తరలి రాద తనే వసంతం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

రుద్రవీణ సినిమాలోని పాట

తరలి రాద తనే వసంతం

తన దరికి రాని వనాల కొసం ||తరలి||

గగనాల దాక అల సాగ కుంటే

మేఘాల రాగం ఇల చేరుకోద ||తరలి||



వెన్నెల దీపం కొందరిదా

అడవిని సైతం వెలుగు కదా ||2||

ఎల్లలు లేని చల్లని గాలి

అందరి కోసం అందును కాదా

ప్రతి మదిని లేపే ప్రభాత రాగం

పదే పదే చూపే ప్రధాన మార్గం

ఏది సొంతం కోసం కాదను సందేశం

పంచే గుణమే పోతె ప్రపంచమేశూన్యం

ఇది తెలియని మనుగడ కథ

దిశ తెలియని గమనము కద ||తరలి||


బ్రతుకున లేనీ శ్రుతి కలదా

ఎద సడి లోనే లయ లేదా ||2||

ఏ కళ కైనా ఏ కథ కైనా

జీవిత రంగం వేదిక కాదా

ప్రజా ధనం కాని కళా విలాసం

ఏ ప్రయోజనం లేని వృధా వికాసం

కూసే కోయిల పోతె కాలం ఆగిందా

సాగే ఏరే పాడే మరో పదం రాదా

మురళికి గల స్వరముల కళ

పెదవిని విడి పలుకదు కద ||తరలి||