి ?
ఆకురాతి మాట అణు బరాట !!
68.
మతములన్ని సంకు - చిత ఙ్ఞాన పరిధికే
గిడసబారి పోయి – ముడుచు కొనియె
మంద బుద్ది స్త్రీలు – మడి కట్టు కున్నట్లు
ఆకురాతి మాట అణు బరాట !!
69.
పూర్వ జన్మ స్మృతులు – పుట్టుకొచ్చా యిపుడు
“దలైలామ” గారి – తలపులోకి
మృత్యువేళ చుట్టు – ముట్టు యమభటులల్లె
ఆకురాతి మాట అణు బరాట !!
70.
కలియుగాంత మనుచు – కడతేరు దినమంచు
కమ్ముకొన్న ఈ పుకార్ల నెల్ల
సొమ్ము చేసు కొనెడి సోగ్గాళ్ళ దే హవా
ఆకురాతి మాట అణు బరాట !!
71.
అంగడోళ్ళ మీది – దొంగాధికారులే
ప్రభుతను పడకూల్చు – పతిత మహిళ
దగడి పంచ జేరి – మగని చంపిన రీతి
ఆకురాతి మాట అణు బరాట !!
72.
హెల్త్ పాడు చేయు – కల్తీల సరుకమ్మి
లాభ మంద జూచు – లోభులార
సాటి కొంప కాల్చి – చలికాచు కొందురా ?
ఆకురాతి మాట అణు బరాట !!
73.
పేరు మోసినట్టి – పెద్ద ఆఫీసుల్లో
కాసులుండు వాడె – కాలుమోపు
అట మొసళ్ళ మేప – అందరి సాధ్యమా ?
ఆకురాతి మాట అణు బరాట !!
74.
ముష్టి డబ్బు కొరకు – మూత్ర పిండాలనే
అమ్ము కొనుచు నుండు – అర్భకులకు
ఓటు అమ్ముకొనుట – ఒక పెద్ద లెక్కయా ?
ఆకురాతి మాట అణు బరాట !!
75.
బెల్ట్ షాపులున్ను – మల్టీ పొగాకున్ను
వేశ్య కొంపలున్ను – వేల్పులున్ను
నరుల పీక్కు తినెడి – చిరకాల రక్కసుల్
ఆకురాతి మాట అణు బరాట !!
76.
పదవి దక్కగానె – ప్రజల నొగ్గేసేటి
నేత లెక్కువైరి – నేటి యువత
కన్నవారి బ్రతుకు – గాలి కొదిలిన రీతి
ఆకురాతి మాట అణు బరాట !!
77.
భీతి లేని పదవి – జీతమా అరలక్ష
విధుల నెపుడు నిర్వ – హించబోరు
పగలు రేయి కూడ –పైలాభ చింతయే
ఆకురాతి మాట అణు బరాట !!
మూస:Col-3
అక్రమాలు – అవినీతి – దురలవాట్లు
[మార్చు]78.
పదవి కొరకు నీవు – పార్టీ ఫిరాయిస్తె
సరసుడైన శాల్తి – సతుల మార్పు
మగని మార్పు కోర – మగువకు తగనిదా ?
ఆకురాతి మాట అణు బరాట !!
79.
భర్త పోయిన వేరు – భర్త నందగవచ్చు
భార్య పోవ తిరిగి – బడయవచ్చు
యుండగానె భార్య – ముండల వేటేల ?
ఆకురాతి మాట అణు బరాట !!
80.
శ్రమను దోచుకొనుచు – చచ్చేటి పేదలకు
దానమిచ్చువాడు - దాతకాడు
పెంటమీద నిలచి – సెంటలము కొన్నట్లు
ఆకురాతి మాట అణు బరాట !!
81.
ప్రేమ దోమయనెడి – ప్రియునికి కౌగిళ్ళ
విందులీయబోకు – ముందుగానె
కులికి యీసడించు – కూర కరివేప లా
ఆకురాతి మాట అణు బరాట !!
82. ప్రేమ లొలుక బోయు – పెళ్లి సీమంతాల
సందడల్లె చేస్తె – సాముహికపు
శోభనాలు కూడ – చూచి తరించమా
ఆకురాతి మాట అణు బరాట !!
83.
చెరుప వేశ్య సుబ్బి – శెట్టి గుగ్గిళ్ళమ్మె
జూదమాడి ధర్మ – జుండు చెడియె
కామ వాంఛ తోడ – కడతేరె రావణు
ఆకురాతి మాట అణు బరాట !!
84.
తేలు బొమ్మచించి – తీసేసి గుట్కాలు
నమలి మ్రింగుచున్న – నరుల కిపుడు
కుట్టు వరకు తేళ్ళు – కుమ్మరి పురుగులే
ఆకురాతి మాట అణు బరాట !!
85.
దళితుడున్నతంది – తనవారి మరచుచో
అగ్రవర్ణ మెట్ల – నుగ్రహించు ?
తల్లి కోడి తరుమ – పిల్లి యోదార్చునా ?
ఆకురాతి మాట అణు బరాట !!
మూస:Col-3
86.
శాఖములను తినుచు – మేకల వదలినా
తరుగు కూరలందు – పురుగులుండు
మానివేయహింస – మనిషికి సాద్యమా ?
ఆకురాతి మాట అణు బరాట !!
87.
వ్యాధి నయము చేయ – వైద్యాలయములుండ
మాంత్రికులను చేరు – మౌఢ్యమేల ?
గుడ్డలుతుక మురికి – గుంటే శరణ్యమా ?
ఆకురాతి మాట అణు బరాట !!
88.
బక్క ప్రాణులన్న – మొక్కు దేవుళ్ళన్న
పరుల ధనములన్న – పడతులన్న
కండ చక్కెరల్లె – కబళించు గూండాలు
ఆకురాతి మాట అణు బరాట !!
89.
మందు మాకు లేదు – మరలు ప్రశ్నే లేదు
ఏడ్స్ భూత దాడి – కెదురు లేదు
భార్య పవిట క్రింద – ప్రాణాలు దాచుకో
ఆకురాతి మాట అణు బరాట !!
90.
నిండు జీవితాన్ని – గుండాయి జమ్ములో
క్షతియొనర్చు వాడు – బ్రతక లేడు
కరచుకుక్క బ్రతుకు – దొరకు నందాకనే
ఆకురాతి మాట అణు బరాట !!
91.
కల్తిసార మృతులు – కళ్ల పడ్డపుడెల్ల
కావు కావు నేడ్చు – కాకి ప్రభుత
ఎద్దు పుండు కాకి – కెంత ముద్దాయెనో ?
ఆకురాతి మాట అణు బరాట !!
92.
పెట్టు జనములుండ – భిక్షాటనము పోదు
దానములకు పేద – తన మణగదు
ఆజ్యమందుచుండ – అగ్గి చల్లారునా ?
ఆకురాతి మాట అణు బరాట !!
మూస:Col-3
93.
చెట్లు చేమలన్ని – ఛేదించి ఛేదించి
పచ్చదనము నంత – పాడు చేయ
కరగు మేఘమాల కన్నెర్ర చేయదా ?
ఆకురాతి మాట అణు బరాట !!
94.
రేపులున్ను ఫైట్లు – లేటెష్టు సీన్లతో
చిత్ర సీమ కీర్తి – శిఖర మాయె
ఆడదాని పరువు – అంగళ్ళ పాలాయె
ఆకురాతి మాట అణు బరాట !!
95.
కడుపు నిండ పశువు – గడ్డి తెమ్మని కోరు
మగువ యోగ్యుడైన – మగనికోరు
పిసిని గొట్టు వరుడు – లెసకట్నమడుగురా
ఆకురాతి మాట అణు బరాట !!
96.
కుల రిజర్వులెట్టి – కుల సంఘములు కట్టి
కులము పేర పత్రికలను నడపు
కుళ్ళు రాజకీయ – మొళ్లు మండింపదా
ఆకురాతి మాట అణు బరాట !!
97.
మనువు గొప్పదియని – ధన పిపాసుల యింట
పేదకన్న తండ్రి – బిడ్డ నిస్తె
అల కసాయి చేత –అర కోడి పడ్డట్లె
ఆకురాతి మాట అణు బరాట !!
98.
బడిని మాన్పియింటి – పనులు చేయంచేటి
తండ్రి కూల్చి వేయ – తనయ బ్రతుకు
పెల్లు యాకటి పులి – పిల్లల తిన్నట్లు
ఆకురాతి మాట అణు బరాట !!
మూస:Col-3
జాతిరత్నాలు
[మార్చు]99.
సత్యన్యాయ ధర్మ – సంచితం బైనట్టి
నీతి కల్గియుండు – హేతు వాది
హేతు వాది యెపుడు – జాతికి రత్నమే
ఆకురాతి మాట అణు బరాట !!
100.
అస్తి కత్వ మంత – అంధవిశ్వాసాలు
నాస్తి కత్వమంత – వాస్తవాలు
కాస్తమనసు నిల్చి – వాస్తవం తెలిసికో
ఆకురాతి మాట అణు బరాట !!
101.
కావు కావుమనెడి – కాకుల రొదలోన
కోకిలమ్మ తీపి – గొంతు పగిది
హేతువాది పల్కు – ఎటనున్న వజ్రమే
ఆకురాతి మాట అణు బరాట !!
మూస:Col-3
102.
హేతు వాద దృష్టి – యెదగని మదిలోన
మూఢ నమ్మకాలు – గూడు కట్టు
శుద్ది లేని యింట – బొద్దింక లున్నట్లు
ఆకురాతి మాట అణు బరాట !!
103.
పుట్టి పుట్టగానె – యిట్టె కబళింపంగ
భక్తి కొలను లోన – బలసి తిరుగు
మత మొసళ్ళ గెలుచు – మనుజులే నాస్తికుల్
ఆకురాతి మాట అణు బరాట !!
104.
అపర శాంత మూర్తి – ఆధ్యాత్మికుండనకు
నాస్తికునకు హింస – నైజమునకు
ఒరువు వేయకుండ – సరకు ప్రోగేతువా ?
ఆకురాతి మాట అణు బరాట !!
మూస:Col-3
105.
సైన్సు చేయు మేలు – జగమెరింగిన నాడు
మతములన్ని చచ్చి – చితికి చేరు
నింగి సూర్యుడెగయ – నిలచునా చీకటుల్ ?
ఆకురాతి మాట అణు బరాట !!
మూస:Col-3
సమసమాజం కావాలా ?
[మార్చు]106.
రైతు కూలి శ్రమను – రంజు గాదోచుకొని
ధనికులెదుగుచున్న – ధరణి మీద
సమ సమాజ బాట – భ్రమలమూటేనోయి
ఆకురాతి మాట అణు బరాట !!
107.
తరతరాలనాడు తస్కరించిన భూము
లెంచి శ్రామికులకు – పంచువరకు
ఆకటి మరణాలు – అదుపు కొచ్చుట కల్ల
ఆకురాతి మాట అణు బరాట !!
108.
వర్గ ఉద్యమాలు – వంచవలనే గాని
బ్రతిమలాట కాస్తి – పంచబోరు
రక్కకుంటె చెరకు – చక్కెర రాల్చునా ?
ఆకురాతి మాట అణు బరాట !!
మూస:Col-3
109.
ఆకలి పొలికేక – లాప కల్గే కిటుకు
కార్లమార్క్సు లెనిను – గార్ల కెరుక
కొయ్యవంకలన్ని – పొయ్యికే అవగతం
ఆకురాతి మాట అణు బరాట !!
110.
కార్లమార్క్సు లెనిను – ఘటికులౌ ఏంగిల్స్
బుర్రలందు పుట్టి – పుంజుకున్న
సోషలిజమె సకల – దోషాల కౌషదం
ఆకురాతి మాట అణు బరాట !!
మూస:Col-3
111.
ఆకలి పెనుమంట – లార్ప కలిగిననాడె
మూఢ మతములన్ని – ముసుగుతన్ను
సమ సమాజమునకు – సరి బాటలేర్పడున్
ఆకురాతి మాట అణు బరాట !!
112.
వరస విప్లవాలు – వర్ధిల్లినప్పుడే
కలలు కనెడి – మిలకుదిగును
మూఢ నమ్మకాల – పీడయున్ విరగడౌ
ఆకురాతి మాట అణు బరాట !!
మూస:Col-3
అక్రమ సెక్సు
[మార్చు]సీ || |
సీ || |
నేతి బీర
[మార్చు]
సీ ||
అనసూయ ఉడికించె – యినుప గుగ్గిళ్ళను
సావిత్రి యమునితో – జగడమాడె
సుమతి శాపంబుతో – సూర్యుణ్ణి నిలవేసె
అగ్గిలో సీతమ్మ – నిగ్గుతేలె
ద్రౌపదిని కాపాడ – దైవమే దిగివచ్చె
కుంతి దేవుళ్ళకే – సంతుకనియె
ఆడదే లేకుండ – అయ్యప్ప జన్మించె
మగ పొందు లేకయే – మరియ కనియె
తే || గీ ||
నాటి వనితల మహిమకు – దీటుకొని
నేటి మహిళను పతితగా – నిలుప వలెనె
అతివలకు లేని గొప్పల – నంటగట్టి
నేతి బీరను చేసిరి – నాతి బ్రతుకు ||
నాటు కుక్కలు
[మార్చు]సీ ||
ఆటలాడు కొనెడి – అతి చిన్న వయసునే
చిట్టి గొంతుకు తాళి – కట్టినారు
పైసల కాసించి – పండు ముదుసలి కిచ్చి
చేసి కన్యల గొంతు – కోసినారు
దుష్టు డైనా మగడు – దుర్మార్గుడైననూ
పడియుండ వలెనంచు – నుడివినారు
కడకు చచ్చిన భర్త – కాయమ్ముతో సతిని
కాష్టమ్ములో వేసి – కాల్చినారు
ఆ || వె ||
విధవ రాళ్ళ చేసి – నుదిటి కుంకుమ దీయ
మోము చూపలేని – ముదిత నిపుడు
కాటు వేయ జూచు – నాటు కుక్కలు తప్ప
మనువు కొప్పు కొనెడి – ఘనులు కలరె ?
ఈ పేజి లైసెన్స్ సమాచారం ప్రకటించుట లేదు. లైసెన్స్ సమాచారం పేజీలు లేని పేజీలు తొలగింపు కు ప్రతిపాదించబడవచ్చు. మీరు సహాయపడడానికి Help:Copyright tags or వ్యాఖ్య చూడండి. |