తెనాలి రామకృష్ణకవి చరిత్రము/పాండురంగ మహాత్మ్యము

వికీసోర్స్ నుండి

మున కేగినారా లేదా? నిజము చెప్పుడు లేనిచో రాయలకీ సమాచారము దెలిపితీరుద' ననఁగా తాతాచార్యులవారు 'రామకృష్ణా! నీవు దేవాంతక నరాంతకుడవు. నీతో నసత్య జెప్పినచో లాభము లేదు. వారవనితా గృహమునకు నేనేగినది సత్యమేకాని నీ పుణ్యమా యని యెవరితోడనుజెప్పి, నన్నపహాస్యము పాలుచేయకుము' అని - బ్రతిమాలిరి.

'అట్లయిన నన్నెత్తుకొని యిటునటు త్రిప్పుడు' అని రామకృష్ణుడు పలుక, చేయునది లేక తాతాచార్యుల వా రాతనిని భుజములపై నెక్కించుకొని యటునిటు తిరుగసాగిరి. అంతఃపుర సౌధముపై నున్న రాయలదిచూచి భటుల బిలిపించి 'ఓరీ! అడుగో ! తాతాచార్యులవారి భుజములపై రామకృష్ణు డెక్కినాడు. వెంటనే వాని నిటు లీడ్చుకొనిరని డనెను. రాయలు సంజ్ఞచేయుట చూచిన రామకృష్ణుడు వెంటనే క్రిందకురికి 'ఆచార్యులవారూ ! మహాపరాధిని క్షమింపుడు. మిమ్ము నేనెత్తుకొందును' అని ఆయన వలదనుచున్నను యెత్తుకొని గంతులు వేయసాగెను. ఇంతలో భటులువచ్చి, రామకృష్ణుని భుజములపై నెక్కియున్న తాతాచార్యులవారినిఁ గ్రిందఁ బడద్రోసి యీడ్చుకోనిపోయిరి. రాయలు ఇదియేమిపనిరా! తాతాచార్యుల వారిని గొనివచ్చిరి?' అని భటులనడుగ, వారు 'మహారాజా! పైనున్న వానినేగదా తాము తీసుకొని రమ్మని సెలవిచ్చినది?' అని యనిరి. రామకృష్ణుని యుపాయమునకు విస్మితుడై రాయలు మన్నించెను.


33 పాండురంగ మహాత్మ్యము

తెనాలి రామకృష్ణకవికి మొదట రామలింగమను పేరుగూడ కలదనియు, నితఁడు శివభక్తియుక్తుడై లింగపురాణము నాంద్రీకరించె ననియు గొందరు చరిత్రకారులు చెప్పుదురు గాని యీతడు రచించెనని చెప్పబడుచున్న లింగపురాంధ్రీకరణగ్రంథ మిప్పుడెచ్చటను గానరాదు. కాని యీతని విరచితములైన చాటుపద్యములలో గొన్నిటియందు రామలింగమనియే ప్రయోగించుకొని యున్నాడు.

ఉ. లింగనిషిద్ధుఁగల్వలచెంగని మేచకకందరుంద్రిశూ
     లింగని, సంగ తాళిలవలింగని కర్థమదూషితన్మృణా
     లింగనిఁ కృష్ణచేలుని హలింగని నీలక చన్ విధాతృనా -
     లింగని, రామలింగకవి లింగనికీర్తి హసించుదిక్కులన్.

పాండురంగ మహాత్మ్యము నీతడు గొన్నాళయినపిదప విష్ణుభక్తుడై విరచించెనని చెప్పుదురు. ఈ యుత్తమ కావ్యమును రామకృష్ణకవి యొక జాగీరుదారయిన పెదసంగమరాజుకడ ప్రధానిగా నుండిన విరూరివేదాద్రి కంకిత మొసంగెనని ఈ క్రిందిపద్యమువలన బ్రస్ఫుటమగుచున్నది. ఈ విరూరివేదాద్రిగురువు కందాళయప్పలాచార్యులవారు. ఈయన సారంగుతమ్మకవికిని గురువై యుండెను.

సీ. 'వేదమార్గ ప్రతిష్టాదైవత జ్యేష్ఠుఁ
               డభ్యస్త షడ్దర్శనార్థరాశి
     యతిరాజరిచిత భాష్య గ్రంథనిర్ణేత
               యఖిల పురాణేతిహాసకర్త
     బంధుర దివ్య ప్రబంధానుసంధాత
               పంచసంస్కార ప్రపంచచణుఁడు
     వాధూల మునిచంద్ర వంశవర్థనమూర్తి
               సకలదేశాచార్య నికరగురువు

గీ. పట్టమేనుంగు శ్రీరంగపతికినణ్ణ
    గారిగరాంబురాశి నాహారరస్మి

సారసాహిత్య సర్వస్వశయ్య పేటి
యావళందారు కందాలయప్పగారు. '

విరూర వేదాద్రినిగురించి ----

సీ. తనకులాచారవర్తన వైష్ణవాచార
               పర్యాయముల కొజ్జబంతియనగఁ
    దన సూనృతము పురాతన సత్యనిధులయు
               న్నతికిఁ బునఁప్రతిష్ఠితముగాగఁ
    దనబుద్ధి నీతిశాస్త్రరహస్యములు
               తెల్లముగఁ దెల్పునాఖ్యానసముద్రగాగఁ,
    దనవాయుగంటబు మొనవాఁడివిశ్వంభ
              రాప్రజలకుఁ బ్రాణరక్షగాగ

గీ. వెలయుమంగయ గురువగు విభునిపెద్ద
    నంగభూపాలమణి వాయనప్రవర్త
    అయయుతుండైన రామానుజయ్యసుతుడు
    భద్రచారి విరూరి వేదాద్రిశౌరి.

పాండురంగ మహాత్మ్యము నందలి

ప్రబంధ పద్యరత్నములు

సీ. అవతారమందె నే యఖిలైక జనమంత్రి
              కలశరత్నాకర గర్భభీమ
    దోబుట్టువయ్యె నే తులత కాంచనవర్ణ
              వెలదివెన్నెలగాయు వేల్పునకును
    బాయకయుండు నే పరమపావనమూర్తి
              చక్రిబాహామధ్య సౌధవీధి
    నభిషేకమాడు నే యభివర్ణితాచార
              దిగ్గజానీత మౌ తేటనీట

తే. నవనిధానంబు లేదేని జ.....సరకు
    లమ్మహాదేవి శ్రీ దేవి యాదిలక్ష్మి
    సరసశుభదృష్టి రామానుజయ్యసుతుని
    నాదరించు విరూం వేదాద్రినాథు.

సీ. సూత్రవతీదేవి సొబగుపాలిండ్లపై
                మలుపచ్చిగంధంపు వలపుతోడ
    శిరసులు వంచు నిర్జరుకోటిఁ బనిగొను
                తపనీయ వేత్రహ స్తంబుతోడ
    బనియేమియని విన్నపముసీయు సుమనోర
                ధములయిన దివ్యాయుధములతోడ
    బ్రహ్మాండకోటుల పారుపత్తెములెల్లఁ

తే. శాఙ్గిన్ రెండవమూర్తియై జగములేలు
     మునిమనోహరి శ్రీసేవ ముదలియారి

    చేయుపనులెల్ల సఫలముల్ చేయుఁగాత
    మలరిరామానుజయ్య వేదాద్రిపతికి.

సీ. ధరణీభరముఁదాల్చు తన చేవయంతయు
               భుజనరిఘంబులఁ బొంకపఱచి
    మునుమిన్కుగనియైన తన ప్రజ్ఞ యంతయు
               మతివిశేషమునందు మస్తరించి
    దై తారివశమైన తన చిత్తమంతయు
               నినుచు గౌరవమున నివ్వటించి
    తనువువెన్నెలగాయు తనమూర్తి యంతయుఁ
               గీర్తివైభవమునఁ గీలుకొలిపి

తే. శేషు డఖిలప్రపంచనిశేషశాలి
     నిత్యముక్తుల కాద్యుఁడై నిలుచుమేటి
     చారుచారిత్రు రామానుజయ్యపుత్రుఁ
     గరణవేదాద్రి మంత్రిశేఖరుని మనుదు.

సీ. తనకులాచారవర్తన వైష్ణవాచార
                పర్యాయముల కొజ్జ బంతిగాఁగఁ
    తనసూనృతము పురాతనసత్యనిధుల యు
                న్నతికిఁ బునః ప్రతిష్ఠితముగాఁగఁ
    దనబుద్ధినీతి శాస్త్రరహస్యములు తెల్ల
                ముగ దెల్పువ్యాఖ్యాన ముద్రగాఁగఁ
    దనవ్రాయుగంటంబు మొనవాడి విశ్వంభ
                రాప్రజలకుఁ బ్రాణరక్షగాఁగఁ

తే. వెలయు మంగయ గురువభూవిభుని పెద్ద
    సంఘభూపాలమణి వ్రాయనప్రవృత్తి

    జయయుతుండై న రామానుజయ్యసుతుఁడు
    భద్రగుణసీరి విరూరివేదాద్రిశౌరి.

సీ. సంహృతాంహస్ఫూర్తి సింహాసనుండు నృ
              సింహవిక్రముఁడు నృసింహశౌరి
    త్రయ్యంతవాసనాగ్రహబుద్ది నొయ్యారి
              యొయ్యారి రామానుజయ్యగారు
    గంగాతరంగ సారంగలాంఛనదీప్తిఁ
              బొందుకు కీర్తికి రంగరాజు
    శరణాగతత్రాణ కరుణాచరణ కేళి
              వరదరాజులబోలు వందరాజు

తే. ననఁగ శ్రీరామవిభునికి నంబకున్ను
    గలిగి రాచంద్రతారార్క గతిఁ బ్రశస్తి
    సలువురాత్మజు లౌదార్య సలిలనిధులు
    భుజగ బాయికి నాలుగు భుజములట్లు.

సీ. సమకూర్పఁగా నేర్చు సకలవైష్ణవశాస్త్ర
              సిద్ధాంతశుద్ధాంత సిద్ధిగరిమ
    హవణింపఁగా నేర్చు నఖిలావని చక్ర
              సామ్రాజ్యపూజ్య విశాలలక్ష్మి
    వలసింపఁగా నేర్చు వాలారుఁజూఫుల
              కోపులు చూపు చకోరదృశల
    బాలింపఁగా నేర్చు బాంధవ కవిగాయ
              కార్యార్థినివహంబు నెనుదినంబు

తే. దండనాథునిమాత్రుఁ డె దశదిశావ
     కాశ సంపూర్ణవిజయ ప్రకాశశాలి

     రంగయామాత్యువరదయ్య ప్రకటశౌర్య
     ధారివాచాధర ధారిశయ్య

సీ. పట్టెవట్రువయును బరిపుష్టికట్టు
               గుడిసున్న కియ్యయు సుడియముడియు
    నైత్వంబు నేత్వంబు నందంబు మందంబు
               గిలుకయు బంతులు నిలువు పొలుపు
    నయము నిస్సందేహతయు నొప్పుమురువును
               ద్రచ్చివేశినయట్ల తనరుటయును
    షడ్వర్గశుద్ధియు జాతియోగ్యతయును
              వృద్ధిప్రియంబును విశదగతియు

తే. గీసకొనివ్రాయసంబులు వ్రాయవ్రాయ
    గొంకుకొసరును జేతప్పు గొనకయుండు
    లలితముక్తాఫలాకార విలసనమున
    మతిమరున్మన్త్రి వేదాద్రి మంత్రివరుఁడు.

తే. మాద్రిమీరు విరూరివేదాద్రిరాజు
    దాన ధారార్థ నఖిలప్రధాననదుల
    వెచ్చపెట్టుకిట దలయో విబుధతటిని
    తరుశశిమౌళిజడలలో డాఁగియుండు.

సీ. కరుణించిచూచెనా కవిగాయకార్ధార్థి
                నివహగేహంబుల నెఱయుసిరుల
    కోపించిచూచెనా కొండతో నెనవచ్చు
                ననవచ్చు నతడైన నవనిదూఱు
    మెచ్చి మన్నించెనా మెదుక పాలసుడైన
                దొరతనంబువచ్చి పరిఢవించు

     బొందుగావించెనా భువినెట్టి ఖలునకు
                 నాదట కరుణాప్రసాద మొసంగు

గీ. మంత్రిమాత్రుండై దుర్మంత్రిమధవకధన
    చారుచర్చామత్కార చక్రవర్తి
    యద్రివిభుఁడు విరూరివేదాద్రి రామ
    భద్రపాదసరోరుహ బంభరంబు

సీ. వృషరేంద్రగమనుఁడీ వేదాద్రినాధుండు
               గిరిరాజతనయ యీతిరుమలాంబ
    వేదనిశ్శ్వాశుండు వేదాద్రినాధుండు
               ధృతి శారదాంబ యీతిరుమలాంబ
    విహగేంద్రగమనుఁడీ వేదాద్రినాధుండు
               శరధితనూజ యీతిరుమలాంబ
    విబుధాధినాధుఁడీ వేదాద్రినాధుండు
               ధర శచీదేవి యీతిరుమలాంబ

గీ. యనగననుకూలదాంపత్య వినుతమహిమ
    హరువుదీపించెనౌర వేదాద్రివిభుఁడు
    హరియశుఁడైన కలకాళహస్తితనయ
    తిరుమలాంబయు నిత్యవర్ధిష్ణులక్ష్మీ.

సీ. శ్రీకలోదయవధూలోకానన ప్రభా
               నాటితబహుచంద్ర నాటకంబు
    సమవిర్దగళిత భాషారత్న మంజరీ
               యోజితకధ్యా ప్రపూజనంబు
    కైలాసశైల సంకాశ సౌధనివేశ
               కౌముదీకనచిత గగనతలము

    విస్తీర్ణపణిపనివ్యస్తవస్తువ్రజ
    ప్రకటితరత్న గర్భాజఠరము

తే. విపులపవమానతాండవ వేపమాన
    లాంఛనధ్వజపటల పల్లవలలామ
    మాళిరచితకళాకృత్య హేళిహయము
    దీపితంబగు శ్రీకాశికాపురంబు.

సీ. పద్మినీపద్మాత పత్రంబు శిథిలప
             త్రాగమై రాయంచు యాశ్రయించె
    దాలుస్రవత్ఫేన జాలంబుతో ఘోణీవి
             పంచలరొంపి వలంచి యాడె
    దూరోద్గమద్దావధూమ మంబుదబుద్ధి
             నెమ్మిలోపొదనుండి నిక్కిచూచె
    జఠరస్థజలము నాసానాళమునఁ బీల్చి
             సామజంబిరుప్రక్కఁ జల్లుకొనియె.

తే. నరసిపైనీరు కలకల దెరలి విపిన
    సకలవిధులు నిర్మృగోచ్చయములయ్యె
    మిట్టమధ్యాహ్నమిది సుధామధురవాణి
    యర్హమిచ్చోఁబథశ్రమ మపనయింప.

సీ. వీడియం బెడలించి విధురత్నకనకాలు
                కాంచితాంబువు పుక్కిలించి యుమిసి
     యుదిరి బంగరువ్రాత హొంబట్టు వలెవాటు
                సడలించి వెనఁగట్టి స్థలినిజుట్టి
     యనయాయి పృధుకహస్తాంతరన్య స్తోప
               దోచితార్థము తానె యుద్వహించి

    యంగుళీసంజ్ఞ సమయములఁ బ్రత్యేకంబు
                మునుముల్పలోనికిఁ జననొనర్చి

తే. ద్వారపార్శ్వస్థ వేధికాలువల జరక
    రక్షివర్గంబు టంక్రియారభటి వఱలు
    వలయమకూటాదికంబుగ నిలచిమ్రొక్క
    నగవుఁ జూచుచు నాతఁడు నగరుజొచ్చి

సీ. సనకసనందనాది నిఖలాంతర్వాణి
               హృల్లీనభావంబు సల్లపెట్టి
    విశ్వంభరాభోగ వివిధమూర్త్యంతర
               స్ఫురితానుభావంబు బుటలువైచి
     శింశుమారాకృతి స్వీకృతి వైకుంఠ
               షట్కవిహారంబు జారవిడచి
     క్షీరోజమధ్యస్థలీ రత్నసగజుషా
               గర్భనివాసంబు కచ్చువడలి

తే. పుండరీ కేక్షణుండు శిఖండిబర్హ
     మండితశిఖండకుఁడు సతాఖండలుండు
     పుండరీకుని మానసాంభోపీఠి
     మిండతుమ్మెదయైయుండు నిండుకొలువు.

సీ. తనువుతోఁ జరియించు ధర్మ దేవతవోలె
                  మెలఁపున వనవాటిఁ గలయదిరిగి
    గణనమీరిశాఙ్గి౯ గుణములు హృదయసం
                  పుటినించు క్రియనిరుల్ బుట్టిఁబెట్టి
    తనకుఁ బవిత్రవర్ధనమె కృత్యంబను
                  కరద నూతనకుశోత్కరము గూర్చి
    యపవర్గ ఫలసిద్ధి హణీనైనఁ జేపట్టు
                  కైవడి బహుఫలోత్కరము లొడిచి

తే. యోగయాగంబుసలుపుచో నూర్మిపశువి
    శంసనమొనరించుటకు యూప సమితదెచ్చు
    భాతిసమిధలుగొని మహాప్రాజ్ఞుడతడు
    వచ్చులేఁ బగటికి నిజావాసమునకు.

సీ. యతిమనోగృహదీపి కాంకూరమగులీల
               గోవర్థనాచల గుహమెలఁగుచు
    గిరికూబతటరట త్కేకిరాజమురీతి
               రాధగన్దనమీద వ్రాలి నగుచు
    జిత్రాభ్రములనేలు సుత్రాము కై వడి
               బలువెన్నెయాలమందల మెలగుచు
    గమల కాసనమధ్య కలహంస విభుభాతి
               గూర్మినిచ్చెలిపిండుగొని చెలగుచు

తే. చంబ్రబింబమునకు మృదుస్వనము గఱపు
    రచన సంజార్హ శరమూఁదుచు నొనర్చు
    నాటలన్నియుఁ జాలించి యరిగెఁ దపసి
    పర్ణ శాలకు దేవకీరత్నకంబు.

సీ. నీటిలోఁ జివుకక నిలిచి క్రమ్మఱు పూన్కిఁ
                 గఠినకర్పరపుఁజుక్కాను బిగువు
    దంష్ట్రనెత్తి సమహేతలవుగాడుపు ( జీర
                 యురుదారుకలనయం దుదయమగుట
    పరులకు దనకట్ల బలమి చూపు విధంబు
                 పునిమిన నెత్రు గుగ్గిలపునూనె
    ద్వీపాంతరమునకుఁ దెగువమైఁ జనుపెంపు
                 చేముట్టునాగంటి జీనుతగులు

తే. సౌగతాగమమాలిమి శాస్త్రసరణి
    వల్లువల్గన చిత్రధావనము గల్గు
    నిన్నుఁ దరిచేసి, భవద్యార్థిని స్తరించి
    దరిఁ దఱియకున్నఁ గలదె మోదము మురారి.

సీ. కుఱుచలై గుమురులై గొనబులై లేఁబాప
               కొమ్ముజుట్టినజడల్ గుమురుకొనగ
    మెఱపుల మిట్టలై మిక్కిలి బటువులై
               గ్రాలుకన్నుల చెన్ను గబ్బుదేర
    జిక్క నై చెలువమైన చిన్నదియై యొప్పు
               మోము దంష్ట్రాటంకముల దలిర్ప
    నీలమై నిబిడమై నింగి కిం
               దుగనున్న బలుమేని పొగరమెఱయ

తే. బ్రతిపతి కేతనుని పురః క్షేత్రమూది
    యున్న శ్రీక్షేత్రపాలకు యోగిలోక
    రమణుముప్పది రెండక్షరముల మంత్ర
    రాజను జపించికొల్వ దొరకుశుభములు.

సీ. నిడువాలుగను చూపు నిగిడిన చో నెల్ల
                బీరెండ రేయెండ బెండ్లియాడి
    నిశ్శ్వాసపవనంబు నెనరుచో నెల్ల
                బ్రామిన్కు నెత్తావు లాముకవియఁ
    బొక్కిటితమ్మిపు ప్పొడియొల్కు చోనెల్ల
                బ్రహ్మాంకురంబులు పాదుకొనఁగ
    నడుగు లేజిగురాకు లంటినచో నెల్ల
               వివిదతీర్థశ్రేణి వెలివొడవ

తే. బర్హ మణిబంధ మా వేల్పుపచ్చ నెదురు
    గ్రచ్చకాయలతిత్తియు గంబుశ క్తి
    గలిగి విహరించు బౌండరీకంబునందు
    నందులేబట్టి ప్రాలేయ నగముపట్టి.

సీ. నగధ్వని వాహనంబగు గోవృషముఱంకె
                లనమెల్చు ఘంటామహాక్వణములు
    హరశిరశ్శశిరేఖ యపరావతారంబు
                లనబొల్చు సేవాగతాబ్జముఖులు
    కాద్రవేయాకల్ప కంఠ మూలచ్చాయ
                లనబొల్చు నగరు ధూపాయతంబు
    లీసానభూషణా హిన్పటా మణికాంతు
                లనబొల్చు రత్నదీపాంకురములు

తే. ఖండపరశుతనుప్రభా ఖండదుగ
    జలధిక లసీకరములన బొలుచువేల్పు
    టేలికలుచల్లుపూవుదోయిళ్ళుగల్లు
    సగము మునిముఖునకు దృగానందమొసగె

సీ. చలిదిచిక్క పుజిల్లు సాలుముల్ కాసుపై
                 నొయ్యారముగ పింఛ మొయ్య జెరివి
    భాస్కరాంశులు దూఱి పానువ్రేల్వీనుల
                 వేలలేని మకరకుండలములునిచి
    మోచేతివంపుగా ముడిచిబట్టిన కేల
                 వరదాభయంబు నాపటముజేసి
    పొలలేనియరటుల నిరసించుమ్ళదులొరు
                యమళమధ్యమున గోయష్టినిలిపి

తే. నిగమనూపురములు మ్రోయ నిరుకుళముగ
     సిగ్గువాసినకటి ప్రకాశింపనురము
     కెంపులేయెడఁ గ్రక్కఁ జెక్కిళనగవు
     మొలవ నత్తీర్ధముననిల్చిపొల్చు చక్రి,

సీ. కలదు లేదను వాదములకోర్చి మీనుమీ
                 సమువంటి యొంటిజంగము మెఱవఁగ
    లహుసంకుమదపంక పొణింధమంబై న
                 తాళిగోణపుఁబెంగు నేలజీరఁ
    గదలేని వీడ్యంపుఁ గప్పుచుందురు కావి
                 మోవివల్లొత్తుల ముసుఁగుదన్న
    సానతాఁకులుగల్గు సూనాస్తుశంఖంబు
                గతి నఖరేఖాంక గళము దనర

తే. సఖులు పరిహాసకులు వెంటజనగ యువతి
    భుక్త నిర్ముత్త పరిధాన యుక్తుడగుచు
    నగరుగంటాపదంబున నగుచుదిరుగు
    నొఱపుగలఠీవి జాతిమాత్రోవజీవి.

సీ. పరమేష్టినుండి నీతరముదాక కశుద్ధ
                 తరమయినవంశంబు దలచవైతి
     దఱిద్రొక్కియున్న యీతల్లిదండ్రుల జాల
                 పఱచవై సంతోష పఱచవైతి
     నగ్ని సాక్షిగ బెండ్లియాడిన యిల్లాలి
                 నిల్లాలితాకార నొల్లవైతి
     ధర్మశాస్త్రార్ధవిత్తముల విత్తములచే
                 నలరించి విఖ్యాతి నందవైతి

తే. శీలమఖిలంబునిది పిల్ల శీలమనుచు
     జదువులివియెల్లఁ జిల్కల చదువులనుచు
     దోడివారలునవ్వ నాతోడ ! యేల
     బేలవైతివి యీగుణం బేల ? నీకు.

సీ. మహినాలపాఁడి మర్మంబుగాఁ బ్రభవింప
                నవనవోజ్జ్వలరధి స్నానవిధియు
    శుభ్రాభ్రపటలంబు లభ్రంబుపైఁ బర్వ
                లఘుభౌతవిమలచేలములకప్పు
    సితకు శేశయ కాళ సితకరుద్యుతి హెచ్చ
                దొరకిన యుచితంపు విరులపూజ
    శాలిపాకస్పూర్తిగ్రాల గోరోచనా
                నమ్మశ్రచర్చిక్య సంఘటనము

తే. వజ్రభుజాభోజనములుక్రొం బంటవంట
     కములుగావింప గోధూమఖండఖండ
     శర్కరాఢ్యసుపక్వ భోద్యములు నెరపి
     విష్ణుఁబూజింపఁదగు పర ద్వేళయందు.

సీ. సమధికజ్ఞాన విభ్రమముతో గూడంగ
                 హరిమేన నవతార మైనవారు
    మడముపోవగఁ నిండు మనసుతో గూడంగ
                 బ్రహ్మచర్యము చిక్క.ఁ బట్టువారు
    పరపురుషార్ధసంపదలతోడఁ గూడంగ
                ధనురాది శస్త్రము ల్దాల్చువారు
    ద్వీపాంతరమునకుఁ దెగువమై జనువుంపు
                చేముట్టుఁనాగంటి జీనుతగులు

తే. సౌగతాగమమాలిమి శాస్త్రసరణి
     వల్గువల్గక చిత్రధావనముగల్గు

    నిన్నుదరిచేసి భవదార్థినిస్తరించి
    దరిదఱియకున్నఁగలదె మోదము మురారి.

సీ. ఊరకుండినజూచి యొక్కింతనగి కృష్ణు
              డిదియేమి నీవన్న నిందువదన
    కుంచితావయవభం గురునృత్తి దత్పాద
              బిసరుహంబులకేలి బిగియబట్టి
    మచ్చిత్తహరములో మనవైరి! నీపాద
              వనరుహంబులు వీనివదలజూల
    వీనిలావణ్య మీవేషభూషణముగా
              నస్మత్కరార్థి తంబగుట సమగు

తే. గవయిది చలాంఛనం బగుగాతయనుడు
    నట్లయగుగాక సర్వంబు పలిత! నీవ
    నంబరవిముక్తకేశవి నఖిలభూష
    ణాంచి తాంగివినై యుండు మనియె శౌరి.

సీ. శాంబరీకచ్ఛ పేశ్వరకంకఠముదీప్త
              తాసింఛ నల్లీమ తల్లియనగ
    జవనసారణపతి స్ఫాటికి స్తంభజం
              ధద్విషన్మణిపాల భంజయనగ
    సవనతరాహదం ష్ట్రాఖనిత్ర ప్రోత
              కలకాక్షఘవకాల ఖండమనగ
    గకుబంతకరివర స్కంధసింధుద్వీప
              సంసార కాసిత హంసి యనగ

తే. భూరి భూభృచ్చి భోద్యన్మయూరి యనగ
     భృగుభగీరథభరతాది నృపభుజాగ్ర

    ఘటితకాలాగరుస్థానకం బనంగ
    దగు వసుంధర గృపటల్కు దైత్యభేది

సీ. ఇంద్రచాపంబు గాదిదిమౌళితనమున
              సవరించి బర్హి పింఛంబుగాని
    భిదుర ఘోషంబుగా దిది పాంచజన్యసం
              జాతగంభీర ఘోషంబుగాని
    యాశ్రయించిన బలా గావళిగాదిది
              హరి ముక్తహర యష్టిగాని
     యిదిగోల మెరగుగా దుదిరిబంరంపుగా
              గాబసిమిగ్రమ్మెడు పచ్చపట్టునీ

తే. వృష్టిగా దిది కరుణా బు వృష్టిగాని
    నీలమేఘంబుగా దిది నీలవర్ణుఁ
    డౌర నామ్రోలఁ బ్రత్యక్ష మయ్యెననుచు
    హర్షపులకితతనువయ్యె న వ్వధూటి

సీ. కలకనీరెంతయు గతకల్మషము జేసెఁ
               గతకాఫలమురీతిఁ గలశసూతి
    పాపటదీర్చె భూభాగంబు నాశ్వాస
               శాదింబు శకటౌఘ చక్రధార
    శిఖతాండవము కళాసికఁ జేసి సడలంచెఁ
               గఱకుటీకలపేరి కా సెబిగువు
    లుడిగిన జడవాన లుదయించె వెండియు
               గరిఘటమవృషి కైతవమున

తే. ఱెల్లుశోభిల్లె మంకెనలుల్లసిల్లె
     గాలకంధరవాహంబు గజ్జురేఁగె

    ముదితశతగోపకన్యకా వద నతులిత
    లలితరుచిబొల్చె రాకాకళాధరుండు.

సీ. నడతు నీక్షేత్రంబు నకుజెయిదాఁచి
               యర్చింతు నీనమ్మిన సేవకులను
    మ్రొక్కుదు నీపాదములకు జిహ్వావీధి
               నీనామములు వక్కాణింతు నెపుడు
    అర్పింతు నీసేవకై సర్వ దేహంబున
               జింతింతునీలీల జిత్తసరణి
     దనివోక నీచక్కదనము సంవీక్షింతు
               నీయవధానంబు నెమ్మివిందు

తే. బ్రహ్మరుద్రాదులకుఁ గానఁ బడని నీవు
     నేడునా మ్రోల నిలిచితి నీలవర్ణ
     వర్ణనాతీతమత్ప్రాభవప్రవృత్తి
     వుణ్యపరిపాక మేరికిఁ బొగడదరమె !

శా. ప్రారంభించిన వేదపాఠమునకుం బత్యూహమౌనంచు నో
     యేరాతమ్ముడ నన్నుఁజూడ జనుదే విన్నాళ్ళనోయుండి చ
     క్షూరాజీవయుగంబువాచె నినుఁగన్గోకున్కి మీబావయున్
    నీరాకన్మదిఁ గోరుజంద్రుపొడుపున్ నిరాకరంబుంబలెన్.

మ. వలనాయేటికి నాశ్రయించి మనఁగా వానీరమున్ నీరమున్
     దలవెఱ్ఱేపచరింప నేటికి సమద్దానంబు దానంబున
    చ్చలమాయేటికి నెత్తిగట్టుకొనఁగా సన్యాసమున్న్యాసమున్
    గలిఁదేజాలు మదీయభక్తిరుచి భక్తశ్రేణి కశ్రాంతమున్.

సీ. నిలువుననొలిపించే విలువంగడము నెల్ల
                 శరముల యాయంబు బొరయుటడిపెఁ
    దగశబ్దమాత పాత్రముచేసె గుణలత
                 మ్రాకునగట్టించె మూలబలము

    గంచుకి వశముగావించె సేనానాధు
               గట్టించె సహచరుఁ గటికియెండ
    బ్రతిపక్షభావసంగతుడని హితుజూచె
               వర కేతమురుకీర్తి భరముడులిపె

గీ. ధర్మనిర్మలబుద్ది సుశర్మగదిసె
    గెలువగా లేక చని కోపగించిమదను
    డురక పనివారలతనికి నోడుమని రె
    పతికిఁ గీజేటబంట్ల పొపంబుగాదె ?

తే. ఖండపరశుతను ప్రభాఖండదుద్ద
    జలధిజలశీకరములన బొలుచు వేల్పు
    టేలిక లుచల్లు పూవుదో యిళ్ళుగల్లు
    సగము మునిముఖ్యునకు దృగానఁ దమొసగె.

సీ. చలిదిచిక్క పుజిల్లు సాలుముల్ కానుపై
               నొయ్యారముగ పింఛ మొయ్య
     జెరివిభాస్కరాంశులు దూరి పాఱువ్రేల్వీనుల
               వెలలేనిమకరకుండలములునిచ్చి
     మోచేతివంపుగా ముడిచిపట్టిన కేల
               వరదాభయంబు లాపటముచేసి
     పొనలేని యరటుల విరసించుమృదులోరు
               యమళమధ్యమున గోయష్టినిలిపి

తే. నిగిమనూపురములు మ్రోయ నిరుకుళముగ
     సిగ్గువాసినకట్టి ప్రకాశింపనురము
     కెంపులేయెండగ్రక్క జెక్కిళ్ళినగవు
     మొలవ నుత్తీర్థముననిచ్చి పొల్చుజక్రి.

                      సంపూర్ణము.