తల్లిదండ్రుల మరియు వయోవృద్ధ పౌరుల భరణ, పోషణ మరియు సంక్షేమ చట్టము, 2007

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

urt H. &-338 Registered No. D-221 రిజిస్ట్రీ సంఖ్య. డి-221

REF. 9.00 Price Rs. 11.00 మూల్యము : రూ. 11.00

Orden GIVET

The Gazette of India భారత రాజపత్రము

TATTUT

EXTRAORDINARY అసాధారణ

SITT XVIITATT 1

Part XVI Section 1

భాగము XVI అనుభాగము 1

sara Sehifera

PUBLISHED BY AUTHORITY

ప్రాధికారము ద్వారా ప్రచురింపబడినది


No.1 సంఖ్య 1 a facet New Delhi న్యూఢిల్లీ ⅡⅡⅡⅡ Manday సోమవారము fshat, poll/0C 3 December, 2018/08 3 డిశంబర్, 2018/08 anfa Tv 24 Karthika Vol 25 కార్తీక సంపుటము 25

MINISTRY OF LAW AND JUSTICE (LEGISLATIVE DEPARTMENT)

New Delhi, 30th October, 2018/Chaitra, 1940 Vilambi.

The Translation in Telugu of the following Acts namely:-

(1) The Government Securities Act, 2006 [Act No.38 of 2006), (2) The Maintenance and Welfare of Parents and Senior Citizens Act, 2007 (Act No.56 of 2007], (3) The Foreign Contribution (Regulation) Act, 2010 (Act No.42 of 2010) are hereby published under the authority of the President and shall be deemed to be the Authoritative Text thereof in Telugu under Clause (a) of Section 2 of the Authoritative Text (Central Laws) Act, 1973 (Act 50 of 1973).

శాసన మరియు న్యాయపాలన మంత్రిత్వ శాఖ

(శాసన నిర్మాణ విభాగము)


ఈ క్రింది చట్టములు, అనగా,

(1) ప్రభుత్వ ప్రతిభూతుల చట్టము, 2006 (2006లోని 38వ చట్టము), (2) తల్లిదండ్రుల మరియు వయోవృద్ధ పౌరుల భరణ పోషణ మరియు సంక్షేమ చట్టము, 2007 (2007లోని 56వ చట్టము), (3) విదేశీ అంశదాయముల (క్రమబద్ధీకరణ) చట్టము, 2010 (2010లోని 42వ చట్టము) యొక్క తెలుగు అనువాదమును రాష్ట్రపతి ప్రాధికారము క్రింద ఇందుమూలముగా ప్రచురించడమైనది. ఆ చట్టములకు గల ఈ అనువాదమును ప్రాధికృత పాఠముల (కేంద్ర శాసనముల) చట్టము, 1973 (1973లోని 50వ చట్టము) యొక్క 2వ పరిచ్ఛేదములోని ఖండము (ఎ) క్రింద, ప్రాధికృత తెలుగు పాఠములైనట్లు భావించవలెను.

తల్లిదండ్రుల మరియు వయో వృద్ధ పౌరుల భరణ పోషణ

మరియు సంక్షేమ చట్టము, 2007

(2007లోని 56వ చట్టము)

[29 డిసెంబరు, 2007]
 

సంవిధానము క్రింద హామీ ఒసగబడిన మరియు గుర్తింపబడిన తల్లిదండ్రులు మరియు వయోవృద్ధ పౌరుల భరణ పోషణ మరియు సంక్షేమమునకుగాను సమర్ధవంతమైన నిబంధన చేయుట కొరకు మరియు దానికి సంబంధించిన లేక అనుషంగికమైన విషయములను నిబంధించుటకైన చట్టము.

భారత గణరాజ్యము యొక్క యాభై ఎనిమిదవ సంవత్సరములో పార్లమెంటుచే ఈ క్రింది విధముగా శాసనము చేయబడినది:-

అధ్యాయము -1

ప్రారంభిక

1. (1) ఈ చట్టమును తల్లిదండ్రుల మరియు వయోవృద్ధ పౌరుల భరణ పోషణ మరియు సంక్షేమ చట్టము, 2007 అని పేర్కొనవచ్చును.

(2) ఇది జమ్ము మరియు కాశ్మీరు రాజ్యము మినహా యావత్ భారత దేశమునకు విస్తరించును మరియు భారతదేశము వెలుపలి భారత పౌరులకు కూడా వర్తించును.

(3) ఇది ఒక రాజ్యములో, రాజ్య ప్రభుత్వము అధికారిక రాజపత్రములో అధిసూచన ద్వారా నియతము చేయునట్టి తేదీన అమలులోనికి వచ్చును.

2. ఈ చట్టములో, సందర్భమును బట్టి అర్ధము వేరు విధముగా ఉన్ననే తప్ప:-

(ఎ) "సంతానము” అను పదములో కుమారుడు, కుమార్తె, మనుమడు మరియు మనుమరాలు చేరి ఉండును. అయితే మైనరు చేరి ఉండరు;

(బి) “భరణ పోషణ” అను పదములో ఆహారము, దుస్తులు, నివాసము, వైద్య సదుపాయము మరియు చికిత్సకు సంబంధించిన ఏర్పాటు చేరి ఉండును;

(సి) "మైనరు” అనగా మెజారిటీ చట్టము, 1875 యొక్క నిబంధనల క్రింద మెజారిటీ వయస్సురాని ఎవరేని వ్యక్తి అని అర్ధము; (డి) "తల్లి/తండ్రి” అనగా వయోవృద్ధ పౌరులైనను లేక కాకున్నను తండ్రి లేదా తల్లి అది జన్యుపరమైనను, దత్తతపరమైనను లేక మారు తండ్రి లేదా సందర్భానుసారం సవతి తల్లి అని అర్ధము;

(ఇ) “విహితపరచబడిన" అనగా ఈ చట్టము క్రింద రాజ్య ప్రభుత్వముచే చేయబడిన నియమముల ద్వారా విహితపరచబడిన అని అర్ధము;

(ఎఫ్) “ఆస్తి” అనగా ఏ విధమైనదైననూ చర లేదా స్థిర, పిత్రార్జిత లేదా స్వార్జితమైన, సాకార లేక నిరాకార ఆస్తి అని అర్ధము మరియు ఇందులో అట్టి ఆస్తిలోని హక్కులు మరియు హితములు చేరి ఉండును;

(జి) “బంధువు” అనగా సంతానములేని వయోవృద్ధ పౌరుల ఎవరేని శాసనిక వారసుడు అని అర్ధము. అతడు మైనరు కాకూడదు మరియు వారి మరణము తరువాత వారి ఆస్తిని స్వాధీనములో నుంచుకొను లేదా వారసత్వము కలిగియున్నవాడై ఉండవలెను;

(హెచ్) “వయోవృద్ధ పౌరుడు” అనగా భారతదేశ పౌరుడై ఉండి, అరువది సంవత్సరములు లేదా అంతకు పైబడిన వయస్సు కలిగిన ఎవరేని వ్యక్తి అని అర్ధము;

(ఐ) సంఘ రాజ్య క్షేత్రమునకు సంబంధించి “రాజ్య ప్రభుత్వము” అనగా సంవిధానము యొక్క 239వ అనుచ్చేదము క్రింద దాని కొరకు నియమించబడిన పరిపాలకుడు అని అర్ధము;

(జె) “ట్రిబ్యునలు" అనగా 7వ పరిచ్ఛేదము క్రింద ఏర్పాటు చేయబడిన నిర్వహణా ట్రిబ్యునలు అని అర్ధము;

(కె) “సంక్షేమము” అనగా వయోవృద్ధ పౌరులకు అవసరమైన ఆహారము, ఆరోగ్య రక్షణ, వినోద కేంద్రములు మరియు ఇతర సౌకర్యములను సమకూర్చుట అని అర్ధము;

3. ఈ చట్టము కానటువంటి ఏదేని ఇతర శాసనములో లేదా ఈ చట్టము కానటువంటి ఏదేని ఇతర శాసనమును పురస్కరించుకొని ప్రభావమును కలిగిన ఏదేని పత్రమునకు అసంగతముగా ఏమి ఉన్నప్పటికిని ఈ చట్టము యొక్క నిబంధనలు ప్రభావమును కలిగి ఉండును.

అధ్యాయము - II

తల్లిదండ్రుల మరియు వయోవృద్ధ పౌరుల భరణ పోషణ.

4. (1) ఈ క్రింది సందర్భములలో, తల్లి/తండ్రితో సహా వయోవృద్ధ పౌరుడైన వ్యక్తి, తన స్వీయ సముపార్జితం ద్వారా లేదా స్వంత ఆస్తి ద్వారా తనకు తాను భరణ పోషణ జరుపుకోలేనపుడు, 5వ పరిచ్ఛేదము క్రింద దరఖాస్తు చేసుకొనుటకు హక్కు కలిగి ఉండును-

(i) తల్లి/తండ్రి లేదా తాతయ్య, నాయనమ్మ, అమ్మమ్మలు మైనరు కానటువంటి ఒకరు లేక అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కలిగియున్నపుడు;

(ii) సంతానము లేని వయోవృద్ధ పౌరుడు 2వ పరిచ్ఛేదపు ఖండము (జి)లో నిర్దేశింపబడినట్టి బంధువును కలిగియున్నపుడు;

(2) వయోవృద్ధ పౌరుడు తమ మామూలు జీవితము గడపడానికి కావలసినంత అవసరములతో, పోషించగల బాధ్యత మేరకు అట్టి వయోవృద్ధ పౌరుల సంతానము లేదా సందర్భానుసారము బంధువుపై ఉండును;

(3) తండ్రియైననూ లేక తల్లియైననూ లేక సందర్భానుసారము అట్టి తల్లిదండ్రు లిద్దరి సాధారణ జీవనమున కైనట్టి అవసరములను కలుగుజేయు భరణ పోషణ మేరకు సంతానములోని అతని లేక ఆమె యొక్క బాధ్యతయై ఉండును.

(4) వయోవృద్ధ పౌరుని బంధువై ఉండి మరియు తగినంత జీవనాధారమును కలిగియున్న ఎవరేని వ్యక్తి, అట్టి వయోవృద్ధ పౌరుని పోషించవలెను. అయితే, అతడు అట్టి వయోవృద్ధ పౌరుని ఆస్తిని స్వాధీనములో ఉంచుకొన్నవాడై లేదా అట్టి వయోవృద్ధ పౌరుని ఆస్తికి వారసుడై ఉండవలెను:

అయితే, వయోవృద్ధ పౌరుని ఆస్తికి వారసుడగుటకు హక్కు కలిగి వుండిన బంధువులు ఒకరి కంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు, అట్టి బంధువులు వయోవృద్ధ పౌరుని ఆస్తి యొక్క వారసత్వపు దామాషాలో వారి భరణ పోషణము నిమిత్తము చెల్లించవలెను.

5.(1) 4వ పరిచ్ఛేదము క్రింద భరణ పోషణ నిమిత్తము ఈ క్రింది వారు దరఖాస్తు చేయవచ్చును-

(ఎ) వయోవృద్ధ పౌరుడు లేదా సందర్భానుసారము తల్లి/తండ్రి; లేదా

(బి) వారు అశక్తు లైన యెడల వారి నుండి ప్రాధికారమీయబడిన ఎవరేని ఇతర వ్యక్తి లేదా వ్యవస్థ; లేదా

(సి) తనంత తానుగా ట్రిబ్యునలు సంజ్ఞానము చేయవచ్చును. 1860లోని 21వది.

విశదీకరణ:- ఈ పరిచ్ఛేదము నిమిత్తము “వ్యవస్థ” అనగా సంఘముల రిజిస్ట్రీకరణ చట్టము, 1860 లేదా తత్సమయమున అమలునందున్న ఏదేని ఇతర శాసనము క్రింద రిజిస్టరైన ఏదేని స్వచ్ఛంద వ్యవస్థ అని అర్ధము;

(2)ఈ పరిచ్ఛేదము క్రింద భరణపోషణము నిమిత్తము నెలవారీ బత్తెము యొక్క చర్య పెండింగులో ఉన్న సందర్భములో ట్రిబ్యునలు, తల్లి/తండ్రితో సహా అట్టి వయోవృద్ధ పౌరుని మధ్యకాలీన భరణపోషణము నిమిత్తము నెలవారీ బత్తెము సమకూర్చవలసినదని అట్టి సంతానము లేదా బంధువుకు ఉత్తరువు జారీ చేయవచ్చును మరియు ట్రిబ్యునలు ఆయా సమయములందు ఆదేశించునట్టి విధముగా అట్టి సంతానము లేదా బంధువు, తల్లి/తండ్రితో సహా అట్టి వయోవృద్ధ పౌరునికి చెల్లించవలసి ఉండును

(3) ఉప-పరిచ్ఛేదము (1) క్రింద భరణ పోషణము కొరకు దరఖాస్తు అందిన మీదట దరఖాస్తును గురించి సంతానము లేదా బంధువుకు నోటీసును ఇచ్చిన తరువాత మరియు కక్షిదారులకు ఆకర్ణించుకొనుటకు అవకాశము ఇచ్చిన మీదట భరణపోషణము కొరకైన పైకమును నిర్ధారించుటకు పరిశీలనను చేపట్టవలెను.

(4) భరణపోషణము కొరకైన నెలవారీ బత్తెము మరియు దావా చర్య ఖర్చుల నిమిత్తము, ఉప-పరిచ్ఛేదము (2) క్రింద దాఖలు చేయబడిన దరఖాస్తును, అట్టి వ్యక్తికి దరఖాస్తు నోటీసు తామీలు చేయబడిన తేదీ నుండి తొంబది దినముల లోపల దరఖాస్తును పరిష్కరించ వలెను:

అయితే, ట్రిబ్యునలు అసాధారణ పరిస్థితులలో వ్రాసి ఉంచదగు కారణముల పై ఒక పర్యాయము గరిష్టముగా ముప్పది దినములకు సదరు కాలావధిని పొడిగించవచ్చును.

(5) ఉప-పరిచ్ఛేదము (1) క్రింద భరణపోషణము కొరకైన దరఖాస్తును ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల పై దాఖలు చేయవచ్చును: అయితే, భరణపోషణము కొరకైన దరఖాస్తులో, అట్టి సంతానము లేదా బంధువు తల్లి/తండ్రి భరణపోషణము చూడవలసియున్న ఇతర వ్యక్తిపై అభియోజితము మోపవచ్చును.

(6) భరణపోషణ ఉత్తర్వు ఒకరి కంటే ఎక్కువ మంది పై చేయబడిన సందర్భములో, వారిలోని ఒకరి మరణము భరణపోషణ చెల్లింపును కొనసాగించుటలో ఇతరుల దాయిత్వము నకు ఏ విధముగాను భంగము కలిగించదు. (7) భరణపోషణము కొరకైన అట్టి బత్తెమును మరియు దావా ఖర్చులను ఉత్తర్వు తేదీ నుండి గాని లేదా సందర్భానుసారము భరణపోషణము మరియు దావా చర్యల ఖర్చుల కొరకైన దరఖాస్తు తేదీ నుండి గాని చెల్లించవలసి ఉంటుందని ఉత్తర్వు చేయబడిన సందర్భములో, అప్పటి నుండి చెల్లించవలసి ఉండును.

(8) ఆ విధముగా చేయబడిన ఉత్తర్వును సంతానము లేదా బంధువు తగిన కారణము లేకుండానే సదరు ఉత్తర్వును పాటించని యెడల, ఏదేని అట్టి ట్రిబ్యునలు, ఉత్తర్వు యొక్క ప్రతి ఉల్లంఘనకుగాను జరిమానాలు విధించడానికి నిబంధించబడిన రీతిలో బకాయిపడిన మొత్తమునకు జరిమానా విధించేందుకు వారంటు జారీ చేయవచ్చును. మరియు భరణపోషణము మరియు దావా చర్యల ఖర్చుల కైన ప్రతి నెలసరి బత్తెము మొత్తమునకు లేదా సందర్భానుసారము అందులోని ఏదేని భాగమునకు అట్టి వ్యక్తిని దండించవచ్చును. మరియు వారంటు రీచేసిన మీదట బకాయిపడిన మిగిలిన పైకమునకుగాను ఒక మాసమునకు విస్తరించగల కాలావధికి కారావాసముతో లేదా ఒకవేళ చెల్లింపు త్వరగా చేసిన యెడల అంతవరకు, వీటిలో ఏది ముందు అయితే అంతవరకు, ఆతనికి కారావాస శిక్ష విధించవచ్చును: అయితే, ఈ పరిచ్ఛేదము క్రింద బకాయిపడిన ఏదేని పైకమును తిరిగి వసూలు చేయుట కొరకు బకాయిపడిన తేదీ నుండి మూడు మాసముల లోపల అట్టి పైకమును విధించు నిమిత్తము ట్రిబ్యునలుకు దరఖాస్తు చేసిన నేతప్ప ఎట్టి వారంటు జారీచేయబడరాదు. అధికారితో పరిధి మరియు ప్రక్రియ.

6.(1) 5వ పరిచ్ఛేదము క్రింద ఎవరేని సంతానము లేదా బంధువుపై, ఏ జిల్లాలోనైననూ, (ఎ) అతను నివసించుచున్న లేదా చివరిసారిగా నివసించిన చోటు; లేదా (బి) సంతానము లేదా బంధువు నివసించు చోటు ఈ క్రింది విధముగా దావా చర్యలను తీసుకొనవచ్చును. (2) 5వ పరిచ్ఛేదము క్రింద దరఖాస్తును స్వీకరించిన మీదట, ఎవరికి వ్యతి రేకముగా దరఖాస్తు దాఖలు చేయబడినదో ఆ సంతానము లేదా బంధువుల సమక్షమున హాజరుపరచుటకుగాను ప్రాసెస్ ను ట్రిబ్యునలు జారీ చేయవలెను. 1974లోని 2వది. (3) సంతానము లేదా బంధువును హాజరు పరచు విషయములో ట్రిబ్యునలు, క్రిమినలు ప్రక్రియా స్మృతి, 1973 క్రింద నిబంధించబడిన విధముగా మొదటి తరగతి న్యాయిక మేజిస్ట్రేటు యొక్క అధికారమును కలిగి ఉండును. (4) ఎవరికి వ్యతిరేకముగా భరణపోషణము చెల్లింపు నిమిత్తము ఉత్తర్వు చేయుటకు ప్రతిపాదించబడినదో ఆ సంతానము లేదా బంధువు సమక్షమున అట్టి దావా చర్యలకు సంబంధించిన సాక్ష్యమునంతను తీసుకొనవలెను మరియు సమనుల కేసులను విహితపరచబడిన రీతిలో రికార్డు చేయవలెను:

అయితే, ఎవరికి వ్యతి రేకముగా భరణపోషణము చెల్లింపు నిమిత్తము ఉత్తర్వు చేయుటకు ప్రతిపాదించబడినదో ఆ సంతానము లేదా బంధువు ఉద్దేశపూర్వకముగా దానిని తీసుకొనుటకు తప్పించుకొనుచున్నారని లేదా ట్రిబ్యునలు సమక్షమున హాజరగుటకు ఉద్దేశపూర్వకముగానే నిర్లక్ష్యము చేస్తున్నట్లు ట్రిబ్యునలు సంతృప్తి చెందిన యెడల, అది విచారణ జరిపి, ఏకపక్షీయంగా నిర్ధారించవచ్చును.

(5) సంతానము లేదా బంధువు భారత దేశమునకు వెలుపల నివసిస్తున్న యెడల, కేంద్రప్రభుత్వము అధికార రాజపత్రములో అధిసూచన ద్వారా ఈ విషయములో నిర్దిష్ట పరచునట్టి ప్రాధికారి ద్వారా ట్రిబ్యునలుచే సమనులను అంద చేయించవలెను.

(6) ట్రిబ్యునలు, 5వ పరిచ్ఛేదము క్రింద దరఖాస్తును ఆకర్ణించుటకు ముందు, దానిని సంధాన అధికారికి నిర్దేశించవలెను. అట్టి సంధాన అధికారి, తన విచారణాంశములను ఒకనెల లోపల సమర్పించవలెను మరియు సామరస్య పూర్వకమైన పరిష్కారము కుదిరినట్లయితే, ఆ మేరకు ట్రిబ్యునలు ఉత్తర్వు జారీచేయవచ్చును.

విశదీకరణ:- ఈ ఉప-పరిచ్ఛేదము నిమిత్తము, “సంధాన అధికారి”అనగా 5వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (1)కి గల విశదీకరణలో నిర్దేశించబడిన ఎవరేని వ్యక్తి లేదా వ్యవస్థ యొక్క ప్రతినిధి లేదా 18వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (1) క్రింద రాజ్య ప్రభుత్వముచే పదాభిదానము చేయబడిన భరణ పోషణాధికారులు లేదా ఈ ప్రయోజనము కొరకు ట్రిబ్యునలుచే నామనిర్దేశము చేయబడిన ఎవరేని ఇతర వ్యక్తి అని అర్ధము.

భరణ పోషణ ట్రిబ్యునలు యొక్క సంఘటన.7.(1) రాజ్య ప్రభుత్వము, ఈ చట్టము ప్రారంభమైన తేదీ నుండి ఆరుమాసముల కాలావధిలోపల, అధికార రాజపత్రములో అధిసూచన ద్వారా, 5వ సరిచ్ఛేదము క్రింద న్యాయ నిర్ణయము చేయుటకు మరియు భరణపోషణము కొరకైన ఉత్తర్వు పై నిర్ణయము చేయు నిమిత్తము అధి సూచనలో నిర్ధిష్టపరచబడునట్లుగా ప్రతి సబ్ డివిజనుకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ట్రిబ్యునళ్లను సంఘటితపరచవచ్చును.

రాజ్య సబ్-డివిజనల్ అధికారి హోదాకు తక్కువకాని అధికారి ట్రిబ్యునలుకు అధ్యక్షత వహించవలెను. (3) ఏదేని ప్రాంతమునకు రెండు లేదా అంతకంటే ఎక్కువ ట్రిబ్యునళ్లు సంఘటిత పరచబడినపుడు, రాజ్య ప్రభుత్వము సాధారణ లేదా ప్రత్యేక ఉత్తర్వు ద్వారా వాటి మధ్య కార్యకలాపాల పంపిణీ ప్రక్రియను క్రమబద్ధము చేయవచ్చును.

విచారణ విషయములో సంక్షిప్త ప్రక్రియ.

8.(1) 5వ పరిచ్ఛేదము క్రింద ఏదేని విచారణను చేయునపుడు, ట్రిబ్యునలు, ఈ విషయములో రాజ్య ప్రభుత్వముచే విహితపరచబడునట్టి ఏవేని నియమములకు అధ్యదీనమై, తాను సముచితమని భావించునట్టి సంక్షిప్త ప్రక్రియను అనుసరించవచ్చును

1974 లోని 2అ వది.(2) ట్రిబ్యునలు, ప్రమాణము పై సాక్ష్యము స్వీకరించుటకు మరియు సాక్ష్యులనుహాజరగునట్లు చూచుటబలవంతముగా దస్తావేజులు వాస్తవ విషయములను వెల్లడి చేసి మరియు సమర్పించు నిమిత్తము మరియు విహితపరచబడునట్టి ఇతర ప్రయోజనముల కొరకు సివిలు న్యాయ స్థానము యొక్క అన్ని అధికారములను కలిగిఉండవలెను; మరియు క్రిమినలు ప్రక్రియా స్మృతి, 1973 యొక్క 195వ పరిచ్ఛేదముమరియు అధ్యాయము 26 యొక్క ప్రయోజన ములు అన్నింటి కొరకు ట్రిబ్యునలుసివిలు న్యాయస్థానముగా భావించబడవలెను.

(3) ఈ విషయములో చేయబడు ఏదేని నియమమునకు అధ్యధీనమై ట్రిబ్యునలు భరణ పోషణము కొరకైన ఏదేని క్లెయిమును న్యాయ నిర్ణయము చేసి మరియు దాని పై నిర్ణయించు నిమిత్తము విచారణ జరుపుటలో దానికి సహాయపడుటకుగాను, విచారణకు సంబంధించిన ఏదేని విషయములో ప్రత్యేక పరిజ్ఞానము కలిగి ఉన్న ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులను ఎంపిక చేసుకొనవచ్చును.

భరణపోషణ కొరకైనఉత్తర్వు.

9.(1) తనకు తానుగా పోషించుకోలేని వయోవృద్ధ పౌరుడిని పోషించుటకు సంతానము లేదా సందర్భానుసారము బంధువులు ఉపేక్షించిన లేదా నిరాకరించిన యెడల, మరియు ఆ విషయములో అట్టి ఉపేక్ష లేదా నిరాకరణ జరిగినదని ట్రిబ్యునలు సంతృప్తి చెందిన యెడల, తాను సముచితమని భావించునట్టి విధముగా అట్టి వయోవృద్ధ పౌరుని భరణపోషణ నిమిత్తము నెలవారీ రేటు చొప్పున నెలసరి బత్తెము చెల్లింపు కొరకును ఉత్తర్వు చేయవచ్చును మరియు ఆయాసమయములందు తాను ఆదేశించునట్టి రీతిలో అట్టి వయోవృద్ధ పౌరునికి దానిని చెల్లించమని అట్టి సంతానము లేదా బంధువులను ట్రిబ్యునలు ఆదేశించవచ్చును.

(2) రాజ్య ప్రభుత్వము విహితపరచునట్టి విధముగా అట్టి ట్రిబ్యునలు చే. ఉత్తర్వు చేయబడు గరిష్ఠ భరణపోషణ బత్తెము నెలకు పదివేల రూపాయలకు మించనట్టి విధంగా ఉండవలెను. భరణపోషణ బత్తెములో మార్పు.10.01) 9వ పరిచ్ఛేదము క్రింద భరణపోషణ కొరకు నెలవారీ బత్తెము ఆదేశింపబడి ఆపరిచ్ఛేదము క్రింద నెలవారీ బత్తెమును పొందుతున్న ఎవరేని వ్యక్తి యొక్క పరిస్థితులలోని అసత్య వర్ణన లేదా సంగతిని గూర్చిన పొరపాటు లేదా మార్పు రుజువైనపుడు, ట్రిబ్యునలు, భరణపోషణ బత్తెములో తాను సబబని భావించునట్టి మార్పులు చేయవచ్చును.

(2) సమర్ధ సివిలు న్యాయస్థానము యొక్క ఏదేని నిర్ణయము పర్యవసానంగా 9వ పరిచ్ఛేదము క్రింద చేయబడిన ఏదేని ఉత్తర్వు రద్దు చేయబడవలెనని లేదా పరివర్తనము చేయబడవలెనని ట్రిబ్యునలుకు తోచిన యెడల, అది తదనుసారముగా ఆ ఉత్తర్వును రద్దు చేయవలెను లేదా సందర్భానుసారము పరివర్తనము చేయవలెను.

భరణపోషణ ఉత్తర్వునుఅమలుపరచుట. 11.(1) దావా చర్యల ఖర్చులకు సంబంధించిన ఉత్తర్వుతోసహా సందర్భానుసారము భరణపోషణ ఉత్తర్వు యొక్క ప్రతిని, ఎటువంటి ఫీజు చెల్లింపు లేకుండా అది ఎవరి తరఫున చేయబడినదో ఆ వయోవృద్ధ పౌరునికి లేక సందర్భాసుసారము తల్లి/తండ్రికి ఇవ్వవలెను, మరియు బత్తెము లేక సందర్భానుసారము ఖర్చులు, చెల్లించబడని విషయములో మరియు పక్ష కారుల గుర్తింపుకు సంబంధించినంత వరకు అట్టి ట్రిబ్యునలు సంతృప్తి చెందిన మీదట, అట్టి ఉత్తర్వును, ఎవరిపై చేయబడినదో ఆ వ్యక్తి ఉన్న ఏ ప్రాంతములోనైననూ, ఏదేని ట్రిబ్యునలుచే అమలుపరచబడవలెను.


1974లో 2వది. (2) ఈ చట్టము క్రింద చేయబడిన భరణపోషణ ఉత్తర్వు క్రిమినలు ప్రక్రియా స్మృతి, 1973 లోని అధ్యాయము-9 క్రింద జారీచేయబడిన ఉత్తర్వు వలెనే అదే ప్రాబల్యము మరియు ప్రభావము కలిగి ఉండును మరియు దానిని ఆ స్మృతి ద్వారా అట్టి ఉత్తర్వు అమలుకై విహితపరచిన రీతిలోనే అమలు చేయవలెను.


కొన్ని సందర్భములలో భరణ పోషణకు సంబంధించి ఐచ్ఛికత. 1974లో 2వది. 12. క్రిమినలు ప్రక్రియా స్మృతి, 1973లోని అధ్యాయము-9లో ఏమి ఉన్నప్పటికిని సదరు అధ్యాయము క్రింద భరణపోషణ కొరకు హక్కు కలిగి ఉన్న మరియు ఈ చట్టము క్రింద భరణపోషణకు హక్కు కలిగి ఉన్నటువంటి వయోవృద్ధ పౌరుడు లేక తల్లి/తండ్రి, సదరు స్మృతిలోని అధ్యాయము-9 యొక్క నిబంధనలకు భంగము కలుగకుండ, సదరు చట్టములలోని దేని క్రిందనైనా అట్టి భరణ పోషణను క్లెయిము చేయవచ్చును అయితే రెండింటి క్రింద క్లెయిము చేయరాదు.

భరణపోషణ మొత్తమును డిపాజిటు చేయుట. 13. ఈ అధ్యాయము క్రింద ఉత్తర్వు చేయబడినపుడు, అట్టి ఉత్తర్వు ప్రకారం ఏదేని మొత్తమును చెల్లించవలసిన సంతానము లేదా బంధువు, ట్రిబ్యునలుచే ప్రకటించబడిన ఉత్తర్వు తేదీ నుండి ముప్ఫై దినముల లోపల, ఉత్తర్వు చేయబడిన మొత్తము పైకమును ట్రిబ్యునలు ఆదేశించునట్టి రీతిలో డిపాజిటు చేయవలెను.

ఏదేవి క్లెయిమును అనుమతించినపుడు వడ్డీ యొక్క అధి నిర్ణయము..

14.ఈ చట్టము క్రింద చేయబడిన భరణపోషణకై ఏదేని ట్రిబ్యునలు ఉత్తర్వు చేయునపుడు, అట్టి ట్రిబ్యునలు, భరణ పోషణ మొత్తమునకు అదనముగా ఐదు శాతమునకు తక్కువ కాకుండా మరియు పదునెనిమిది శాతమునకు మించకుండా ట్రిబ్యునలుచే నిర్ధారించబడునట్టి రేటులో మరియు దరఖాస్తు చేసిన తేదీ కంటే ముందు కానట్టి తేదీ నుండి సామాన్య వడ్డీని కూడా చెల్లించమని ఆదేశించవచ్చును: అయితే, ఈ చట్టము యొక్క ప్రారంభపు సమయములో క్రిమినలు ప్రక్రియా స్మృతి, 1974లో 2వది. 1973లోని అధ్యాయము-9 క్రింద భరణ పోషణ కొరకైన ఏదేని దరఖాస్తు న్యాయస్థానము సమక్షములో పెండింగులో ఉన్నపుడు, తల్లి/తండ్రి అభ్యర్ధనపై అట్టి దరఖాస్తును ఉపసంహరించుకొనుటకు న్యాయస్థానము అనుమతించవలెను మరియు అట్టి తల్లి/తండ్రి ట్రిబ్యునలు సమక్షములో భరణపోషణకై దరఖాస్తును దాఖలు చేయుటకు హక్కు కలిగిఉండును.

అప్పిలేటు ట్రిబ్యునలుయొక్క సంఘటన. 15.(1) రాజ్య ప్రభుత్వము అధికారిక రాజపత్రములో అధిసూచన ద్వారా, ట్రిబ్యునలు ఉత్తర్వు పై అపీలును ఆకర్ణించుటకుగాను ప్రతి జిల్లాకు ఒక అప్పిలేటు ట్రిబ్యునలును సంఘటిత పరచవలెను. (2) అప్పిలేటు ట్రిబ్యునలుకు జిల్లా మేజిస్ట్రేటు హోదాకు తక్కువకాని అధికారి అధ్యక్షత వహించవలెను. అప్పీళ్లు. 16.(1) ట్రిబ్యునలు ఉత్తర్వు ద్వారా వ్యధితుడైన ఎవరేని వయోవృద్ధ పౌరుడు లేదా సందర్భానుసారం తల్లి/తండ్రి, ఉత్తర్వు తేదీ నుండి అరవై దినముల లోపల, అప్పిలేటు ట్రిబ్యునలులో అపీలు చేయవచ్చును: అయితే, అపీలు వేసిన మీదట, అట్టి భరణపోషణ ఉత్తర్వు ప్రకారం ఏదేని మొత్తమును చెల్లించవలసిన సంతానము లేదా బంధువు, ఆ విధముగా ఉత్తర్వు చేయబడినట్టి మొత్తమును అపిలేటు ట్రిబ్యునలుచే ఆదేశించబడిన రీతిలో అట్టి తల్లి/తండ్రికి చెల్లించుటను కొనసాగించవలెను: అయితే ఇంకను, అపిలేటు ట్రిబ్యునలు, అపీలుదారు గడువులోపుగా అపీలును దాఖలు చేయుట నుండి నివారించబడినాడనుటకు తగిన కారణమున్నదని ట్రిబ్యునలు సంతృప్తి చెందిన యెడల, సదరు అరువది దినముల కాలావధి ముగిసిన తరువాత అపీలును స్వీకరించవచ్చును. (2) అపీలు అందిన మీదట, అపిలేటు ట్రిబ్యునలు ప్రతివాదికి నోటీసును తామీలు చేయబడునట్లు చూడవలెను. (3) ఏ ట్రిబ్యునలులో ఉత్తర్వుపై అపీలు దాఖలు చేయబడినదో దాని నుండి ప్రొసీడింగుల రికార్డును అపిలేటు ట్రిబ్యునలు తెప్పించుకొనవచ్చును. (4) అపిలేటు ట్రిబ్యునలు, తెప్పించుకొనిన అపీలును మరియు రికార్డులను పరిశీలించిన తరువాత, అపీలును అనుమతించవచ్చును లేదా తిరస్కరించవచ్చును.

(5) ట్రిబ్యునలు ఉత్తర్వు పై దాఖలయిన అపీలు పై అపిలేటు ట్రిబ్యునలు న్యాయ నిర్ణయము చేయవలెను మరియు నిర్ణయించవలెను, మరియు అపిలేటు ట్రిబ్యునలు యొక్క ఉత్తర్వు అంతిమమైనదై ఉండును:

అయితే స్వయముగా లేదా తగువిధముగా ప్రాధికారమీయబడిన ప్రతినిధి ద్వారా ఆకర్ణించబడుటకు ఇరుపక్ష కారులకు అవకాశము ఇచ్చిననే తప్ప ఏ అపీలు నిరాకరించబడరాదు.

(6) అపిలేటు ట్రిబ్యునలు, అపీలు అందిన ఒక మాసము లోపుగా వ్రాతమూలక మైన తన ఉత్తర్వును ప్రకటించుటకు ప్రయత్నించవలెను.

(7) ఉప-పరిచ్ఛేదము (5) క్రింద చేయబడిన ప్రతి ఉత్తర్వు యొక్క ఒక ప్రతిని ఇరుపక్ష కారులకు ఉచితముగా పంపవలెను.

శాసనిక విన్నపము చేయు హక్కు

17. ఏదేని శాసనములో ఏమివున్నప్పటికినీ, ట్రిబ్యునలు లేదా అపిలేటు ట్రిబ్యునలు సమక్షంలో ఉన్న ప్రొసీడింగులో ఏ పక్ష కారుడు న్యాయవాది లేకుండా విన్నపము చేయరాదు.

భరణపోషణాధికారి.

18.(1) రాజ్య ప్రభుత్వము, అతను ఏ పేరుతో పిలువబడినప్పటికినీ, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి లేదా జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి హోదాకు తక్కువ కాని అధికారిని భరణ పోషణాధికారిగా పదాభిదానము చేయవలెను. (2) ఉప-పరిచ్ఛేదము (1) నిర్దేశించబడిన భరణ పోషణాధికారి తాను అట్లు భావించిన యెడల, ట్రిబ్యునలు లేదా సందర్భానుసారం అపిలేటు ట్రిబ్యునలు యొక్క ప్రొసీడింగుల సమయంలో తల్లి లేక తండ్రికి ప్రాతినిధ్యం వహించవలెను.

వృద్ధాశ్రమములను స్థాపించుట,

అధ్యాయము - III

వృద్ధాశ్రమములను స్థాపించుట.

19.(1) రాజ్య ప్రభుత్వము, నిరు పేదవారైన వయోవృద్ధ పౌరులకు అందుబాటు స్థలములలో దశలవారీగా తాను అవసరమని భావించునట్టి సంఖ్యలో, ప్రారంభములో అట్టి ఆశ్రమములో నూటయాభై మందికి వసతి కల్పించునట్లుగా కనీసము ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున వృద్ధాశ్రమములను స్థాపించి మరియు నిర్వహించవచ్చును. (2) రాజ్య ప్రభుత్వము, వృద్ధాశ్రమముల ప్రమాణములు మరియు అట్టి ఆశ్రమములో నివాసముండు వారికి వారిచే కల్పించబడు వైద్య సంరక్షణ మరియు వినోద సదుపాయముల కొరకు అవసరమైన వివిధ రకముల సేవలతోపాటు అట్టి వృద్ధాశ్రమముల నిర్వహణ కొరకుగాను ఒక పథకమును విహితపరచవచ్చును.

విశదీకరణ:- ఈ పరిచ్చేదము నిమిత్తము "నిరు పేద” అనగా ఆయా సమయములందు రాజ్యప్రభుత్వముచే నిర్ధారించబడినట్లుగా తనకుతాను పోషించుకొనుటకుతగినంత జీవనాధారము లేని ఎవరేని వయోవృద్ధ పౌరుడు అని అర్ధము;

అధ్యాయము - - IV

వయోవృద్ధపౌరుల వైద్య సంరక్షణ కొరకు నిబంధనలు,

వయోవృద్ధ పౌరులకు వైద్యపరమైన మద్దతు.

20. రాజ్య ప్రభుత్వము ఈ క్రింది వాటిని కల్పించేటట్టు చూడవలెను,- (i) ప్రభుత్వ ఆసుపత్రులు లేదా ప్రభుత్వముచే పూర్తిగా లేదా పాక్షికముగా నిధులను పొందుతున్న ఆసుపత్రులు సాధ్యమైనంత వరకు వయోవృద్ధ పౌరులందరికి పడకలను సమకూర్చవలెను;

(ii) వయోవృద్ధ పౌరుల కొరకు ప్రత్యేకమైన క్యూలను ఏర్పాటు చేయవలెను;

(iii) వయోవృద్ధ పౌరులకు దీర్ఘకాలిక, తీవ్రమైన మరియు క్షీణదశలోనున్న వ్యాధుల చికిత్సకైన సదుపాయమును విస్తరింపజేయవలెను;

(iv) వృద్ధాప్యమున కైన మరియు దీర్ఘకాలిక, ముదిమి వ్యాధులకు పరిశోధనా కార్యములను విస్తరింప జేయవలెను;

(V) ప్రతి జిల్లాలోని ఆసుపత్రిలో, తగురీతిలో వృద్ధ వైద్య (జెరియాట్రిక్) సంరక్షణలో అనుభవము కలిగిన వైద్యాధికారి నేతృత్వంలో వైద్యము కావలసిన వృద్ధవైద్య (జెరియాట్రిక్) రోగులకు సౌకర్యములను ప్రత్యేకించి ఉంచవలెను.

అధ్యాయము - V

వయోవృద్ధపౌరుల ప్రాణము మరియు ఆస్తికి రక్షణ.

21. వయోవృద్ధ పౌరుల సంక్షేమమునకై ప్రచారము, అవగాహన మొదలగు నటువంటి చర్యలు. 21.రాజ్య ప్రభుత్వము, నియమిత వ్యవధులలో దూరదర్శన్, ఆకాశవాణి మరియు ముద్రణతోసహా సార్వజనిక మాధ్యమముల ద్వారా విస్తృతమైన ఈ చట్టపు నిబంధనలకు ప్రచారమునిచ్చుట; (ii) ఈ చట్టమునకు సంబంధించిన అంశములపై పోలీసు అధికార్లు మరియు న్యాయిక సేవా సభ్యులతో సహా కేంద్ర ప్రభుత్వము మరియు రాజ్య ప్రభుత్వ అధికారులకు నియతకాలిక సున్నితత్వీకరణ మరియు అవగాహన పై శిక్షణనిచ్చుట; (iii) వయోవృద్ధ పౌరుల సంక్షేమమునకు సంబంధించిన విషయములను అభిభాషిం చుటకు న్యాయ, ఆంతరంగిక వ్యవహారములు, ఆరోగ్య మరియు సంక్షేమము లను నిర్వహించు సంబంధిత మంత్రిత్వ శాఖలు లేదా విభాగములచే కల్పించబడు సర్వీసుల మధ్య ప్రభావవంతమైన సమన్వయము మరియు వాటిపై నియతకాలిక పునర్విలోకనం జరుపబడుట కొరకు అన్ని చర్యలు చేపట్టబడునట్లు చూడవలెను.

ఈ చట్టపు నిబంధనలను అమలుపరచుట కొరకు నిర్దిష్ట పరచబడు ప్రాధికారులు.

22.(1) రాజ్య ప్రభుత్వము, ఈ చట్టపు నిబంధనలు సక్రమముగా నెరవేర్చబడునట్లు చూచుటకు,జిల్లా మేజిస్ట్రేటు పై అవసరమగునట్టి అధికారములను ప్రదత్తము చేయవచ్చును మరియు అట్టి కర్తవ్యములను విధించవచ్చును మరియు జిల్లా మేజిస్ట్రేటు అట్లు తనకు ప్రదత్తము చేయబడిన లేక విధించబడిన అన్నీ లేక వాటిలో ఏవేని కొన్ని అధికారములను వినియోగించుటకు మరియు తనపై ఉంచబడిన 'కర్తవ్యములన్నింటిని లేక వాటిలో ఏవేని కొన్నింటిని నిర్వర్తించుటకుగాను తనకు అధీనస్థమైన అధికారిని మరియు ఆ అధికారిచే విహితపరచబడినట్టి అధికారములు లేదా కర్తవ్యములను నిర్వర్తించబడుటకు స్థానిక పరిధులను నిర్ధిష్ట పరచవచ్చును.

(2) రాజ్య ప్రభుత్వము, వయోవృద్ధ పౌరుని ప్రాణము మరియు ఆస్తిని రక్షించుట కొరకు ఒక సమగ్రమైన కార్యాచరణ ప్రణాళికను విహితపరచవలెను.

కొన్ని పరిస్థితులలోఆస్తి అంతరణ చెల్లకుండుట.

23.(1) ఈ చట్టపు ప్రారంభము తరువాత, ఎవరేని వయోవృద్ధ పౌరుడు, అంతరణ స్వీకర్త ప్రాధమిక సదుపాయములు మరియు ప్రాధిమిక భౌతిక అవసరములను అంతరణకర్తకు కల్పించవలెననే షరతుకు అధ్యదీనమై, దానము లేదా ఇతర విధముగా తన ఆస్తిని అంతరణ చేసినపుడు మరియు అట్టి అంతరణ స్వీకర్త అట్టి సదుపాయములను మరియు భౌతిక అవసరములను కల్పించుటకు నిరాకరించిన లేదా వాటిని ఏర్పాటు చేయుటలో విఫలమైన యెడల, సదరు ఆస్తి అంతరణ మోసము లేదా బలవంతము లేదా అనుచిత ప్రభావము క్రింద చేయబడినట్లుగా భావించవలెను మరియు అంతరణకర్త అభీష్టం మేరకు దానిని ట్రిబ్యునలుచే చెల్లనిదిగా ప్రఖ్యానించబడవలెను. (2) ఎస్టేటు నుండి భరణపోషణను పొందుటకు ఎవరేని వయోవృద్ధ పౌరుడు హక్కు కలిగి వుండి మరియు అట్టి ఎస్టేటు లేదా దానిలోని భాగము అంతరణ చేయబడినపుడు అంతరణ స్వీకర్తకు ఆ హక్కు గురించి లేదా అంతరణ ప్రతిఫలరహితమైనదని తెలిసియున్న యెడల భరణ పోషణ పొందు హక్కును అంతరణ స్వీకర్త పై అమలుచేయవచ్చును; అయితే ప్రతిఫలం కొరకు మరియు హక్కు గురించి అతనికి తెలియకుండా వున్న యెడల అంతరణ స్వీకర్త పై అమలు చేయరాదు. (3) ఎవరేని వయోవృద్ధ పౌరుడు ఉప-పరిచ్ఛేదములు (1) మరియు (2)ల క్రింద హక్కులను అమలు చేయుటలో అసమర్ధ డైన యెడల, 5వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (1)లోని విశదీకరణలో నిర్దేశించబడిన వ్యవస్థ ఏదైనను అతని తరఫున చర్య తీసుకోవచ్చును.

అధ్యాయము -- VI

విచారణ కొరకు అపరాధములు మరియు ప్రక్రియ.

వయోవృద్ధ పౌరుని పట్టించుకోకుండా వదిలివేయుట మరియుపరిత్యజించుట.

24. వయోవృద్ధ పౌరుని సంరక్షణ లేదా రక్షణ బాధ్యతను కలిగి ఉండి, అట్టి వృద్ధుడిని పూర్తిగా పరిత్యజించవలెనను ఉద్దేశంతో అతనిని ఏదేని ప్రదేశంలో వదలి వేసిన వారెవరైనను, మూడుమాసముల వరకు విస్తరించగల కాలావధికి కారాగారవాసముతోను లేదా ఐదువేల రూపాయల వరకు విస్తరించగల జరిమానాతోను లేదా రెండింటితోను వంటి ఏదో ఒక విధముతో శిక్షింపబడదగి యుండును.

అపరాధముల సంజ్ఞానము. 1974లో 2వది.

25.(1) క్రిమినలు ప్రక్రియా స్మృతి, 1973లో ఏమి ఉన్నప్పటికిని, ఈ చట్టము క్రింది ప్రతి అపరాధము సంజేయమై మరియు జామీను యోగ్యమైనదై యుండును.

(2) ఈ చట్టము క్రింద అపరాధము ఒక మేజిస్ట్రేటుచే సంక్షిప్తంగా విచారింపబడవలెను.

అధ్యాయము - - VII

వివిధములు.

అధికారులు పబ్లికు శేవకులుగా ఉండుట. 1860లోని 45వది.

26.ఈ చట్టము క్రింద కృత్యములను వినియోగించుకొనుటకు నియమించబడిన ప్రతి అధికారి లేదా సిబ్బంది భారత శిక్షా స్మృతిలోని 21వ పరిచ్ఛేదము యొక్క అర్ధములో పబ్లికు సేవకులుగా భావించబడవలెను.

సివిలు న్యాయస్థానములు యొక్క అధికారితా పరిధికి ప్రతిబంధకము.

27. ఈ చట్టపు ఏదేని నిబంధన వర్తించు ఏదేని విషయమునకు సంబంధించి ఏ సివిలు న్యాయస్థానమునకు గాని అధికారిత పరిధి ఉండదు. మరియు ఈ చట్టముచే లేదా దాని క్రింద చేసిన లేదా చేయుటకు ఉద్దేశించిన దేనిపైనైననూ ఏదేని సివిలు న్యాయస్థానము ఎట్టి వ్యాదేశమును మంజూరు చేయరాదు. సద్భావముతో తీసుకొవిన చర్యకు రక్షణ.

28. ఈ చట్టము లేదా దానిక్రింద చేయబడిన ఏవేని నియమములు లేదా ఉత్తర్వులను పురస్కరించుకొని సద్భావముతో చేసిన లేదా చేయుటకు ఉద్దేశించిన దేనికైనను కేంద్ర ప్రభుత్వము పై, రాజ్య ప్రభుత్వములపై లేదా స్థానిక ప్రాధికార సంస్థపై లేదా ప్రభుత్వము యొక్క ఎవరేని అధికారిపై ఎట్టి దావా, అభియోగము లేదా ఇతర శాసనిక చర్య ఉండరాదు.

ఇబ్బందులను తొలగించుటకు అధికారము.

29.ఈ చట్టపు నిబంధనలను అమలు చేయుటలో ఏదేని ఇబ్బంది ఏర్పడినచో, రాజ్య ప్రభుత్వము అధికారిక రాజపత్రములో ప్రచురించబడిన ఉత్తర్వు ద్వారా ఈ చట్టపు నిబంధనలకు అసంగతముగా లేనంత మేరకు అట్టి ఇబ్బందులను తొలగించుటకు, తాను ఆవశ్యకమని లేక ఉపయుక్తమని భావించునట్టి నిబంధనలను చేయవచ్చును: అయితే, ఈ చట్టము ప్రారంభమైన తేదీ నుండి రెండు సంవత్సరముల కాలావధి ముగిసిన తరువాత అట్టి ఏ ఉత్తర్వును చేయరాదు.

ఆదేశము లిచ్చుటకుకేంద్ర ప్రభుత్వమునకుఅధికారము.

30. ఈ చట్టపు నిబంధనలను అమలుపరచుటకు కేంద్ర ప్రభుత్వము రాజ్య ప్రభుత్వమునకు ఆదేశములీయవచ్చును.


పునర్విలోకనం చేయుటకు కేంద్ర ప్రభుత్వమునకు అధికారము.

31. రాజ్య ప్రభుత్వములచే ఈ చట్టపు నిబంధనల అమలు పురోగతిని కేంద్ర ప్రభుత్వము నియతకాలికంగా పునర్విలోకనం చేయవచ్చును. మరియు పర్యవేక్షించ వచ్చును.

నియమములు చేయుటకురాజ్య ప్రభుత్వమునకుఅధికారము.

32.(1) ఈ చట్టము నిమిత్తము రాజ్య ప్రభుత్వము అధికారిక రాజపత్రములో అధి సూచన ద్వారా నియమములు చేయవచ్చును

(2) పైన పేర్కొనబడిన అధికారము యొక్క సాధారణ వ్యాపకతకు భంగము కలుగకుండ అట్టి నియమములు ఈ క్రింది విషయముల కొరకు నిబంధించ వచ్చును,

(ఎ) 8వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (1) క్రింద విహితపరచబడినట్టి నియమ ములకు అధ్యదీనమై, 5వ పరిచ్ఛేదము క్రింద విచారణ జరుపు రీతి;

(బి) 8వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (2) క్రింద ట్రిబ్యునలు యొక్క అధికారము మరియు ఇతర ప్రయోజనముల కైన ప్రక్రియ;

(సి) 9వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (2) క్రింద ట్రిబ్యునలుచే ఉత్తర్వు చేయబడు గరిష్ట భరణ పోషణభత్యము; (డి) 19వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (2) క్రింద వృద్ధాశ్రమముల ప్రమాణములతో మరియు అందులో నివాస ముండు వారికి వారిచే కల్పించబడు వైద్య సంరక్షణ మరియు వినోద సదుపాయము కొరకు అవసరమైన వివిధ రకముల సేవలతోపాటు అట్టి ఆశ్రమముల నిర్వహణ కొరకైన పథకము;

(ఇ) 22వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (1) క్రింద, ఈ చట్టపు నిబంధనలను అమలుపరచుట కొరకైన ప్రాధికార సంస్థల అధికారములు మరియు కర్తవ్యములు:

(ఎఫ్) 22వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (2) క్రింద వయోవృద్ధ పౌరుల యొక్క ప్రాణ మరియు ఆస్తులకు రక్షణ కల్పించుటకు ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళిక

(జి) విహితపరచబడిన లేదా విహితపరచబడునట్టి ఏదేని ఇతర విషయము.

(3)ఈ చట్టము క్రింద చేయబడిన ప్రతి నియమమును, అది చేయబడిన వెనువెంటనే రాజ్య శాసనమండలికి ఉభయ సభలు ఉన్నపుడు ఉభయసభల సమక్షమునందు లేదా అట్టి రాజ్య శాసనముండలికి ఒకేఒక సభ ఉన్నపుడు ఆ సభ సమక్షమునందు ఉంచవలెను.