తల్లివిన్కి

వికీసోర్స్ నుండి

తల్లివిన్కి

(లలితాసహస్ర నామాచ్ఛాంధ్ర పద్యవివృతి)



పరమభాగవత

ఆదిభట్ట నారాయణదాసుఁడు




సంపాదకుఁడు

ఆచార్య ఓరుగంటి నీలకంఠశాస్త్రి



ప్రకాశకుఁడు

కఱ్ఱా ఈశ్వరరావు

B. Com (Hons) B. L., F. C. A.

ప్రథమ ముద్రణము

ఆనంద మకరసంక్రాంతి

14 - 1 - 1975

ప్రతులు 1000

సర్వస్వామ్యములు ప్రకాశకులవి




ప్రాప్తిస్థానము

శ్రీ కఱ్ఱా ఈశ్వరరావు

Officer. I. L. T. D. Company,

GUNTUR.



వెల : 15 రూపాయలు



ముద్రణము

పి. రామకృష్ణమూర్తి

మేనిజింగు డైరక్టరు

వెల్ కంప్రెస్, పి వి టి. లిమిటెడ్, బ్రాడీ పేట 2వ లైను గుంటూరు-2

విషయసూచిక.


. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
1


2. మట్టు

3. తల్లివిన్కి కుదురు

4. తల్లివిన్కి

5. లఘుటిప్పణి

6. అనుబంధములు:-

౧. దాసుగారి సూక్తులు
౨. నారాయణదాస జీవితపంచాంగము
౩. నారాయణదాస గ్రంధావళి

భూమిక

దాస భారతీ ప్రచురణలలో నాలవదానిగా ఈ తల్లి విన్కి - లలితా సహస్రనామ వివృతి - ఆవిర్బవించినది. హరికథా రచనలు తరువాత శ్రీ దాసుగారు, అనేక గ్రంథములు అచ్చ తెనుగులోనే, నియమముతో రచించిరి. వారి అచ్చ తెనుగు అభిమానము ఈ క్రింద పద్యమువలన తేట తెల్ల మగును.

మొలక లేతదనము, తలిరులనవకము
మొగ్గ సోగదనము, పూవుతావి
తేనె తీయదనము, తెనుగునకేకాని
మోట లాతి నాటుమాటకేది.

నా అనుభవము, కొద్ది పరిశ్రమతో అచ్చ తెనుగు మాటల అర్థము తెలుసుకొనిన వారి రచనలు కడు సులువుగ సుబోధములగును. ఈ లలితా సహస్రనామ వివృతియందు ప్రతినామమును చక్కని అచ్చ తెలుగులో దాసుగారు వివరించిరి. పఠితలకు, మారు మూలనున్న అచ్చ తెనుగు పదములకు వెంటనే అర్థము చేసికొని అన్వయించుకొనుటకు, 32 పుటల "లఘు టిప్పణి" అకారాది క్రమములో ఇవ్వబడినది. దాని సాహాయ్యమున గ్రంథమంతయు అర్థము చేసికొని ఆనందించుటకు వీలగును.

ఈ గ్రంథము శ్రీ నారాయణదాసుగారు, పరిణత వయస్కులై, బాగుగా జ్ఞాన సముపార్జనచేసిన పిమ్మట సుమారు తమ ఎనుబదవ ఏట మొదలిడి, తమ అవతారమును చాలించు సమయమునకు పూర్తి చేసిరి. అట్టి వయస్సులో వారు వ్రాసిన చిత్తును తమ ప్రియశిష్యులైన పేరి నరసింహమునకు నోటితో చెప్పి శుద్దప్రతిని వ్రాయించెడివారు. తమ అవసాన కాలము సమీపించుచున్నదని ఎఱిగి తమ శిష్యుని శుద్ధప్రతిని కొన్ని సవ


రింపులతో, త్వరగా పూర్తి చేయుమని ఒత్తిడి చేయుచుండెడివారు. వారికి ఈ గ్రంథము మీద ఎంతమక్కువ యనిన, 1943-44 సంవత్సరములు, యుద్ధ సమయము, ఆరోజులలో తను కష్టా ర్జితధనము సుమారు వెయ్యి రూప్యములు ఎప్పుడు సిద్ధముగానుంచుకొని, తగిన కాగితము దొరికిన వెంటనే అచ్చువేయు సంకల్పముతో, తత్సంపాదనకై ప్రయత్నములు చేసి చేసి, తుదకు మండలాధికారి సాహాయ్యము వడసియు కంట్రోలు దినములలో కాగితమును సంపాదించలేక విఫలురైరి. ఆపుస్తకము అచ్చుపడక ఆనాటినుండి ఇప్పటివరకు అటులనే యుండిపోయినది.

ఈ విషయమును గుర్తెఱిగినవాడను కాబట్టి, ఈ గ్రంథము బహుళ ప్రజకు ఉపయోగించునో లేదో తెలియదుకాని శ్రీ దాసాభిమతానుసారము, ప్రప్రథమముగా అచ్చు వేయించ వలెనని సంకల్పించి, నాకోరిక ఆచార్య యన్. వి జోగారావుగారికి విన్నవించుకొంటిని. కాని వారు నన్ను ఆ ఉద్యమమున నిరుత్సాహ పరిచి ప్రప్రథమముగా శ్రీ నారాయణదాస రచన "మేలుబంతి" అను గ్రంథము అచ్చువేసిన, సాహిత్యలోకమునకు ఉపయోగముగ నుండును. తదుపరి ఈ గ్రంథ ముద్రణ చేయ వచ్చునని సలహాయిచ్చి ముందు నాచే, దాసరచనలు మేలుబంతి, కచ్చపీశ్రుతులు, వ్యాసపీఠము - మూడు అచ్చు వేయించిరి.

ఒకనాడు నేను నామిత్రులు జోగారావుగారు దాస భారతీ ప్రచురణల ప్రణాళిక వేయు సమయములో మాకిద్దరకు చక్కని ఊహారేఖ పొడమి, ఇటువంటి గ్రంథ ముద్రణకు సాయము చేయువ్యక్తి ఎవరా అని ఆలోచించగా వెంటనే మాకు వదాన్య శేఖరులు, సాహితీప్రియం భావుకులు ! ఆధ్యాత్మిక విద్యయందుమిక్కిలి ఆసక్తిగలవారు. రసజ్ఞ శేఖరులు శ్రీ పోలిశెట్టి సీతారామాంజనేయులుగారు మనస్సులో మెదలిరి. ఆ మరునాడే మేమిద్దరము వారిని దర్శించి మా ఉద్యమమును విన్న వించుకొనగా. అంతయువిని, వెంటనే అచ్చువేయించుటకు తమ ఆమోదము తెలిపి. ఈ పుస్తక ముద్రణకు అగుకర్చు ఎంత అగునో తెలుపుమనిరి. తరువాత కొలది


దినములయిన పిమ్మట, ముద్రాపకులవద్ద పుస్తక ముద్రణకగు ఖర్చు జాబితా తీసుకొని శ్రీ సీతారామాంజనేయులగారి దగ్గరకు వెళ్లగా వారు అది చూచి 500 ప్రతులు అచ్చు వేయుటకు అంగీకరించి, మమ్ములను కార్యోన్ముఖులను చేసిరి. తరువాత చక్కని లలితా పరమేశ్వరి త్రివర్ణ చిత్రము, శ్రీ చక్రముకూడ నున్న బాగుండునని శ్రీ ఆంజనేయులుగారు సెలవీయగా వానిని గూడ సేకరించి, ఇందులో వేయించితిమి. భక్తులు, సాహితీ వేత్తలు ఈ ముఖచిత్రములు చూచి ఆనందింతురని మాఅభిసంధి. వారి సాహాయ్యమే లేకున్న ఈ పుస్తకము అచ్చు అగుట చాల పరిశ్రమతోకూడుకొన్నపని. ఇంత త్వరలో మేము ప్రచురించి యుండెడివారము కాము వారి సాహాయ్యమునకు ఆ పరమేశ్వరియే తుష్టురాలై వారికి, వారి కుటుంబమునకు ఆయురారోగ్యైశ్వర్యములు ప్రసాదించుగాక అని ప్రార్ధించుచున్నాము.

ఇది పారాయణ గ్రంథముగా నుండుటకు, నిత్యపారాయణ కనుకూలముగా, తొలుదొలుత లలితా సహ స్రనామములు అచ్చు వేయించితిమి తరువాత ప్రతినామము ప్రత్యేకముగా శ్రీ దాసుగారి వివరణతో అచ్చు వేయబడినది.

ఏతద్గ్రంథమునకు సంపాదకత్వము వహింపుడని మేము కోరిన వెంటనే, వేదాంత పారీణులు, విద్యోభయ భాషా ప్రవీణులు బ్రహ్మ నిష్ఠులు శ్రీఓరుగంటి నీలకంఠశాస్త్రి మహోదయులు, సంతోషముతో అంగీకరించి గ్రంథమునంతయు ఆమూలాగ్రము చదివి, తమ అమూల్యమైన తొలిపలుకుతో పాఠకలోకమునకందించిరి. తాము విశ్వ విద్యాలయమున పరిశోధకులుగా తమకాలమునంతయు వినియోగించు చున్నపుడు, శ్రీదాసుగారి మీద భక్తివలన, మామీదనున్న అభిమానము పురస్కరించుకొని తమ అమూల్య కాలమును వీని కొరకై వినియోగించి ఈ పుస్తకము ఈ రూపముగా అచ్చు అగుటకు సహాయమునందచేసిరి. వారికి నాకృతజ్ఞతా పూర్వకములైన అభినందనలు. శ్రీ నీలకంఠశాస్త్రి గారికి తోడుగ, మరి యిద్దరు పండితులు బ్రాహ్మీభూషణ శ్రీ రాంభట్ల లక్ష్మీనారాయణ శాస్త్రిగారు, పరమ మాహేశ్వరులు, పండిత పరమేశ్వరులు శ్రీ మిన్నికంటి గురునాథ శర్మగారు శ్రీ దాసుగారి అచ్చ తెనుగు అనువాదమును చదివి ఆనందించి వారి అభిప్రాయములొసగిరి. వారికి గూడ మా అభినందనలు.

ఈ గ్రంథ ముద్రణ విషయములో అనేక సలహాలు ఇచ్చి ముద్రణ చేయురీతిని ప్రణాళికను చేసి, ఈ పుస్తకము చివరి నాలుగు అనుబంధములు రచియించి, దాసభారతివి సుందరముగా ఉజ్జ్వలింపచేసిన మహాకవి, మధుర సరస్వతి, ఆచార్య యన్. వి. జోగారావు గారికి నానమస్సుమనస్సులు. అంతియేగాక ముద్రణ ప్రదాత అయిన శ్రీ పోలిశెట్టి సీతారామాంజనేయులు గారి వంశావళి పద్యములు మేము కోరినవెంటనే వ్రాసిపెట్టి మాకృతజ్ఞ ను ముద్రణ ప్రదాతలకు వెల్లడి చేసికొనుటకు సదవకాశము కల్పించిరి. ఈ కార్యమునకు వారికి మాప్రత్యేక అభినందనలు సమర్పించు కొనుచున్నాను.

తెలుగు పాఠకులు, కొంచెము ఓపికతో శ్రీ దాసుగారి అనువాదమును చదివి, దాస హృదయమును అర్థము చేసికొని ఆనందించి మా ప్రయత్నమును సార్థక పఱతురు గాక! అచ్చ తెనుగు గ్రంథరాజములలో ఇయ్యది ఎనలేనిదై వెలుగుగాక!.


ఇట్లు

కర్రా ఈశ్వరరావు.

ప్రకాశకుడు.

ముద్రణార్థ ప్రదాతలు

"మహామాన్య" శ్రీ పోలిశెట్టి సోమసుందరశ్రేష్ఠిగారి

వంశ ప్రశంస

________

ఆచార్య శ్రీ యస్వీ జోగారావు


శ్రీ తారుణ్యవతీ కటాక్షతతి రాసిక్య ప్రమాతల్ మహా
దాతల్ సంతత ధర్మ కార్య సవన స్ధాతల్ సదా వాసవీ
దూతల్ భారతదేశ భక్తి సముపేతుల్ శేముషీ ప్రాభవ
ఖ్యాతుల్ శ్రీ మహితార్య వైశ్యకుల దుగ్ధాంభోధి జాతుల్ మహిన్. 1

విక్రమార్కుని రాజ్య చక్రముం ద్రిప్పిన
    మతి బృహస్పతి మహామంత్రి భట్టి
దండి భారవి కాళిదాసుల ఘనత గం
    పల కెత్తి చూపిన మాఘ సుకవి
సంగీత రత్నాకరాంగణమ్మున వాణి
    నావహించిన శార్ఙగదేవ బుధుఁడు
తనువు ప్రత్యణువు నాతత దేశ భక్తియై
    గండు మీరిన మహాత్ముండు గాంధి
ప్రాణ మొడ్డి యాంధ్రులకు స్వరాష్ట్ర సిద్ధి
నామతించిన పొట్టి శ్రీరామ సుకృతి
ఆర్య వైశ్య వంశమ్మున కాభరణము
లందు శ్రీ పోలిశెట్టివా రాత్త యశులు

బాభ్రేయస గోత్రులు పరి
శుభ్ర చరిత్రులు బహువిధ శుభకార్యయశో

This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after sixty years counted from the beginning of the following calendar year (ie. as of 2024, prior to 1 January 1964) after the death of the author.